Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పాటకు ఖాకీ నివాళి… నక్సల్ తుపాకీకి ఓ పోలీస్ తుపాకీ సెల్యూట్…

August 7, 2023 by M S R

ఈ ఫోటో, ఈ నివాళి ఆశ్చర్యకరం… ఏ రాజ్యం మీద ఆయన ఏళ్ల తరబడీ పోరాడాడో, ఏ రాజ్యంపై తుపాకుల తిరుగుబాటుకు పాటతో ప్రాణం పోశాడో…  అదే రాజ్యం ఆయనకు తుపాకులతో గౌరవవందనం సమర్పిస్తోంది… ఒకప్పుడు ఖాకీ అధికారులంటేనే గద్దర్‌కు వ్యతిరేకత… గద్దర్ అంటేనే పోలీసులకు కంపరం… ఆ పాట లక్షలాది మందిని విప్లవ సానుభూతిపరుల్ని చేస్తోందని…

ఓ దశలో అజ్ఞాత తూటా ఒకటి గద్దర్ ప్రాణాలు తీయడానికి కూడా దూసుకొచ్చింది… ఇంకా నూకలున్నయ్ గనుక ఆ పాట బతికిపోయింది… ఆ తూటా ఎవరిదో అందరూ అర్థం చేసుకోగలరు… అలాంటిది ఓ ఐపీఎస్ అధికారి తనకు నివాళి అర్పించడం మరీ అబ్బురం అనలేం గానీ విస్మయకరం… అరె, ఆయన ఎప్పుడో విప్లవ రాజకీయాలకు స్వస్తి పలికాడు, రాజకీయాల్లోకి వచ్చేశాడు… ఇప్పుడు ఆయన్ని ఓ పోలీస్ అధికారి వ్యతిరేకించాల్సిన పనేమి ఉంది అంటారా..? అవును, అదీ నిజమే…

సజ్జనార్ అంటే కూడా తుపాకీ గుర్తొస్తుంది… రేపిస్టులను, యాసిడిస్టులను తూటాలతో పైకి పంపించిన ఆయన తుపాకే గుర్తొస్తుంది… ఆయన కూడా ఓ పోలీస్ ఉన్నతాధికారి… అయితేనేం సొసైటీని ఓ వ్యక్తిగా చూస్తూ మంచీచెడూ సొంతంగా విశ్లేషించుకునే వ్యక్తి… అందుకేనేమో గద్దర్‌కు నివాళి అర్పించాడు… పోలీసుగా కాదు, ఓ వ్యక్తిగా… ఓ మనిషిగా… ఇది చదవండి… (తన ట్వీట్‌కు పైలం కొడుకో అనే పాటను జతచేశాడు కూడా…)

Ads

sajjanar



గద్దర్ కు సజ్జనార్ నివాళి: కన్నీటి సిరాను కలంలో నింపి హృదయ పలకం మీద రాస్తున్న చరాక్షర నివాళి! గద్దర్.. ఇది పేరు కాదు ఒక బ్రాండ్. విప్లవ ప్రయాణానికి రథ సారథి ఆయన. పేదల పక్షాన జరిగే పోరాటాలకు వెన్నెముక. ఎన్నో ప్రభుత్వాలను ప్రజల పక్షాన అడిగిన ప్రశ్న.

పాట అంటే చెవులతో కాదు వినేది.. పాటంటే గుండెలతో విని మెదడులో ఆలోచనలు రేపేది అని పరమార్థాన్ని చెప్పేది.. పాటంటే మాటలతో తూటాలను ఎక్కుబెట్టి.. అన్యాయపు మర్మాన్ని రట్టు చేసేది అని అర్ధం అని చెప్పిన వారు గద్దర్.

