విదేశాల్లో ఏనాటి నుంచో ఉన్నదే… మన దేశంలో కూడా చాన్నాళ్లుగా ఉన్నదే… హైదరాబాదులో కూడా స్టార్టయి మూణ్నాలుగేళ్లు అయ్యిందట… మీ కారుకు నీటి ఆవిరితో వాషింగ్ అనే ప్రకటన ఒకటి అనుకోకుండా ఫేస్‌బుక్‌లో కనిపించింది, ఆసక్తికరం అనిపించింది… మీ కారును మళ్లీ కొత్త కారు చేసేస్తాం అంటోంది వాళ్ల యాడ్…
అందులో ఆకర్షించింది ఏమిటంటే..? మొత్తం కారు వాషింగుకు నాలుగు లీటర్ల లోపే నీటిని వాడటం, అదీ నీటిని ఆవిరిరూపంలో ప్రెషర్‌తో వాడటం, ఇంటి దగ్గరకే వచ్చి కారును కడగడం… అంతేకాదు, వ్యాక్సింగ్, డియోడరైజింగ్, యాంటీ బ్యాక్టీరియల్ స్ప్రే తదితరాలూ ఇంట్రస్టింగుగా కనిపించినయ్…
నిజానికి నగరంలో చాలాచోట్ల ఫోమ్ (నురగ)తో కారును కడగడం చాన్నాళ్లుగా ఉన్నదే… ఎక్కువ పీడనంతో నీటిని స్ప్రే చేయడం వల్ల దుమ్ము, నురగతో కడగడం వల్ల మరకలు, బురద ఎట్సెట్రా వెళ్లిపోతాయి… కేవలం బాడీ వాష్ అయితే 300 దాకా తీసుకుంటారు… ఫుల్ బాడీ వాష్ అంటే లోపల కూడా వాక్యూమ్ క్లీనర్‌తో క్లీన్ చేసి, మ్యాట్స్ తదితరాలను కూడా కడుగుతారు… ఇంజన్‌లోకి కూడా నీటిని గన్‌తో కొడతారు… ఓవరాల్‌గా వాషింగ్ బాగానే అనిపిస్తుంది కానీ…
Ads
మామూలు వాషింగ్‌లో ఇంటీరియర్ క్లీనింగు మీద కాన్సంట్రేట్ చేయరు… అందుకే ఈ స్టీమ్ వాషింగ్ సంగతేమిటో చూద్దామని బుక్ చేశాను… రకరకాల ప్యాకేజీలున్నయ్… 800 బేసిక్ ప్యాకేజీ… ఇందులో కేవలం బాడీ వాష్, మ్యాట్స్ క్లీనింగ్ ఉన్నయ్… అంతే… 1200 ప్యాకేజీ అయితే ఇంకాస్త ఎక్కువ క్లీనింగ్… ఎస్‌యూవీ అయితే 300 ఎక్సట్రా… మరీ స్పెషల్ ప్యాకేజీ అయితే 2200… నిజానికి ఫోమ్ వాష్‌తో పోలిస్తే బాగా ఎక్స్‌పెన్సివ్…
మెషిన్లు ఎంత సహకరించినా… పనిచేసే సిబ్బంది ప్రొఫెషనలిజం, పని మీద శ్రద్ధ మాత్రమే పనిలో పరిణతిని కనిపించేలా చేస్తాయి… ఇద్దరు వచ్చారు… నీటి ఆవిరిని గన్‌తో స్ప్రే చేస్తూ, బట్టతో తుడుస్తూ నీటి ప్రెషర్ గన్‌కన్నా బాగా ఆపరేట్ చేశారు… ప్రత్యేకించి డోర్ల బీడింగ్స్, ఏసీ వెంట్స్, బూట్ స్పేస్ దగ్గర ఫోమ్ వాషర్లు పెద్దగా పట్టించుకోరు… ఈ స్టీమ్ వాషర్లు అవన్నీ కీన్‌గా క్లీన్ చేశారు…
తరువాత వ్యాక్సింగ్, యాంటీ బ్యాక్టీరియల్ కెమికల్ స్ప్రే… ప్రతి ఇంచూ వదల్లేదు… పైన ఫోటోలో చూపిన స్పాడెక్స్ మాత్రమే కాదు… ఇంకా పలు కంపెనీలు ఆపరేట్ చేస్తున్నట్టున్నాయి… కొంత ఎక్కువ ఖరీదును చెల్లించడానికి సిద్దపడితే మాత్రం కారు బాగా శుభ్రపడిపోతుంది… ప్రత్యేకించి ఇంటీరియర్ ఏ వాసన లేకుండా వాష్ అయిపోతాయి… అంతా అయిపోయాక చూస్తే, కారు కడిగిన చోట కడిగినట్టు ఆనవాళ్లు కూడా కనిపించలేదు… గుడ్…
కొందరు సంప్రదాయ వాషర్లు వాషింగ్ అయిపోయాక అదనపు చార్జి తీసుకుని… కారులో తుప్పుకు అవకాశం ఉన్నచోట్ల యాంటీ రస్ట్ కెమికల్ స్ప్రే చేస్తారు… అది ఇంకా బెటర్… కాకపోతే వాషింగ్ చేయించిన ప్రతిసారీ అది అవసరం లేదు… షోరూముల్లో ఫ్రీ సర్వీస్ ఆప్షన్ ఉన్నప్పుడు చేయించడం బెటర్… కానీ పెయిడ్ సర్వీసింగ్ తప్పనిసరైనప్పుడు ప్రైవేటుగా సర్వీసింగ్ చేసే ఆపరేటర్లు కూడా వచ్చారు… అవి మరెప్పుడైనా చెప్పుకుందాం…
Share this Article