Amarnath Vasireddy… యూట్యూబ్ క్రైమ్ కథ కాదు ! ఇది రియల్ లైఫ్, కోడి బుర్రా !
” నేను ఐఏఎస్ అప్లికేషన్ తెచ్చా !”
“కాదు కాదు, నేను ఐపీఎస్ అప్లికేషన్ తెచ్చా . మన అమ్మాయిని పోలీస్ అధికారి చేయిస్తా !”
Ads
చాలా కాలం క్రితం వచ్చిన ఒక పెద్ద సినిమాలోని దృశ్యం . ఒక పెద్ద దర్శకుడి అవగాహన స్థాయి ఇలా ఏడిస్తే , నేటి యూట్యూబ్ సీరియళ్ల కోడిబుర్ర దర్శకుల సంగతి వేరే చెప్పాలా ?. ఈ పోరంబోకులకు .. నిజ జీవితం గురించి అవగాహన సున్నా !
క్రైమ్ ను గ్లామరైజ్ చేస్తూ వీరు వీడియోలు తీసేస్తూ వుంటారు . క్రైమ్ చేసే హీరో / హీరోయిన్ మహా మేధావుల కింద లెక్క . పోలీస్ అధికారులు జోకర్లు . ఎంతటి క్రైమ్ చేసైనా ఈజీగా తప్పించుకోవచ్చు అని ఈ వీడియోలలో నూరి పోస్తారు . చదువా ? సంధ్యా ?
అమెరికా అనే ఇహలోక స్వర్గానికి వెళ్లిపొతే జీవితం అనే సినిమాకి శుభం కార్డు పడినట్టే అనుకొనే అజ్ఞానంలో తల్లితండ్రులు . ఇంగిత జ్ఞానం నేర్పని చదువులు . ఇంజనీరింగ్ కాలేజీలలో నేర్చేది – తాగడం , శృంగారం , ప్రేమ , { ముందు ప్రేమ తరువాత సె- అని ఏమీ రూల్ లేదు . అసలు దానికి.. దీనికి ఏమి కనెక్షన్ లేదు } మాదక ద్రవ్యాలు.
టైం పాస్ కోసం సెల్ ఫోన్ లో రోజూ క్రైమ్ వీడియోలు చూస్తూ పెరిగితే ..? అమ్మ- నాన్న లేనప్పుడు హైదరాబాద్ ప్రియుడ్ని ఇంటికి రప్పించుకొని, అక్కకు తాగించి , ఆమె మత్తులో జోగుతుంటే నగలు తీసుకొని పారిపోవచ్చు అని కోడి బుర్రకు ప్లాన్ తడుతుంది . నిన్నంతా వైరల్ అయిపోయిన క్రైమ్ కథ గుర్తుంది కదా…
సరే, ఇక్కడి దాకా సరిగ్గానే జరిగింది అనుకొందాము . కేసు పెట్టి తమ నగలు తాము తిరిగి పేరెంట్స్ తెచ్చుకొని ఉండలేరా ? అంత ఆలోచించే పనుంటే, ఇంత ఎందుకు జరుగుతుంది ? ప్లాన్ అడ్డం తిరిగింది . తాగిన మత్తులో ఉన్నా… అక్క నిద్ర లేచింది . చూసిన యూట్యూబ్ క్రైమ్ సీరియళ్ల తెలివి వూరికే పోతుందా ?
అక్క అరవకుండా చున్నీ చుట్టి దానిపై ప్లాస్టర్ వేయడం . ఇలా చేస్తే మనిషి చచ్చిపోతుంది అని జ్ఞానం అయినా ఉండాలి . ఎలా ఉంటుంది ?
చదువులు ఇలాంటివి నేర్పాయా ? రోజూ చూసే క్రైమ్ ఫిలిమ్స్ లో చంపడం మామూలే . అదొక రొటీన్ ఈవెంట్ .
నగలు తీసుకొని ప్రియుడితో కలిసి పారిపోయింది . టీవీలో నెలకు ఒకసారి వచ్చే ఒక సినిమాలో సీన్… ఓ పాస్ పోర్ట్ ఆఫీసర్ . అంటే ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి . వీళ్ళేమో పావు కిలో చికెన్ బ్యాచ్ . అల్లెల్లే .. నేరుగా పాస్పోర్ట్ ఆఫీసర్ ఛాంబర్ లోకి వెళ్లిపోవడం .. ఆయన్ని బకరా చేయడం .
ముఖాలు ఎప్పుడైనా అద్దంలో చూసుకొన్నారా! { ఈ స్క్రిప్ట్ రాసిన, తీసిన వాళ్ళు } . ఇండియన్ ఫారిన్ సర్వీస్ .. స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా రాయండి చూద్దాము .
