Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

భోళాశంకర్ బాటలోనే… గురితప్పిన గాండీవధారి అర్జునుడు… ప్చ్, వరుణ్ తేజ్…

August 25, 2023 by M S R

నిజానికి… దేనికదే… భోళాశంకర్ ఫ్లాప్ కారణాలు, కథ వేరు… ఆ వెంటనే మెగాక్యాంపులో సంబురాలు, దానికి అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు రావడం… ఈ కథ వేరు… ఇప్పుడు మరో తీవ్ర నిట్టూర్పు… కారణం వరుణ్ తేజ్ నటించిన గాండీవధారి అర్జున్ కూడా ఏమాత్రం బాగోలేకపోవడం… ఇది వేరే సంగతి… కానీ ఓ పరిశీలన అవసరం…

ఒకవైపు అర్జున్ అలియాస్ బన్నీ తన కెరీర్‌కు ఒక్కో ఇటుకా జాగ్రత్తగా పేర్చుకుంటూ వెళ్తున్నాడు… తెలుగు హీరోలంతా కుళ్లుకునేలా జాతీయ అవార్డు కొట్టేశాడు… ఓ కమర్షియల్, ఓ పాపులర్ ప్రాంతీయ హీరో ఉత్తమ నటుడి అవార్డు పొందడం అల్లాటప్పా విశేషం కాదు… అఫ్‌కోర్స్, పుష్పతో తిరుగులేని పాన్ ఇండియా హీరో అయినా సరే… తను ఒరిజినల్‌గా తెలుగు హీరోయే… తన సినిమాలు తెలుగు తెర, తెలుగు ప్రేక్షకులను టార్గెట్ చేసుకునే రూపొందుతాయి…

చిరంజీవిని కాసేపు వదిలేయండి, అది ఓ దశ, ఓ దిశ లేని ప్రయాణం… స్టెప్పులు, డాన్సులు, మేనరిజమ్సే తన లోకం… బన్నీ అవన్నీ చేస్తాడు, చిరంజీవికన్నా బాగా చేస్తాడు… అదేసమయంలో మంచి కథకుడిని, మంచి దర్శకుడిని పట్టుకుంటాడు… రాంచరణ్ కూడా ఆర్ఆర్ఆర్‌తో బాగా పాపులర్ అయ్యాడు… తన కెరీర్ స్థిరంగా సాగుతోంది… మిగతా మెగా హీరోలతో పోలిస్తే ఎటొచ్చీ వరుణ్ తేజ్ కెరీరే ఎటెటో పయనిస్తోంది…

Ads

నిజానికి మిగతా హీరోలతో పోలిస్తే వరుణ్ తేజ్ మొదట్లో ఎంపిక చేసుకున్నవి భిన్నమైన పాత్రలు… అవే తనకు పేరు తెచ్చాయి… ఇండస్ట్రీలో నిలబెట్టాయి… గని ఫెయిల్యూర్ తరువాత ఆత్మ పరిశీలన సాగి ఉండాల్సింది… అది లోపించింది… ఏదో తెలుగు హీరోలకు అలవాటైన రొటీన్ బాట పట్టాడు… ఇప్పుడు వచ్చిన గాండీవధారి అర్జున్ విషయంలో కథ పూర్… కథనం పూర్… పాటలు పూర్… బీజీఎం పూర్… హీరోయిన్ పూర్… ప్రమోషన్ పూర్… హైప్ పూర్… మొత్తానికి సినిమా పూర్ పూరర్ అయిపోయింది…

ఒక సినిమా చూడాలంటే ఏదైనా కొత్తదనం, ఆకర్షణ ఉండాలి కదా… ఏముంది ఇందులో..? నిజానికి ఈ సినిమాకు రివ్యూ కూడా పెద్దగా అవసరం లేదు… ఆ కథ,న ప్రజెంటేషన్, పాత్రధారుల నటన, ట్విస్టులు ఎట్సెట్రా చెప్పుకోవడం దండుగ… సినిమా షూటింగ్ దశలో కనీసం ఈ సినిమా ఎలా వస్తోంది అని ఒక్కసారైనా వరుణ్ తేజ్ వెనక్కి తిరిగి చూసుకోలేదా..?

చిరంజీవి, పవన్ కల్యాణ్, ప్రభాస్, మహేశ్, జూనియర్ వంటి నటులు వేరు… వాళ్ల స్టార్‌డమ్ వేరు… సినిమా ఎలా ఉన్నా సరే వాళ్ల కోసం సినిమాకు వెళ్లే సెక్షన్ ఉంటుంది… కానీ వరుణ్ తేజ్‌కు ఇంకా ఆ స్టార్‌డం రాలేదు కదా… అందుకని ఏదైనా కొత్త ఆకర్షణను ట్రై చేయాలి… లేకపోతే ఈ కట్‌థ్రోట్ కంపిటీషన్లో నెగ్గడం కష్టం… నిజానికి తనకు సరైన గైడెన్స్ లేనట్టుంది… బెటర్ లక్ నెక్స్ట్ టైమ్ వరుణ్ తేజ్…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అగరుపొగలా, అత్తరులా… ఊహూఁ… ఆ శోభన తాంబూలంలోనే ఏదో వెలితి…
  • తమ్ముడు పెళ్లి – మామ భరతం..! ఈ కథాకమామిషు ఏమిటనగా..!
  • జాణవులే… నెరజాణవులే… వరవీణవులే… కిలికించితాలలో…
  • విశ్వనాథుడు కదా… జావళి పాటకీ జయమాలినితో డాన్స్ చేయించగలడు…
  • 132 డిగ్రీలు నడుం వంచి… గుమ్మానికి ఆనుకుని నిలిచి… ఏవో ఎదురుచూపులు…
  • నాలుగు దశాబ్దాల కెరీర్… సాఫీగా ఈరోజుకీ కుదుపుల్లేని జర్నీ…
  • ప్రేక్షకులకు తగిలే చెప్పు దెబ్బల మాటేమిటో కూడా చెప్పు..!!
  • ఎట్టకేలకు GST మోత కాస్త తగ్గిస్తున్నారు ప్రభువులవారు..!!
  • ఒప్పినోళ్లు మెచ్చనీ, ఒప్పనోళ్లు సచ్చనీ… కృష్ణ పేరిణి తాండవమంటే మజాకా..?!
  • తెలంగాణ చదరంగంలో ఇరువైపులా రేవంతే ఆడుతున్నాడు..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions