పెద్ద పులి, చిరుత పులి, జాగ్వార్ ఇలా ఏ రకం పులి అయినా, సింహాలు అయినా అంతరించిపోతున్న వన్య ప్రాణి జాబితాలో ఉన్నాయి.
1.వాటిని కొట్టడం, చంపడం, వాటి జీవనాన్ని అడ్డుకోవడం నేరం అవుతుంది.
2.మానవుల మీద దాడి చేసినపుడు వాటిని పట్టి బంధించి దూరంగా అడవిలో వదిలిపెట్టాలి అంతే కాని వాటిని చంపకూడదు.
3.ఒక వేళ చంపాల్సిన అవసరం ఏర్పడినప్పుడు దానికోసం విధి, విధానాలు ఉన్నాయి వాటిని తప్పక పాటించాలి.
4. ఏ మాత్రం తేడా వచ్చినా ఉద్యోగాలు పోతాయి, జైలు శిక్ష వేయడం వలన.
5. రూల్స్ ఎంత కఠినంగా ఉంటాయో ఒకసారి జంతు పరిరక్షణ చట్టం చదివితే తెలుస్తుంది.
********
Ads
ఘనత వహించిన TTD చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు కాలి బాటలో తిరుమల వెళ్లే భక్తులకీ చేతి కర్రలు ఇస్తాము అని అనడం బాధ్యతా రాహిత్యం!
అసలు ఆ మాట అనడానికి ఆయనకి అధికారం లేదు. అలాంటి ప్రకటన ఇవ్వాల్సింది జిల్లా కలెక్టర్ అది కూడా అటవీ శాఖ అధికారులతో సంమావేశం నిర్వహించి వేరే దారి లేదు అని అందరూ ఏకగ్రీవంగ ఒప్పుకుంటే అప్పుడు కలెక్టర్ ప్రకటిస్తారు. అఫ్కోర్స్ ఇలాంటివి కోర్టులో చెల్లవు.
*******
ఇప్పటికే ఓ మూడు కేసులు వివిధ కోర్టులలో విచారణ లో ఉన్నాయి. ఈ కేసులు అన్నీ పులలుని చంపినందుకు గాను అటవీ శాఖ అధికారులతో పాటు చంపడానికి అనుమతి ఇచ్చిన ఆయా జిల్లా కలెక్టర్లు కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.
రేపో మాపో ఎవరో ఒకరు హై కోర్టులో కానీ, సుప్రీం కోర్టులో కానీ TTD చైర్మన్ గారి ప్రకటన ని ఛాలెంజ్ చేస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తారు చూడండి!
కోర్టు కనుక సదరు PIL ని విచారణ కోసం స్వీకరిస్తే అక్షింతలు తప్పవు.
కోర్టు నిపుణుల కమిటీ వేసి రిపోర్టు ఇవ్వమంటుంది.
సదరు కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ని పరిగణలోకి తీసుకుంటే ?
ముందు జనావాసాల వైపు పులులు, ఎలుగుబంట్లు ఎందుకు వస్తున్నాయో అడుగుతుంది. దానికి మీరు ఇచ్చే సమాధానం ఎలాగూ కోర్టు ఒప్పుకోదు , కాకపోతే ”సూది కోసం సోదికేళితే పాత రంకు బయట పడ్డది” అన్న చందంగా అవుతుంది!
జగన్మోహన్ రెడ్డి మీవాడే కరుణాకర్ రెడ్డి గారూ, కానీ కోర్టులు మీవి కాదని ఇప్పటికే చాలా సార్లు తెలిసిపోయింది కదా?
అంచేత నేనన్నది వేరు మీడియా చెప్పింది వేరు అని కరుణాకర్ రెడ్డి గారి చేత వివరణ ఇప్పించేయండి చాలు. అప్పుడు పిల్ ఉండదు మిమ్మల్ని గిల్లుడు ఉండదు.
అసలే పవన్ మాంచి ఊపు మీద ఉన్నాడు. పులులని కొట్టడానికి కర్రలు ఇస్తాడుట అంటూ బహిరంగ సభలో మీమీద ఛలోక్తులు విసరడం ఖాయం!
అప్పుడు గౌరవనీయ మహిళా మంత్రివర్యులు, మాజీ సినీ నటి, జబర్దస్త్ కార్యక్రమ మాజీ న్యాయమూర్తి గారు అయిన రోజా రెడ్డి గారు పవన్ మీద ప్రతి విమర్శలు చేయడం, ఇంత రచ్చ అవసరమా ? జగన్మోహన్ రెడ్డి గారు?
*********
తిరుమల నడక దారిలో కంచె వేయడానికి మా ప్రభుత్వం లేదా TTD వద్ద తగినన్ని నిధులు లేవు అని మాత్రం అనకండి!
చూశారుగా! ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీ వాల్. రాపిడ్ రైల్ ప్రాజెక్ట్ కోసం 245 కోట్లు ఇవ్వడానికి నిధులు లేవు అన్నందుకు ప్రకటనల కోసం 1100 కోట్లు ఖర్చు పెట్టినందుకు వాళ్ళ దగ్గర నుండి డబ్బు వసూలు చేసి మరీ రాపిడ్ రైల్ ప్రాజెక్ట్ కి అప్పచెపుతాము అని వార్నింగ్ ఇచ్చిందిi. చివరికి 415 కోట్లు ఇవ్వమని ఆదేశాలు ఇచ్చింది హై కోర్టు.
మీదగ్గర అలాంటి అవకాశం లేదు కానీ ప్రభుత్వ సలహాదారులు ఎంతమంది? వాళ్ళ కోసం సంవత్సరానికి ఎన్ని వందల కోట్లు ఖర్చు చేస్తున్నారో వివరాలు ఇవ్వమని అడగే అవకాశం ఉంటుంది!
లేదూ ఇప్పటివరకు ప్రభుత్వ సలహాదారులకి ఇచ్చింది వసూలు చేసి కంచె వేయిస్తాము అని అనవచ్చు!
కోర్టు అలా అనక ముందే మీరే కంచె వెయిస్తాము అని ప్రకటిస్తే అంతా సద్దుమణుగు
వెంకటేశ్వర స్వామితో ఆటలొద్దు, రాజకీయం అసలే వద్దు! గోవింద!……….. – పార్ధసారధి పోట్లూరి
Share this Article