ఎన్నో ప్రజా పోరాటాలను ముందుండి నడిపించి, అన్ని పక్షాల ప్రజలను కలుపుకుని సమ సమాజ నిర్మాణానికి అలుపెరగని పోరాటం చేసి, మృత్యువుతో పోరాడి ఓడినా.. ప్రజల నాలుకలపై పాటవై చిరంజీవిగా నిలిచిన గద్దర్ గారికి TSRTC యాజమాన్యం పక్షాన మరియు TSRTC ఉద్యోగుల పక్షాన నివాళులు అర్పిస్తున్నాం.

గద్దర్ గారితో నాకు సుమారు దశాబ్ద కాలంగా పరిచయం ఉంది. ప్రజా ఉద్యమంలో ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర గురించి ఎన్నో సందర్భాలలో నాతో పాలు పంచుకున్నారు. ఉద్యమం అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిపే పోరాటం కాదని, ప్రజల హక్కులను కాపాడుకోవడం అని ఎన్నోసార్లు చెప్పేవారు.

ఒకానొక సందర్భంలో తను రాసిన పాట “మల్లె తీగకు పందిరి వోలె… మసక చీకటిలా వెన్నెలవోలె నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మా తొడ బుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా” అనే పాటకు ప్రభుత్వం నంది అవార్డు ప్రకటించినా తను దానిని తిరస్కరించినట్లు చెప్పి పాట పై తనకున్న గౌరవాన్ని చాటి, పాటంటే వ్యాపారం కాదని, పాటంటే ప్రజల నాడి అని చెప్పారు.

గద్దర్ గారు ఎన్నో సందర్భాలలో నన్ను కలిసి ఆయన మీద నమోదైన కేసుల గురించి చర్చించేవారు. తను చెప్పవలసిన విషయాన్ని ఎంతో ధైర్యంగా, మృదువుగా చెప్పేవారు. ఎంత పెద్ద అధికారి అయినా రాజకీయ నాయకులనైనా, వయసులో తనకంటే చిన్న వారిని కూడా నోరారా “అన్నా” అని పిలిచేవారు. ఆసువుగా పాట పాడటంలో గద్దర్ గారిని మించిన కవి, గాయకుడు లేరని చెప్పవచ్చు.

తెలంగాణ ఉద్యమాన్ని కలిసికట్టుగా నడిపిన నాయకులు ఎందరు ఉన్నా, తెలంగాణ సాధించిన ఘనత పాటల తల్లిదని చెప్పి సంతోషించే వారు. ఈ మధ్య కాలంలో గద్దర్ గారి ఆరోగ్యం క్షీణించిందని తెలిసింది. సమయాభావం వల్ల కలువలేక పోయాను. పాట నిలిచి ఉన్నంత కాలం గద్దర్ బ్రతికే ఉంటారు. ఉద్యమ కారులు ఎవ్వరు చనిపోయినా ఆయన అక్కడికి చేరుకొని తన పాటలతో నివాళులు అర్పించేవారు. ఈ రోజు ఆయనకు నివాళులు అర్పించడం అనేది బాధాకరం. గద్దర్ గారి కుటుంబ సభ్యులకు మరియు ఆయన అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మోడీజీ… అన్నీ బాగానే చెప్పావు… కానీ ఆ ఒక్క ప్రశ్నకు జవాబు..?!
  • ఆ భూకంపాలు ప్రకృతి కోపమా..? అణ్వస్త్ర గోదాముకు పడిన తూట్లా..?!
  • నీకోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో… ఇదో వింత కథ…
  • ఏమాత్రం ధృవీకరణ లేని… ఓ డిటెక్టివ్ స్టోరీ ఫ్రం ఆపరేషన్ సిందూర్…
  • మళ్లీ ఓసారి ఈ దేశం ఈ ఐరన్ లేడీ ఇందిరని గుర్తుతెచ్చుకుంటోంది..!!
  • ‘‘మొగుడు పోయిన ఆడది, ఎన్నిక ఓడిన లీడర్ జనంలోకి వెళ్లొద్దు’’
  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions