గుజరాత్, సూరత్‌లో ఓ కోటీశ్వరుడు… జైనులు… తన పేరు దీపేష్ షా, వయస్సు 51 ఏళ్లు… భార్య పేరు పికా షా, వయస్సు 46 ఏళ్లు… తన తండ్రి ప్రవీణ్ సుగర్, బెల్లం వ్యాపారి… తండ్రితోపాటు ఆ వ్యాపారంలోకి అడుగుపెట్టిన దీపేష్ తరువాత సూరత్ స్పెషల్ డైమండ్ వ్యాపారంలోకి అడుగు పెట్టాడు… సక్సెస్… కోట్లకుకోట్లు వచ్చిపడ్డయ్…
తమ కొడుకు భాగ్యరత్న విజయ్‌జీ… అసలు పేరు భవ్య షా… తను ఇంతకుముందే సన్యాసం స్వీకరించాడు… ఈ వ్యాపారాలు గట్రా తనకు ఆసక్తి లేదని చెప్పాడు… దశాబ్దం క్రితం ఈ దంపతుల బిడ్డ పరత్ రేఖశ్రీ కూడా సన్యాసం స్వీకరించింది… పెద్ద కొడుకుకు ఈమధ్యే పెళ్లి చేశారు… ఇక అప్పట్నుంచి తాము కూడా సన్యాసం స్వీకరించాలనే కోరిక బలపడసాగింది…
Ads
ఆల్రెడీ ఆ ఏర్పాట్లలో పడ్డారు… తమ వ్యాపారాన్ని పూర్తిగా కొడుక్కి అప్పగించేశారు… ఐశ్వర్యాన్ని, ఇతర కోరికలను చంపేసుకుని ఇక శాశ్వత శాంతి, నిజమైన ఆనందం అన్వేషణలో సన్యాసం వైపు దృష్టి మరల్చారు… నిజానికి జైనుల్లో అంతులేని సంపదల్ని త్యాగం చేసి, భక్తిమార్గంలో నడవడం కొత్తేమీ కాదు, బోలెడు ఉదాహరణలున్నయ్… సన్యాసం స్వీకరణను వాళ్లు ముక్తిమార్గంగా విశ్వసిస్తారు… కోరికల్ని, సంపదల్ని, ఐహిక సుఖాల్ని త్యాగం చేసి, పూర్తిగా సన్యాసం స్వీకరించడం అనేది మాటల్లో చెప్పుకునేంత సులభమైన టాస్క్ అయితే కాదు… సంకల్పబలం గట్టిగా ఉండాలి…
దీపేష్ షా ఆల్‌రెడీ సన్యాస సన్నద్ధత దిశలో ఇతర సన్యాసులతో కలిసి 350 కిలోమీటర్ల దాకా నడిచాడు… భార్య పికా షా అయితే ఇప్పటికే మహిళా సన్యాసులతో కలిసి 500 కిలోమీటర్లు నడిచింది… మితాహారం, కాలినడక, భక్తితో కూడిన జీవనశైలిలోకి ఆల్‌రెడీ అడుగుపెట్టారు… ‘‘మా బిడ్డ సన్యాసం స్వీకరించినప్పుడే మేమూ అదే బాటలో నడవాలని అనుకున్నాం, ఇన్నాళ్లకు కుదిరింది… నిజమైన ఆనందం ఏమిటో అన్వేషించినప్పుడు… ఎప్పుడూ ఆనందంగా ఉండే మా సన్యాసులే మాకు కనిపించారు… మేమూ అదే బాట పట్టాం…’’ అంటున్నాడు ఆయన…
కోరికల్ని వదిలేసుకోవడం, దేవుడిని ఆరాధించడం… ఈ రెండూ నిఖార్సయిన ఆనందం దిశలో సరైన అడుగులుగా మేం విశ్వసిస్తున్నాం… నాకన్నా ముందే నా భార్య సంసిద్ధం అయిపోయింది… కొడుకు ఫెరారీ కారులో తన దీక్ష ఊరేగింపులో పాల్గొన్నాడు… వీళ్లు జాగ్వార్‌లో వెళ్తారు… గురు సన్యాసి రష్మిరత్న సూరిజీ దగ్గర సన్యాసం తీసుకుంటారు… బాగుంది… ఐహిక సుఖాల్ని త్యాగం చేసి, ఇక జీవిత పర్యంతం దైవారాధనలోనే గడపడం మనం వార్తల్లో చదివినంత ఈజీ అయితే కాదు… కాదు…!!
Share this Article