మనిషి చంద్రుడిపై కాలు మోపాడా? చందమామపై అడుగు పెట్టిన మొదటి వ్యక్తి నీల్ ఆర్మ్ స్ట్రాంగేనా? అసలు 1969 లో ఏం జరిగింది? అపోలో 11 మిస్టరీ ఏంటి? 1972 తరవాత అమెరికా మూన్ మిషన్స్ ను అర్ధాంతరంగా ఎందుకు ఆపేసింది? జాబిల్లిపై గ్రహాంతరవాసులు నిజంగా ఉన్నారా? రష్యా – అమెరికా ప్రచ్ఛన్నయుద్ధం పర్యవసానాలు ఏంటి? ఇస్రో చంద్రయాన్ 3 నేపథ్యంలో భూ ఉపగ్రహం లూనా [#Luna] ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం ఐంది!
యూఎస్ – యూఎస్ఎస్ఆర్ ప్రాక్సీవార్!
భూగోళంపై రష్యా, అమెరికాల ఆధిపత్య పోరు ఏకబిగిన 45 ఏళ్లపాటు సాగింది! 20 వ శతాబ్దం చివరి దశకంలో యూఎస్ఎస్ఆర్ [#USSR] కుప్ప కూలి, క్రెమ్లిన్ భవనంపై స్వతంత్ర రష్యా జెండా ఎగరడంతో రెండు అగ్రరాజ్యాల మధ్య ప్రచ్ఛన్నయుద్దానికి తెర పడింది! అప్పటి వరకు రష్యా అణు పరీక్షలు చేస్తే అమెరికా చేయాల్సిందే! రష్యా వార్సా [#WarsawPact] కూటమి కడితే, అమెరికా నాటో [#NATOPact] కూటమి కట్టాల్సిందే! 2 వ ప్రపంచయుద్ధం తరవాత అది మరో మలుపు తీసుకుని అంతరిక్ష యుద్దానికి దారితీసింది!
Ads
రష్యా స్పుత్నిక్ [#Sputnik] ను పంపితే, అమెరికా ఎక్స్ ప్లోరర్ [#Explorer] ను స్పేస్ లోకి పంపింది! ఇదెంత వరకు వెళ్లిందంటే, అంతరిక్ష పరిశోధనల్లో పోటీ పడుతోన్న రష్యాకు చెక్ పెట్టడానికి, సిగ్గుఎగ్గూ వదిలేసి అమెరికా కట్టు కథలు చెప్పేవరకు! సినిమా సెట్టింగులో మూన్ వాక్ చేసేంత వరకు! మేం చంద్రమండలంపై అడుగుపెట్టాం అని ఫేక్ ప్రచారం చేసుకునేంత వరకు! నాసా [#NASA] చారిత్రక తప్పిదాన్ని అడ్డమైన లాజిక్కులతో సమర్థించుకుంటూ శాస్త్ర ప్రపంచాన్నే కాదు, సభ్య సమాజాన్నీ మభ్య పెడుతూ అమెరికా తన దిగజారుడుతనాన్ని ఇంకా సవరించుకోనంత వరకు! ఇప్పటికీ స్పష్టత కొరవడి అయోమయం వీడనంత వరకు!
తూ కిత్తా హై తో మై ఉత్తా హున్!
మనిషి వేసిన ఒక చిన్న అడుగు, మానవాళి మొత్తానికీ ఒక పెద్ద ముందడుగు అన్న నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ [#NielArmstrong] కోట్ తో యూఎస్ మూన్ మిషన్ చర్చలోకి వస్తుంది!
One Small Step For Man, One Giant Leap For Mankind- Niel Armstrong, American Astronaut.
తూ కిత్తా హై తో మై ఉత్తా హున్ అంటూ సాగిన రష్యా – అమెరికా సమరంలో అపోలో [#Apollo] స్పేస్ ప్రోగ్రాం పేరిట తానాడిన హైడ్రామాలో చంద్రునిపై కాలు మోపిన మొట్టమొదటి వ్యక్తిగా అమెరికా నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ ను ప్రొజెక్టు చేస్తోన్న విషయం తెలిసిందే! ఐతే, మూన్ లాండింగ్ [#MoonLanding] నాసా [#NASA], హాలీవుడ్ [#Hollywood] లు కలిసి సృష్టించిన కల్పిత ఉదంతమే కానీ, వాస్తవం కాదనేది కాన్స్పైరసీ థియరిస్టుల ఉవాచ!
