Prasen Bellamkonda….. నేను ఆనాడే చెప్పా ఆమె నటన గురించి… బన్సాలి ఆవరించాడో ఆలియా భట్ ఆవహించిందో సంభాషణల కర్తలు ప్రకాష్ కపాడియా, ఉత్కర్షిణి, వశిష్ట ఆక్రమించారో తెలియదు గానీ గంగుబాయి ఎండ్ కార్డు అంతర్ధానం అయిన క్షణం నుంచి మనసులో ఒకటే సులుకు పోటు. అందరూ జమిలిగా కారణం కాకపోతే ఇంత పెయిన్ ఉండదు బహుశా.
ఒకడి చేతిలో మోసపోయి వేశ్యావాటికకు అమ్ముడయి ఆ వేశ్యావాటికకే మహారాణి ఐ అక్కడి నాలుగువేలమంది తోటి పీడిత మహిళలకు ఆసరా అయినా ఒక ధీర కథ.
తప్పక చూడొచ్చు.
Ads
వాళ్ళ కష్టాలను చూపెడుతూనే వాళ్ళను అదనంగా అవమానించినట్టుందన్న మాట నిజమే కానీ బన్సలి కన్నులోనే ఆ కోణం ఉంది. కథను ఎంచుకున్నప్పుడే కామాటిపురా కమర్శియల్ దృశ్యాలు సంజయ్ లీలా బన్సాలికి గలగలలాడుతూ కనపడి ఉంటాయి.
ఇక అజయ్ దేవుగన్ పాత్ర….ఒక స్త్రీ విజయం సాధించాలంటే ఒక పురుషుడి చేయూత తప్పదా.. అది లేకుండా ఆమె గెలవలేదా.. బన్సాలి కూడా అంతే ఆలోచిస్తాడా. ఆ పాత్రను స్త్రీ పాత్రగా మార్చి ఆమె అలియా కు అండగా నిలిచినట్టు చూపించి ఉంటే బాగుండేదేమో. స్త్రీలే సాధించిన విజయంగా కామాటిపుర మిగిలిపోయి ఉండేది. ఓటిటి లో వుంది. హిందీ రాని వాళ్ళు మాత్రమే తెలుగులో చూడండి. హిందీ సంభాషణల సొగసే వేరు.
Share this Article