టాక్సీవాలా, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్… ఎట్సెట్రా వరుస సినిమా ఫ్లాపులు విజయ్ దేవరకొండ ఖాతాలో… అప్పట్లో ఎవడే సుబ్రహ్మణ్యం… అఫ్ కోర్స్, అందులో సెకండ్ హీరో… తరువాత మహానటి… అందులో హీరో కాదు, సైడ్ కేరక్టర్‌కు ఎక్కువ… సెకండ్ హీరోకు తక్కువ… ఒక అర్జున్‌రెడ్డి సూపర్ హిట్… తరువాత గీతగోవిందం… తన కెరీర్‌లో బలంగా చెప్పుకోగలిగినవి రెండే… కానీ బ్రహ్మాండమైన పాపులారిటీ, ఫాలోయింగ్…
మరి ఇప్పుడు..? ఖుషి సినిమా ఏం చెబుతోంది..? ఇక ప్రేమకథల్ని చేసేది లేదు అని భీషణ ప్రకటన వెలువరించి… అచ్చు సగటు తెలుగు హీరో అంటే రొటీన్ యాక్షన్ మాస్ మసాలా రొడ్డ కొట్టుడు పాత్రల్నే చేయడానికి ఫిక్సయిపోయి… భీకరమైన ఫ్లాపుల్ని రుచిచూసి… యూటర్న్ తీసుకుని… కాస్త గీతగోవిందం బాపతు హ్యూమర్ తీసుకుని, దానికి అర్జున్‌రెడ్డి బాపతు ‘అది నా పిల్ల’ కేరక్టర్‌ను మళ్లీ అరువు తెచ్చుకుని… కాస్త రొమాన్స్, కాస్త హ్యూమర్, కాస్త లవ్వు ఎట్సెట్రా సరుకులు కలిపేసి, సిమ్‌లో ఉడకబెట్టి వడ్డించాడు…
విజయ్‌కు ఇలాంటి పాత్రలయితేనే సూటవుతాయి అని ఫిక్సయినట్టేనా ఇక..? పైగా సేమ్ డిక్షన్… అది మారడం లేదు… నటన బాగానే ఉంటుంది… కానీ ఎప్పుడూ చూసిన బాపతే కదా అనిపిస్తుంది… పైగా ఖుషి సినిమాలో పనికిమాలిన, సందర్భరహిత ఫైట్లు… అవసరమా అవి..? తన మాస్ అప్పీల్‌ను జనానికి గుర్తుచేయడానికా..? లేక తెలుగు హీరో అంటే ఫైట్లు ఖచ్చితంగా ఒకటో రెండో ఉండాల్సిందేననే పైత్యం సెంటిమెంటా..? అవి లేకపోతే ఖుషి కథాగమనానికి వచ్చిన ఇబ్బంది ఏమిటసలు..?
Ads
అర్జున్‌రెడ్డి ఏదో సీన్‌లో ‘అక్కడ’ ఐస్ క్యూబ్స్ వేసుకునే ఓ వెగటు సీన్ ఉంది కదా… మరి ఖుషిలో కూడా ఒకటీరెండు ఉండాలని ఫిక్సయినట్టున్నారు… అందుకే ఖుషిలో ఓ దిక్కుమాలిన స్పెర్మ్ సీన్ పెట్టారు… కడుపు చేయగలిగినవాడికి మళ్లీ వీర్యపరీక్ష ఏమిటోయ్ దర్శక మహాశయా..? సరే, చేశారుపో… వీర్యం శాంపిల్ తీసుకున్నప్పుడు మనసులో ఎవరిని తలుచుకున్నావ్ అనే ఓ పిచ్చి ప్రశ్న… టైటానిక్ హీరోయిన్‌ను అని హీరో జవాబు… అసయ్యంగానే ఉంది… (ఈ సీన్ ఇండియాలో కట్ చేశారు… ఓవర్సీస్‌లో ఉంచేశారు… అమెరికాలో ఇలాంటి సీన్లు పర్లేదా దర్శకా..?)
బాబు గోగినేని, బంగారయ్య శర్మ, చాగంటి కోటేశ్వరరావులను పోలిన పాత్రలు, జాఫర్ టీవీ డిబేట్ ఎందుకోగానీ పెద్దగా ఇంట్రస్టింగుగా కనెక్ట్ కాలేదు… ఆయా పాత్రల కేరక్టరైజేషన్ కోసం కొన్ని సీన్లు రాసుకున్నట్టున్నాడు దర్శకుడు కానీ… అవి అంతగా పండలేదు… సేమ్, సినిమాలో హ్యూమర్ కూడా పెద్దగా పేలలేదు… పైగా నిడివి ఎక్కువ… షార్ప్ ఎడిటింగ్ కరువైంది…
అన్నింటికీ మించి సమంతలో ‘కళ’ లేదు… విజయ్, సమంతల నడుమ కెమిస్ట్రీ బాగానే అల్లుకుపోయినా… విజయ్ మగందం ఎదుట ఆమె ఆడందం వెలవెలాపోయింది… బహుశా ఆమె వ్యాధి కావచ్చు, లేదా ఆ వ్యాధి వార్తలు చదివీ చదివీ ప్రేక్షకుడు ఆమెను చూసే కోణంలోనే సానుభూతి, జాలి మిళితం కావడం వల్ల కావచ్చు… పోనీలే, ప్రిరిలీజ్ ఫంక్షన్‌లో కావచ్చు, ఆమె మాట్లాడుతూ ఈసారి ఫుల్ హెల్తీగా వస్తా, బ్లాక్ బస్టర్ ఇస్తా అని హామీ ఇచ్చింది… ఆశిద్దాం…
వావ్ అనిపించేలా ఎమోషనల్ సీన్లు కూడా పండలేదు… అఫ్‌కోర్స్, తీసుకున్న కథ లైన్ బాగానే ఉంది… అంటే గతంలో ఇలాంటి కథలు రాలేదని కాదు… బట్ వోకే… ప్రజెంటేషన్‌లోనూ దర్శకుడు కష్టపడినట్టు కనిపిస్తూనే ఉంది… ఇవన్నీ సరే, సినిమాలో ఏదీ బాగాలేదా..? ఎందుకు లేదు..? సంగీతం బాగుంది, పాటలు బాగున్నయ్… ఎవరో కొత్త సంగీత దర్శకుడు బాగానే కష్టపడ్డాడు… కాశ్మీర్ అందాలు కూడా బాగున్నయ్… విజయ్ సహజంగా నటించాడు… ఎక్కడా ఓవరాక్షన్ లేదు… అక్కడక్కడా హ్యూమరసం కూడా పర్లేదు…
అన్నింటికీ మించి ప్రస్తుతం మార్కెట్‌లో చూడబుల్ సినిమా లేదు… కొన్ని సినిమాలు ఆడుతున్నా సరే, అవి యాక్షన్ బేస్డ్… ఇమేజీ బిల్డప్పుల సోది కథలు… ఈ నేపథ్యంలో చూస్తే థియేటర్ వెళ్లే అలవాటున్న ప్రేక్షకులు ఖుషిని ఓసారి చూసేయొచ్చు… అక్కడక్కడా దర్శకుడిని భరించి, క్షమించగలిగితే..!! ఏమోలెండి, నాలుగు రోజులు ఆగితే ఓటీటీలో రాదా..? టీవీలో రాదా..? అనుకుంటున్నారా..? అది మీ ఇష్టం…!!
Share this Article