రాకెట్ టెక్నాలజీ, ఇతర సాంకేతిక పరిజ్ఞానం అంతగా అభివృద్ధి చెందని ఆ రోజుల్లో అమెరికన్ ఆస్ట్రనాట్లు చందమామపై కాలు మోపడం దుస్సాధ్యం అనేది వాళ్ల వెర్షన్! అప్పటి ఆ ఫోటోలు, ఆ టెలిమెట్రీ టేపులు, రేడియో, టీవీ ప్రసారాలు, చంద్రగ్రహం పైనుంచి తెచ్చామని అమెరికా చెప్తున్న రాతి శకలాలు అన్నీ అబద్ధాలే అన్నది శాస్త్రప్రపంచంలో ఒకవర్గం ఆరోపణ. గడచిన అర్ధ శతాబ్దకాలంగా మనుగడలో ఉన్న కుట్రపూరిత మూన్ మిషన్ను 20% పైగా అమెరికన్లు, 25% మంది బ్రిటన్లు, 30% మంది రష్యన్లు నమ్మడం లేదు!
హాలీవుడ్ మార్క్ కాక్ అండ్ బుల్ స్టోరీ!
వాల్ట్ డిస్నీ సౌజన్యంతో స్టాన్లీ కుబ్రిక్ దర్శకత్వంలో ఆర్థర్ క్లార్క్ కథ ఆధారంగా ఓ రహస్యస్థావరంలో చంద్రయానం ఎపిసోడ్ ను నాసా కృత్రిమంగా రచించిందనేది ఆరోపణ! నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ తో సహా అపోలో 11 లోని ఇతర వ్యోమోగాములంతా కేవలం కల్పిత పాత్రధారులే అనేది విమర్శ! వాళ్లందరినీ నాసా, కేప్ కెనర్వాల్లోని ఓ లాంచ్ ప్యాడ్ పై ప్రయోగానికి సిద్దంగా ఉన్న అపోలో 11 రాకెట్లోకి లిఫ్ట్ ద్వారా ఎక్కించి, ఫోటో షూట్ ఐపోగానే దించేసారనేది గట్టి వాదన! చంద్రునిపై మాడ్యూల్ దిగడం, ఆస్ట్రనాట్ నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ కాలు మోపడం, జెండా పాతడం, రాళ్ళు ఏరడం లాంటి మిగతా తతంగం అంతా నేవెడాలోని ఏరియా 51 లో వేసిన సినిమా సెట్టింగులోనే నడిచింది!
ఆ తరవాత కొన్నేళ్లకు మార్స్ ప్రయాణంపై విడుదలైన కాప్రికార్న్ వన్ [#CapricornOne] అనే మూవీలో అన్నీ మూన్ ల్యాండింగ్ దృశ్యాలే ఉన్నాయన్నది విమర్శకుల థియరీ! నాసా చెప్తున్న మూన్ ల్యాండింగ్ ఫేక్ అనడానికి ఇదే పెద్ద ప్రూఫ్ అంటారు కాన్స్పైరసీ థియరిస్టులు! నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ తరవాత 12 మంది అమెరికన్ ఆస్ట్రనాట్స్ మూన్ వాక్ చేశారని చరిత్ర చెప్తోంది! కానీ, అవన్నీ అమెరికా వల్లె వేస్తోన్న కాక్ అండ్ బుల్ స్టోరీసే అనేది రష్యాతో సహా మిగిలిన ప్రపంచదేశాల వాదన! ఇందుకు ఆ దేశాలు 5 గట్టి కారణాలను ఎత్తి చూపుతున్నాయి!
అనుమానాలు – అభూతకల్పనలు!
నాసా అభూతకల్పనల్లో చంద్రమండలంపై అమెరికా జెండా రెపరెపలాడటం మొదటిది! అసలు వాతావరణమే లేని చంద్రునిపై గాలెక్కడిది? జెండా రెపరెపలాడటం ఏమిటి? అన్నవి ప్రాథమిక ప్రశ్నలు! ఇక వాతావరణం లేకపోవడంతో చంద్రుని మీద నీలాకాశం కూడా ఉండదు! సూర్యకిరణాలు వాతావరణం ద్వారా చెల్లాచెదురుగా ప్రసరించడం వల్లనే భూమి మీద ఆకాశం నీలి రంగులో కనబడుతుంది అనేది సైన్స్! సో, జాబిల్లి పైన అంతరిక్షం నక్షత్రాలతో కూడి నలుపు రంగులోనే ఉంటుంది! నాసా మూన్ ల్యాండింగ్ ఫోటోల్లో ఆ నలుపు రంగు ఆకాశంలో నక్షత్రాలు మిస్సవడం మరో అనుమానం! ఇక చందమామపై మనుషులు, ఇతర భౌతికరాశుల నీడల్లో సారూప్యత లేకపోవడం మరొక పరిశీలన! ఒక భారీ సెట్టింగులో డిఫరెంట్ లైటింగ్స్ నడుమ మూన్ ల్యాండింగ్ షూట్ జరగడమే అసహజమైన ఆ వ్యత్యాసానికి అసలు కారణం అనేది మరొక ఆధారం!
