తాజా రేటింగుల్లో ఏ న్యూస్ చానెల్ పరిస్థితి ఏమిటి..? అప్పుడప్పుడూ జర్నలిస్టు సర్కిళ్లే కాదు, బ్యూరోక్రాట్లు, పొలిటిషియన్లు, ఉద్యోగుల్లో కూడా ఈ ఆసక్తి ఏర్పడుతుంది… రోజూ చానెళ్లను ఫాలో అయ్యేవాళ్లకు మరీనూ… తెలుగు చానెళ్లలో ఎన్టీవీ, టీవీ9 నడుమ పోటీ ఉండి, గొప్పగా చెప్పుకునే టీవీ9 బాగా చతికిలపడిపోయి, మళ్లీ లేవడం లేదు… అసలు మిగతా చానెళ్ల సిట్యుయేషన్ ఏమిటి..? ఈ రెండు చానెళ్లతో పోలిస్తే మిగతావి ఏ ప్లేసుల్లో ఉన్నాయి..?
నో డౌట్… ఎన్టీవీ తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకుంటోంది… అసలు ఎన్టీవీ వార్తల్లో ఏముందని ఫస్ట్ ప్లేస్ అనడిగేవాళ్లు కూడా ఉన్నారు… ఆలెక్కకొస్తే టీవీ9 విశిష్టత ఏమిటి..? పాత పోస్కో, అప్పటి ఆటోస్పై, ఆమధ్య రుధిరం వంటి అజ్ఞానానికి తోడు మొన్నెవరో క్వాష్ బదులు స్క్వాష్ అన్నారట… మీరు గొప్పోళ్లురా స్వామీ… మరి ఎన్టీవీ వాళ్లేమైనా గొప్ప ప్రొఫెషనల్సా అనడక్కండి… పోల్చడానికి బార్క్ అనే ఓ కొలమానం ఉంది, వాటిల్లోనూ తూస్తున్నాం… అంతే… (ఇప్పట్లో టీవీ9 ఆఫీసుల్లో కేకుల పండుగలు, ఫ్లెక్సీలు-హోర్డింగుల హడావుడి వచ్చేట్లు కనిపించడం లేదు…)
Ads
చూశారుగా… ఎన్టీవీ ఈరోజుకూ టీవీ9 కాస్త బెటర్ పొజిషనే… (ఇవి తాజా రేటింగ్సే)… పేరుకు మూడోస్థానంలో ఉన్నా సరే వీ6 ఆమడల దూరంలో ఉంది… చెప్పుకోవాల్సింది టీవీ5, ఏబీఎన్ గురించి… రెండూ నిజానికి టీడీపీ చానెళ్లే… (అవి ఎంత ఖండించినా సరే, మరీ టీవీ5 బండకొట్టుడు కేటగిరీలో ఉంటుంది, ఏబీఎన్ కాస్త బెటర్…) అవి ఫస్ట్ ప్లేస్ చానెళ్లకు ఇంకా దూరంలో ఉన్నాయి… కానీ ఒక్క విశేషం… ఏబీఎన్ పెరుగుదల ఇలాగే ఉంటే అది టీవీ5 చానెల్‌ను రెండుమూడు వారాల్లో కొట్టేయగలదు… దగ్గరగా వచ్చేసింది…
ఈటీవీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మేలు… ఈటీవీలో రాత్రి 9 గంటలకు వచ్చే ప్రైమ్ న్యూస్ మినహా ఈటీవీ న్యూస్ చానెళ్లు దండుగ… (ఈటీవీ వినోద చానెల్ కూడా తన పాత ప్రభ మాయమైపోయి, మూడో స్థానంలో బిక్కుబిక్కుమంటోంది…) యెల్లో చానెళ్లకు కౌంటర్‌గా చెప్పుకునే సాక్షి టీవీ కూడా నానాటికీ దిగదుడుపు… మరీ ఏడో స్థానంలో ఉండీలేనట్లు మిణుకుమిణుకు… ఐనా సరే, జగన్ తన మీడియాను ఎప్పుడో పట్టించుకోవడం మానేశాడు కాబట్టి సాక్షి టీవీ ఇప్పట్లో పుంజుకునే సూచనలు కూడా లేనట్టే… (ఫాఫం, సాక్షి టీవీ, సాక్షి పత్రిక గురించి జగన్‌కన్నా, ఛైర్ పర్సన్ భారతీరెడ్డికన్నా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణే ఎక్కువగా ఆలోచిస్తుంటాడు… తరచూ తన వ్యాసాల్లో ఏదేదో రాసేస్తుంటాడు వాటిపై…)
చెప్పనే లేదు కదూ… తెలుగు సరే, జాతీయ స్థాయిలో ఏమిటి అంటారా..? న్యూస్18… అది ముఖేష్ అంబానీది లెండి… తెలుగులో చతికిలపడుతున్నా సరే జాతీయ స్థాయిలో టీవీ9కు చెందిన భారత్ వర్ష్ న్యూస్18కి ఈక్వల్ స్టేటస్‌లో ఉంది… (టీవీ9 కన్నడ, టీవీ9 మరాఠీ కూడా బెటర్ ప్లేసుల్లోనే ఉన్నయ్)… తరువాత ఆజ్ తక్, ఇండియా టీవీ… అదుగో వాటి తరువాతే రిపబ్లిక్ భారత్… (ఈ రిపబ్లిక్ పేరు కోసమే రవిప్రకాష్ ఫైట్ నడుస్తోంది)… ఒకప్పుడు ఏవో మాయలు, మంత్రాలు వేసి, ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచన రిపబ్లిక్ మాయల మరాఠీ ఇప్పుడు ఏకంగా అయిదో ప్లేసులోకి జారిపోయింది… రోజులన్నీ ఒకేతీరులో ఉండవ్ డియర్ అర్నబ్ గోస్వామీ…!!
Share this Article