పొద్దున్నే ఓ న్యూస్ వాట్సప్ గ్రూపులో ఓ కంటెంట్… గ్లోబల్ పీస్ ఇండెక్స్ సర్వేలో దేశాలకు ర్యాంకింగ్స్ ఇచ్చారు… టాప్ టెన్ సేఫెస్ట్ కంట్రీస్ తరువాత కెనడా పదకొండో స్థానం… ఇండియా 126వ ప్లేసు… ఆ తరువాతే అమెరికాకు 131వ ర్యాంకు… 146వ ప్లేసులో పాకిస్థాన్, 163వ ర్యాంకుతో అఫ్ఘనిస్థాన్ చివరి ప్లేసు… సరే, వీటి ర్యాంకుల మాటెలా ఉన్నా కెనడా పదకొండో సేఫెస్ట్ కంట్రీ అనే వాక్యం దగ్గర కలం ఆగిపోయింది…
ఎందుకంటే… అంతకుముందే మరో వార్త కనిపించింది… కెనడాలో మరో హిందువుల ఆలయంపై ఖలిస్థానీ శక్తుల దాడి అనేది ఆ వార్త… ఒక్కసారి ముందుగా సేఫెస్ట్ కంట్రీల జాబితా చూడండి…
Rank Safest Countries in the World
#1 Iceland
#2 Denmark
#3 Ireland
#4 New Zealand
#5 Austria
#6 Singapore
#7 Portugal
#8 Slovenia
#9 Japan
#10 Switzerland
#11 Canada
Ads
అన్నీ చిన్న చిన్న దేశాలు… ఐస్‌ల్యాండ్ మొత్తం జనాభా మన హైదరాబాద్‌లోని ఓ పెద్ద కాలనీ జనాభాకు సమానం కావచ్చు బహుశా… గొడవలు తక్కువ… ఈ జాబితా కాస్త రీజనబులే… ఎటొచ్చీ కెనడా సిట్యుయేషనే డౌట్… ఎందుకంటే అక్కడ తరచూ హిందువులపై విద్వేషం చేతల్లో కనిపిస్తోంది… ఖలిస్థానీ శక్తులకు అది అడ్డాగా మారిపోయింది… ఎంపీలుగా ఎన్నికైన సిక్కులు, కేబినెట్‌లో స్థానం… సిక్కులు ఇప్పుడు కెనడాలో కీలకం…
కెనడా అంతటా వ్యాపారాల్లో, వ్యవసాయంలో, రాజకీయాల్లో బాగా విస్తరించిపోయారు… గతంలో ఖలిస్థాన్ ఉద్యమం హింసాత్మకంగా, ఉధృతంగా సాగినప్పుడు హిందువుల ఊచకోత సాగేది… రోజూ స్కోర్ వేసేవాళ్లు పత్రికల్లో… ఆ రోజులు మళ్లీ గుర్తొస్తున్నాయి… కెనడా ఒక్కటే కాదు, ఆస్ట్రేలియా, బ్రిటన్ కూడా ఇప్పుడు ఖలిస్థానీ శక్తులకు నిలయాలు… అమెరికాలో కొలువు, చదువు అవకాశాలు దక్కని మన విద్యార్థులు ఏటా వేలల్లో కెనడా చేరుకుంటున్నారు… అందుకే ఇప్పుడు ఖలిస్థానీ శక్తుల బలోపేతం అవుతున్న తీరుపై ఆందోళన…
అంతెందుకు..? పంజాబ్‌లోనే ఆ శక్తుల సహకారంతోనే ఆప్ గెలుపు… మిగతా సంప్రదాయిక పార్టీలు గత ఎన్నికల్లో నేలకరిచాయి… మోడీ ప్రధాని హోదాలో పంజాబ్ వెళ్తే ఒకే ఒక ట్రాక్టర్ అడ్డుపెట్టి ఓ ఫ్లయ్ ఓవర్‌పై నిర్బంధించారు… ఢిల్లీ పరిసరాల్లో తిష్ట వేసి, ఎర్రకోటపై జెండా ఎగరవేసి, వ్యవసాయ చట్టాల్ని ప్రధాని నోటితోనే రద్దు చేస్తున్నామని చెప్పించి, క్షమాపణ కూడా చెప్పించారు… అంటే ఎంతగా బలం పెంచుకుంటున్నారో అర్థం చేసుకోవాలి…
మరి ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్ దేశాల్లో రాబోయే రోజుల్లో హిందువుల పరిస్థితి ఏమిటి..? ఇదీ అందరినీ కలవరపాటుకు గురిచేస్తున్న ప్రశ్న… యాంటీ మోడీ, యాంటీ బీజేపీ ధోరణితో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ గట్రా పార్టీలు ఖలిస్థానీ శక్తుల ఆగడాల్ని ఖండించకపోవచ్చుగాక… అదే ఖలిస్థానీ భావజాలానికే ఇందిర కన్నుమూయవచ్చుగాక… ఆప్ వంటి అవకాశవాద పార్టీలకు ఖలిస్థానీ ఆలంబన అక్కరకొస్తుండవచ్చుగాక… మోడీ ప్రభుత్వానికి ఈ విషయాలపై అసలు ఓ దశ, ఓ దిశ, ఓ ఆలోచన ఉన్నాయా అనేది అస్సలు సమాధానం దొరకని ప్రశ్న…
Share this Article