కోర్టు లీగల్ కోణంలో వెలువరించిన తీర్పు సబబే… సీనియర్ నరేష్ నటించిన ‘మళ్లీ పెళ్లి’ అనే సినిమా నిజానికి తన పెళ్లిళ్ల వ్యవహారంలో తన ధోరణిని సమర్థించుకునే ప్రయత్నమే… తన వెర్షన్ జనంలోకి బాగా వెళ్లడానికి తను సినిమా మాధ్యమాన్ని వాడుకున్నాడు… తెలివైన ఆలోచన… తన మూడో పెళ్లాం రమ్య రఘుపతిని విలన్‌గా చిత్రీకరించాడు…
ఐతే సినిమా మొదట్లోనే ఈ కథ కల్పితమనే డిస్‌క్లెయిమర్ ఇచ్చేసి, ఒరిజినల్ పేర్లను పోలే కల్పిత పేర్లనే పాత్రలకు పెట్టడంతో బహుశా కోర్టుకు ఇక మరింత లోతుగా వెళ్లడానికి చాన్స్ దొరకట్టుంది… పైగా సెన్సార్ బోర్డు అప్పటికే సర్టిఫికెట్ ఇచ్చేసి ఉంది… సో, కోర్టుకు ఆ సినిమా మీద కఠినంగా వ్యవహరించేందుకు స్కోప్ లేకుండా పోయింది…
ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేసి, ఓటీటీలో కూడా లేకుండా చేయాలని బెంగుళూరులోని సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించింది రమ్య రఘుపతిగా పిలవబడే నరేష్ మూడో పెళ్లాం… ఆల్‌రెడీ రెండు పెళ్లిళ్లు గతంలోనే పెటాకులు కాగా ఈ మూడో పెళ్లి కూడా విఫలమైంది ఏనాడో… వాళ్లిద్దరూ విడివిడిగానే ఉంటున్నారు… ఈలోపు నరేష్ జీవితంలోకి పవిత్రా లోకేష్ అనబడే నటి వచ్చి చేరింది… వాళ్లు కలిసే ఉంటున్నారు… అధికారికంగా భార్యాభర్తలు కారు, అంతే…
Ads
నేను విడాకులివ్వలేదు అని రమ్య చెబుతోంది… సో, అధికారికంగా విడాకులు రానిదే పవిత్రను అధికారికంగా పెళ్లి చేసుకోలేడు నరేష్… అందుకని ‘కలిసి ఉంటున్నారు’ అంతే… భరణం, ఆస్తిలో వాటా వంటి చిక్కులేవో విడాకులకు అడ్డంకులుగా ఉన్నట్టున్నయ్… పవిత్రకు కూడా నరేష్ ఆస్తుల మీద కొంతైనా హక్కు, గ్రిప్పు రావాలంటే అధికారికంగా పెళ్లి జరగాల్సిందే… కానీ రమ్యతో నరేష్‌కు విడాకుల ఇష్యూ సెటిల్ కాకపోతే పవిత్ర కూడా ఏమీ చేయలేదు… ఇది చిక్కుముడి… ఇంకోవైపు కోర్టు తీర్పు కారణంగా ఇకపై రమ్య నరేష్ ఇంటికి వెళ్లి గొడవ కూడా చేయలేదు… ఆమె ప్రవేశాన్ని కోర్టు తిరస్కరిస్తోంది… ఒకరకంగా రమ్యపై నరేష్ రెండుమూడు రకాలుగా గెలిచినట్టు లెక్క…
మొత్తానికి రమ్య రఘుపతి నుంచి దూరం కావడాన్ని నరేష్ సినిమా, మీడియా మాధ్యమాల ద్వారా పదే పదే సక్సెస్‌ఫుల్‌గా చెప్పుకున్నాడు… ఎందరు నమ్మారనేది పక్కన పెడితే… రమ్య రఘుపతికి కూడా డబ్బులున్నయ్… ఆమె కూడా సేమ్ నరేష్‌లాగే నాలుగు డబ్బులు విసిరేసి ఎవరైనా కిరాయి దర్శకుడిని పెట్టుకుని తన వెర్షన్‌తో తను కూడా ఓ సినిమా వదలితే బెటరని అప్పట్లో అభిప్రాయాలు కొన్ని వినవచ్చాయి కూడా… నరేష్‌కు డబ్బుంది కాబట్టి తన వెర్షన్‌ను జనంలోకి బలంగా తీసుకెళ్లగలిగాడు… రమ్యకు కూడా వేరే ఆప్షన్ లేదు…
ఈ సినిమా సగటు ప్రేక్షకుడిని దృష్టిలో పెట్టుకుని తీసింది కాదు… పవిత్రతో తన బంధాన్ని పవిత్రంగా చూపించడం, రమ్యను విలన్‌గా ప్రొజెక్ట్ చేయడమే నరేష్ ఆంతర్యం… సేమ్, అవే పరిమిత లక్ష్యాలతో రమ్య కూడా ఓ ప్రయత్నం చేయొచ్చు… ఆమెకు కూడా డబ్బుంది… మీడియా బయాస్డ్‌గా ఉంటుంది… దాన్నే నమ్ముకోవడం వేస్ట్…
ఆమె ప్రయత్నిస్తే ఆర్జీవీ వంటి ఏదో దర్శకపక్షి దొరక్కపోదు… తను డబ్బులు తీసుకుని బయోపిక్కులు తీస్తున్నాడు కదా… నాసిరకం ప్రజెంటేషనే అయినా సరే, జనంలోకైతే వెళ్తోంది కదా… (ఆమధ్య కొండా మురళి బయోపిక్ తీసి, ఇప్పుడు జగన్ రాజకీయ జీవితం మీద రెండు పార్టుల సినిమాలు తీస్తున్న సంగతి తెలిసిందే కదా…) లేకపోతే తన దగ్గరి బంధువు, తన కుటుంబసభ్యుడు, కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దగ్గర పనిచేస్తున్న ఏ అసోసియేట్ దర్శకుడైనా తన వెర్షన్ సినిమా తీయడానికి సరిపోతాడు… తద్వారా ‘మళ్లీ పెళ్లి’ని ఆపలేకపోయిన రమ్య కనీసం నరేష్ ‘ఐదో పెళ్లి’నైనా అడ్డుకోగలదేమో…
Share this Article