సివిల్ సర్వీసెస్ పరీక్ష అటుపై ముస్సోరి/ హైదరాబాద్ / ఢిల్లీ లాంటి చోట్ల సాగే శిక్షణ గురించి తెలుసా ? పదో క్లాసు పది సార్లు తప్పిన బ్యాచ్ ఇది !
ఎదవ ఎటకారాలు . కోడిబుర్ర పావు కిలో చికెన్ బ్యాచ్ లు సినిమాలు తీసేస్తారు . దాన్ని ఫన్ అనుకోని చూస్తే ఓకే. కానీ సమస్య ఏమిటంటే నేటి తరం యూట్యూబ్ బ్యాచ్ యూత్ ఇలాంటివి నిజంగా నిజం అని నమ్మేస్తున్నారు .
నిన్న మిస్టరీ వీడిపోయిన చందన నేరకథలో ఆమె తన మేధోశక్తినే ఉపయోగించిందో .. లేదా ప్రియుడి అద్భుత తెలివి తేటలు జోడించిందో .. పోలీస్ లను తప్పుదోవ పట్టించే ప్లాన్ చేసింది .
తమ్ముడికి ఫోన్ చేసి .. “అక్క తాగిందిరా .. నిజంరా .. నేను ఏమీ చేయలేదురా! నమ్మురా!! ” అని ఒక ప్లాస్టిక్ ఏడుపు ఏడ్చేస్తే దాన్ని పోలీస్ లు నిజం అని నమ్మేస్తారని అనుకొంది. ఆహా. ఏమి తెలివి ? మృతి చెందిన అక్క దీప్తికి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్ట్ . ఊపిరాడక చనిపోవడం . ఇద్దరు ఆమెను బలవంతంగా పడుకోబెట్టి మెడకు చుట్టిన చున్నీ .. వేసిన ప్లాస్టర్ .. దీనికి సంబంధించిన వేలి ముద్రలు .
పారిపోయిన చందన ఫోన్ ట్రేసింగ్ . ఎక్కడికెళుతోంది ? ఎవరితో టచ్ లో వుంది ? అనే వివరాలు . అమ్మ నాన్న వద్దు కానీ వారు సంపాదించిన నగలు కావాలట… . చేతిలో ఆ నగలు . వామ్మో .. ఇన్ని ఎవిడెన్స్ లున్నప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ దాకా ఎందుకు ? పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ఇప్పుడే శిక్షణ పూర్తి చేసుకొన్న యువ కానిస్టేబుల్ అయినా.. ఇట్టే పట్టేస్తాడు.
పిల్లల చేతికి సెల్ ఫోన్లు ఇచ్చేసి .. అచ్చోసి సమాజంపైకి వదిలేసిన తల్లితండ్రులూ ! మీరెలాగూ మీ పిలల్లకు మంచి బుద్ధులు నేర్పలేరు . సమయం మించి పోయింది . ” నెట్ పై దొరికే క్రైమ్ సీరియళ్ల దర్శకులవి కోడి బుర్రలు . అందులో వారు చూపినట్టు క్రైమ్ చేసి తప్పించుకోలేరు . ఎందుకంటే కనిపించని నాలుగో సింహానికి సామాజిక టెలివితేటలు, ఇంగిత జ్ఞానం మెండుగా వుంటుంది . ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానంతో క్రైమ్ చేసేవాడు ఎంతటి పోటుగాడు / పోటుగత్తె అయినా రెండు రోజుల్లో పట్టేస్తారు” అని చెప్పండి .
అంతే కాదు ….
” ప్రియుడితో కులకాలి అనుకొన్న చందనకు ఇక జీవితాంతం చిప్పకూడు .. టాయిలెట్ క్లీనింగ్ .. కుట్లు అల్లికలు .. ! బకార్డి బ్రీజర్ కాదు, తాగడానికి ఉచ్చ కంపు కొట్టే నీళ్ళే { టాయిలెట్లు సెల్ లోనే ఉంటాయి . వాసన కొడుతుంటాయి} .. ముట్లు ఉడిగి పొయ్యే దాకా మగాడి వాసన కూడా సోకదు . దీన్నే జీవితం పెంట నాకిపోవడం అంటారు . పిచ్చి పిచ్చి సీరియళ్లు/ ఫిలింలు చూసి అదే జీవితమనుకొంటే ఇదే గతి . తస్మాత్ జాగ్రత్త ” అని చెప్పండి . జీవితానికి, యూట్యూబ్ క్రైమ్ సీరియళ్లకు తేడా తెలియకుండా పెరిగితే… చంచల్గూడ చర్ల పల్లి జైలు గోడలు నేర్పుతాయి … ఇది తధ్యం .
Share this Article