హేమిటో… చంద్రబాబు అరెస్టు, జైలుకు రిమాండ్ తెలుగుదేశం శిబిరంలో అందరికన్నా ఆంధ్రజ్యోతికి మరీ జీర్ణించుకోలేని విధంగా మారింది… ఏం రాస్తున్నాడో కూడా తనకే అర్థం కానంత అయోమయం, గందరగోళం… ఒక మెయిన్ స్ట్రీమ్ పత్రిక ప్రదర్శించాల్సిన సంయమనం లేదు, ఓపిక లేదు… బాధ ఉంటుంది రాధాకృష్ణ సాబ్, కానీ ఆ బాధ అంతా పత్రిక రాతల్లోనే ప్రతిఫలిస్తే, ఏదేదో రాసేస్తే ఎలా..?
ఉదాహరణకు… లోపల పేజీల్లో ఓ వార్త… నయం, ఫస్ట్ పేజీలో బ్యానర్ పక్కన చోటివ్వలేదు… ‘కమెండోలు పోయి, కర్రలతో కాపలా…’ ఇదీ శీర్షిక… ఇదేనా భద్రత అనీ ప్రశ్నించింది డెక్కులో… మరేం చేయమంటారు బ్రదర్…? జెడ్ ప్లస్ కమెండోలను జైలులో ఆయన చుట్టూ మొహరించాలా..? జైలు చుట్టూ రోప్ పార్టీలు, యాంటీ బాంబ్ స్క్వాడ్లు పెట్టాలా..? డ్రోన్ నిఘా కూడా అవసరమా..?
నిజానికి ఏ మావోయిస్టు థ్రెట్ అని చెబుతున్నారో, వాళ్లే చంద్రబాబును పట్టించుకోవడం మానేసి చాన్నాళ్లయింది… అసలు మావోయిస్టు పార్టీ రాజకీయ నాయకుల మీద దాడులు మానేసింది ఎప్పుడో… వాళ్ల బలమే పడిపోయి, వాళ్ల భద్రత చూసుకోవడానికే వాళ్లకు సమయం సరిపోవడం లేదు… పైగా కర్రలతో కాకపోతే గన్నులతో కాపలా కాయాలా..? అసలు జైలు లోపలకు తుపాకులు అనుమతించబడతాయా మన సిస్టంలో..? అసలు జైలు గార్డులను తప్ప మిగతా సెక్యూరిటీ సిబ్బందిని అనుమతిస్తారా..? ఎన్ఎస్‌జీ అయినా సరే…
Ads
పైగా 30 గదులున్న ఓ రెండంతస్థుల విభాగం (స్నేహ) మొత్తం చంద్రబాబు కోసమే ఖాళీ చేశారు, ఆ ఖైదీలను వేరేచోట్ల అడ్జెస్ట్ చేశారు… జైలులో మొత్తం 400 మంది సిబ్బంది పనిచేస్తున్నారు… ఆ రెండంతస్థుల్లో చంద్రబాబు కోసమే ప్రత్యేకంగా కొత్తగా సీసీ కెమెరాలు… జైలులో చంద్రబాబుకు భద్రత లేదని చెప్పడానికి జైలు బయట నుంచి గోడల మీదుగా సిగరెట్లు, బీడీలు, గంజాయి విసిరేస్తుంటారనీ… జైలులో పనిముట్లు ఉపయోగించే తయారీ విభాగాలు ఉన్నాయి కాబట్టి వాటినీ చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎవరైనా ఉపయోగించే చాన్స్ ఉందనీ… ఇలా ఏదేదో రాసేస్తూ పోయారు…
ఈ వాదనలన్నీ చంద్రబాబు హౌజ్ రిమాండ్ కోసం… భద్రత గురించే కాదు, సోలార్ సిస్టం పనిచేయడం లేదు, వేణ్నీళ్లు లేవు… అన్నీ ఉండటానికి అదేమైనా నోవాటెల్ హోటలా..? చంద్రబాబు రాజకీయ ఖైదీ కాదు… ఆర్థిక అక్రమాల కేసులో నిందితుడు… దేశంలోని వందల జైళ్లలో లక్షల మంది ఖైదీలకు వద్దా మరి ఇలాంటి సౌకర్యాలు..? ఒకసారి ఒక కేసులో నిందితుడయ్యాక తను కూడా అందరిలాగే రిమాండ్ ఖైదీ కదా… మరెందుకు ఈ స్టార్ హోదా..?
ఇదే చంద్రబాబు తను అధికారంలో ఉన్న రోజుల్లో జైళ్ల దురవస్థల గురించి ఒక్క నిమిషమైనా సమీక్షించాడా..? జైళ్లలో స్థితిగతుల్ని పట్టించుకున్నాడా..? ఎందరు ఖైదీలు అనారోగ్యాలతో, రోగాలతో మరణించారో తెలుసా తనకు..? పైగా తనకు ఇంటి నుంచి భోజనం కూడా అనుమతించారు… ప్రత్యేక ఖైదీతనం దేనికి..? జైళ్లో ఉండను, ఇంట్లోనే ఉంటాను అంటే ఇదెక్కడి చోద్యం..? మరిక రిమాండ్ దేనికి..? అసలు సీఆర్పీసీలో ఆ చాన్స్ ఉందా..?
పోనీ, తెలంగాణ జైళ్లకు మార్చండి అని అడగాలని అనుకుంటే… కేసీయార్ తనను సహించడు… విపక్ష కూటమి ‘ఇండియా’తోనూ సయోధ్య లేదిప్పుడు… ఆ విపక్ష పాలిత రాష్ట్రాలకూ వెళ్లలేడు… బీజేపీ వాళ్లు దగ్గరకు రానివ్వడం లేదు… ఆ పార్టీ పాలిత రాష్ట్రాలకూ వెళ్లలేడు… అదే రాజమండ్రి జైలు… ప్చ్… డెస్టినీ బాసూ… తప్పించుకోలేవు…!!
Share this Article