ఒకవేళ చంద్రునిపై కాలు మోపిన మొదటి వ్యక్తి నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ ఐతే, మరి ఆయన లూనార్ మాడ్యూల్ నుంచి నిచ్చెన ద్వారా దిగుతుండగా ఫోటోలు ఎవరు తీశారు? ఎలా తీశారు! చంద్రునిపై ఆ కెమెరా ఎక్కడిది? అన్నది ఇంకో వివాదాస్పద కోణం! సరే, లూనార్ మాడ్యూల్ కే అమర్చిన ఒక కెమెరా ద్వారా ఆ ఫోటోలు తీశారు అనుకుంటే, ఆనాడు స్పేస్ ఎక్స్ ప్లోరేషన్లో వాడిన ఆ ప్రిమిటివ్ మోడల్ కెమెరాలతో అంత స్పష్టమైన ఛాయాచిత్రాలు రావడం అస్సలు నమ్మశక్యంగా లేదనేది ఐదో లాజిక్! భూమితో పోలిస్తే చంద్రునిపై గురుత్వాకర్షణశక్తి [#GravitationalForce] ఆరు వంతులు తక్కువ! కానీ, అగ్రరాజ్య వ్యోమోగాములు మాత్రం చందమామపై అచ్చం భూమిపై గెంతినట్లే చాలా మామూలుగా గెంతుతూ వెళ్లిపోతుంటారు! ఇది కూడా నాసా కుట్రను బట్టబయలు చేస్తుందనే వాదనలున్నాయి!
బుకాయింపు – నిర్లజ్జవాదనల నాసా!
1969 నుంచి 1972 వరకు ఆరుసార్లు చంద్రుని పైకి మనుషులను పంపామని గప్పాలు కొట్టిన అమెరికా, ఇప్పటి వరకు మళ్లా చంద్రునిపైకి మనుషుల్ని పంపలేదు! అదేమంటే అది చాలా ఖర్చుతో కూడిన ప్రయాస అని చెబుతూ అక్కడ ఏలియన్స్ ఉన్నారని బుకాయిస్తోంది! వాళ్లతో అపాయం పొంచి ఉందనే అడ్డమైన కారణాన్ని తెరపైకి తెస్తోంది! అదే నిజమైతే, ఇప్పటికే వివిధ దేశాలు పంపిన మూన్ మిషన్స్ లో గ్రహాంతరవాసుల నిగ్గు ఈపాటికి తెలేదే! ఇలా ఇన్ని అనుమానాల నడుమ నాసా ఇప్పటికీ నిర్లజ్జగా తాము చేసిన మోసాన్ని కప్పి పుచ్చుకుంటూనే ఉంది! జనాన్ని నమ్మించడానికి ఏవో అలవికాని సైంటిఫిక్ రీజనింగ్స్ తో ఊదరగొడుతోంది!
ఏది ఏమైనప్పటికీ, స్పేస్ సైన్స్ లో ఇప్పుడిప్పుడే తన సత్తా చాటుతున్న ఇండియా మూన్ మిషన్స్ ను చేపట్టిన ప్రపంచదేశాల్లో ఐదవది! నాలుగేళ్ల క్రితం పంపిన చంద్రయాన్ 2 విఫలం ఐనా, పట్టు వదలని విక్రమార్కుడిలా చంద్రయాన్ 3 ని పంపిన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ [#ISRO] కృషి అభినందనీయం! తాజాగా రష్యా పంపిన లూనా 25 [#Luna25] మిషన్ చంద్రునిపై క్రాష్ ల్యాండ్ ఐన విషయం తెలిసిందే! కానీ, ఇప్పటికే డీబూస్టింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన చంద్రయాన్ 3 లూనార్ మాడ్యూల్ చందమామపై సురక్షితంగా దిగి భారతదేశ ప్రతిష్టను మరింత ఇనుమడింపజేస్తుందని ఆశిస్తూ….. మీ సూరజ్ వి. భరద్వాజ్… (రచయిత ఫేస్‌బుక్ వాల్ నుంచి సేకరణ)
Share this Article