Koppara Gandhi……. మనసు పెడితే క్లాసిక్… రేవు పెడితే డ్యూయెట్****** మా దద్ది చిరాగ్గా కూచుని రెండు కర్రముక్కలు తీసుకుని అడ్డదిడ్డంగా కళ్ళుమూసుకుని డ్రమ్స్ బాదేశాడనుకోండి.. అది ఓ సూపర్ హిట్ డ్యూయెట్ అయి పోతుంది.. ఆరోజుల్లో ఏ పెళ్లి మేళంలో అయినా.. ఏ సెలూన్లో అయినా ఆ పాట ఉండాల్సిందే.. అక్కడ జనం మూగి ఉర్రూతలూగాల్సిందే..
పోనీ అలాకాకుండా తీరిగ్గా కూకుని ఓ పిసర క్లాసిక్ పోపు వేసి.. మధ్యలో ఫ్లూట్ నూరి… చెంచాడు వయోలిన్ ఫ్లేవర్ యాడ్ చేసి లైట్ గా డోలక్ గార్నిష్ చేశాడే అనుకోండి . తస్సాదియ్యా.. తిరుగులేని మెలోడీ అయిపోతుంది.. ఇక కాలేజి ఫంక్షన్లలోనో…. ఒంటరిగా నడుస్తూనో.. పైరగాలి పీలుస్తూనో ఆ పాటలు అనుకోకుండా మీ మనస్సుల్లోంచి బుర్రలోకి.. బుర్రలోంచి గొంతులోకి వచ్చి మీరే ఓ తాత్కాలిక సింగర్ అయిపోతారు..
అదన్నమాట…. ఇన్ని మాటలు ఎందుగ్గాని ఆయన మనసు పెడితే క్లాసిక్…. మనసుతో పన్లేదు ఈపూటకు కొట్టేద్దాం అనుకుంటే హిట్ డ్యూయెట్… ఈయనకు సంగీతం రాదు.. స్వరాలు తెలీవు… వరసగా డప్పులు కొట్టుకుంటూ పోతాడు ..
Ads
అదీ ఒక మూజిక్కేనా అంటూ వెక్కిరించినవాళ్లే ఆయన దరువు లేపోతే సినిమాకు జోరేది.. హుషారేది అనాల్సిన కాలం అది..1972-1990 దాదాపు ఇరవయ్యేళ్లు దక్షిణాదిని ఏలిన సంగీత చక్రవర్తి మా అప్పారావు.. సరే మిగతావాళ్ళ సంగతి నాకెందుగ్గాని మా సోవన్ బాబు కెరీర్లో వచ్చిన మెలోడీస్.. సూపర్ హిట్స్ అన్నీ మా అప్పారావు దద్ది కొట్టినవే… ఊర మాస్ అయినా .. ఓవర్ క్లాస్ అయినా ఎట్నుంచి ఎటైనా తిమ్మిరి తీసేస్తాడు మా బాబాయ్…
సివర్లో ఇంకోమాట… సిరంజీవి పాటలకు చక్రవర్తి మ్యూజిక్ ఇచ్చాడని కొందరు తెలీక అనేస్తారు గానీ అది కాదు పాయింట్.. చక్రవర్తి మ్యూజిక్ కు చిరంజీవి డాన్స్ చేస్తాడు.. అదే నిజం.. ఈరోజు ఆయన జయంతి అన్నమాట… కొప్పర గాంధీ
Share this Article