Jagannadh Goud…….. టమాటా – మన శరీరపు సూపర్ హీరో… నాకు తెలిసి మనం (భారతీయులం) దాదాపు గా ప్రతి కూరలో టమాటా వాడతాం. కొంతమంది కూరలో వేసే తాళింపులో జిలకర, ఆవాలు, కరివేపాకు ఎందుకు, ఇంటి గడపకి పసుపు ఎందుకు, చేతికి కాశీదారం ఎందుకు..? వీటికి సైన్స్ ప్రూఫ్ ఉందా అని అనటం చూశా. సరే, ఆ బ్యాచ్ ని పక్కన పెడితే….!
వాళ్ళు చెప్పింది ఏంటి అంటే – మన శరీరంలో ఉన్న ఫ్రీ రాడికల్స్ వలన, ఆక్సిడేటివ్ ఒత్తిడి కలిగి, దాని వలన కేన్సర్, గుండె జబ్బులు, డయాబిటీస్ ఇంకా చాలా జబ్బులు వస్తుంటై. టమాటాలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ ఆ ఫ్రీ రాడీకల్స్ ని తొలగిస్తాయి, అందుకే మన శరీర సూపర్ హీరో టమాటో.
కొన్ని అధ్యయనాల ద్వారా హైపర్ టెన్షన్ కంట్రోల్ చేస్తుంది అని తేలింది… ఇంకా టమాటాలో ఉండే పోషకాలు బయోటిన్, విటమిన్ సీ ప్రోటీన్స్ ఉత్పత్తిని క్రమబద్దీకరిస్తాయి, ఎక్కువగా బీపీని తగ్గించే లక్షణాలు కూడా టమాటాల్లో ఉంటాయి. బోన్ స్త్రెంగ్థ్ ని కూడా పెంచుతుంది. టమాటాలో విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అయితే మరీ ఎక్కువగా తింటే ఎసిడిటీ పెరుగుతుంది
Ads
Share this Article