ముందుగా ఒక వార్త… ‘‘ఇటీవలి కాలంలో సినీ రంగంలో బాగా పాపులరైన మహిళ పవిత్ర లోకేశ్… సీనియర్ నటుడు నరేశ్ తో ఆమె సహజీవనం బాగా వార్తల్లో నలుగుతోంది ఇంకా…!! ఇప్పుడు మరోసారి ఆమె వార్తల్లోకి ఎక్కింది… కన్నడ యూనివర్శిటీ నిర్వహించిన పీహెచ్డీ కామన్ ఎంట్రన్స్ పరీక్షలో ఆమె ఉత్తీర్ణురాలైంది… కన్నడ యూనివర్శిటీ వివిధ విభాగాల కింద పీహెచ్డీ చేయడానికి అవకాశం కల్పిస్తోంది… వివిధ విభాగాల్లో పీహెచ్డీ చేసేందుకు 981 మంది ఎంట్రన్స్ పరీక్ష రాయగా… వీరిలో 259 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు.
తనకు కన్నడలో పీహెచ్డీ చేయాలనే కోరిక ఉండేదని గతంలోనే పవిత్ర చెప్పింది… ఇందులో భాగంగా బెల్గాం ఎక్స్ టెన్షన్ సెంటర్ లో పరిశోధన చేసేందుకు పవిత్ర పరీక్ష రాసింది… మే 30న ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసింది…’’ ఇదండీ వార్త… ఆమె వ్యక్తిగత, వైవాహిక జీవితం మీద వివాదాలు ఎలా ఉన్నా సరే, ఈ విషయంలో ఆమెను అభినందించాలి…
ఎందుకంటే..? ఒకసారి సెలబ్రిటీ అయ్యాక, ఒకసారి వెండితెర వెలుగుల రుచి మరిగాక… ఆ రంగుల జిలుగుల్లోనే పడి కొట్టుకుపోతారు తప్ప నటులు పెద్దగా చదువు మీద కాన్సంట్రేట్ చేయరు, చేయడం కుదరదు కూడా… ఇప్పుడంటే విద్యాధికులు కూడా ఇండస్ట్రీకి వస్తున్నారు… ఎంబీఏలు, ఇంజనీరింగులు చేసిన వాళ్లు కూడా టీవీలు, సినిమాల్లోకి వస్తున్నారు… హీరోయిన్ సాయిపల్లవి అదేదో పాత రష్యన్ కంట్రీలో మెడిసిన్ చదువుకుంది…
Ads
ఇక్కడ ప్రాక్టీస్ చేయాలన్నా, ఉన్నత చదువులు చదవాలన్నా ఎంసీఐ నిర్వహించే అర్హత పరీక్ష పాస్ కావల్సి ఉంటుంది… అది కష్టం, క్లిష్టం… సాయిపల్లవి ఆ పరీక్ష రాసింది మొన్నటి కరోనా కాలంలో… రిజల్ట్ సంగతి తెలియదు… ప్రస్తుతం ఫేమస్ అయిపోయిన శ్రీలీల కూడా మెడిసిన్ చదువుకుంది… ఇవే కాదు, ఇంకొన్ని ఉదాహరణలున్నయ్… కానీ గతంలో నటీమణులు పెద్దగా చదువుకున్నవారు కాదు… ఒకసారి మేకప్ వేసుకోవడం మొదలెట్టాక ఇక చదువు అటకెక్కడమే… ఈ నేపథ్యంలో పవిత్ర లోకేష్ చదువు మీద తన ఆసక్తిని చంపుకోలేకపోవడం, ఈరోజుకూ ఆమె చదువు మీద ఆసక్తి చూపిస్తున్న తీరు అభినందనీయం…
ఆమె పుట్టిన ఊరు మైసూరు… తండ్రి లోకేష్ ఓ సినిమా నటుడు… తల్లి ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్… చిన్న తమ్ముడు ఆది… నటుడే… ఈమె పదో తరగతిలో ఉన్నప్పుడే తండ్రి మరణించాడు… ఓ ప్రభుత్వ ఉద్యోగి కావాలనుకుంటున్న ఆమెను అంబరీష్ సినిమాల్లో చేరడానికి ప్రోత్సహించాడు… ఎస్సెస్సీ 80 శాతం మార్కులతో పాసైన ఈమె ‘‘కుటుంబం కోసం’’ మేకప్ వేసుకుంది… జయాలు, అపజయాలు… వీటన్నింటి నడుమ డిగ్రీ ఎలాగోలా పూర్తిచేసింది…
సివిల్ సర్వీసెస్ మీద ఆసక్తితో పరీక్షలు రాసింది… కానీ దానికి పార్ట్ టైం చదువు పనికిరాదు… అటు సినిమాలు, తరువాత టీవీల్లో వేషాలు, మరోవైపు చదువు… శృతి కుదరలేదు… డిగ్రీ అయ్యాక మొదట ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌తో పెళ్లి… తరువాత ఆయనకు విడాకులు… సినిమాల్లో నటిస్తున్నప్పుడు సుచేంద్రప్రసాద్‌తో ప్రణయం, 2006 నుంచి సహజీవనం… 2018 వరకూ అలాగే… ఈ రెండో పెళ్లి ద్వారా ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా… తరువాత నరేష్‌తో పరిచయం, ప్రణయం… అప్పటికే నరేష్‌కు మూడు పెళ్లిళ్లు, మూడూ పెటాకులు… కానీ ముగ్గురి ద్వారా ముగ్గురు కొడుకులు…
నరేష్‌కు నాలుగో పెళ్లి, పవిత్రకు మూడో పెళ్లి దిశగా వాళ్ల సహజీవనం నడుస్తోంది ప్రస్తుతానికి… ఆ పెళ్లి కథకు చాలా విఘ్నాలున్నాయి, అది వేరే కథ… అటు సినిమాలు, ఇటు టీవీలు, మరోవైపు నరేష్‌తో సహజీవనం, నరేష్ మూడో పెళ్లాం రమ్య పెట్టే చికాకులు, గొడవలు… వీటి మధ్య ఆమె ఈ 45 ఏళ్ల వయస్సులోనూ విద్య మీద ఆసక్తిని చంపుకోకుండా ఉండటమే మనం ఇప్పుడు చెప్పుకుంటున్న విశేషం… ఆల్ ది బెస్ట్ పవిత్రా… యువార్ డిఫరెంట్…
Share this Article