చంద్రాపూర్ జిల్లా… ఆమె పేరు కంచన్ నాన్నావరె… 2014లో పోలీసులు అరెస్టు చేశారు… మావోయిస్టులతో సంబంధాలున్నాయని ఆరోపణ… వయస్సు 38 ఏళ్లు… ఆదివాసీ… ఉపా చట్టాన్ని ప్రయోగించారు… ఎరవాడ సెంట్రల్ జైలులో పడేశారు… టాడాలు, పోటాలను మించిన నల్లటి చట్టం కదా ఉపా అంటే… అసలు మన జైళ్ల సంగతి తెలుసు కదా… ఆమెకు పుట్టుకతోనే గుండె సంబంధ వ్యాధి ఏదో ఉంది… దీనికితోడు జైలు వాతావరణం… ఆ వ్యాధి పెరిగి మెదడు దాకా ప్రభావితమైంది… ఈ ఆరేళ్లలో ఎన్నోసార్లు బెయిల్ పిటిషన్లు వేయడం, తిరస్కరణకు గురవడం జరుగుతూనే ఉన్నయ్… ఆమె అరోగ్య పరిస్థితి బాగాలేదు, డాక్టర్లు కూడా హార్ట్ మార్పిడి జరగాలని అంటున్నారు, ఆమె ప్రాణాల్ని కాపాడండి అని అక్టోబరులో ఓ హైకోర్టులో ఓ పిటిషన్ కూడా పడింది… ఈరోజుకూ అది పెండింగే…
పరిస్థితి విషమించడంతో మొన్న 16వ తేదీన పూణెలోని సస్సూన్ హాస్పిటల్లో బ్రెయిన్ సర్జరీ చేశారు… కానీ పలితం లేకుండా పోయింది… ఆమె మరణించింది… ఆరేళ్లలో ఒక్క విచారణ లేదు, ఆమె చేసిన నేరాల నిరూపణ లేదు… అండర్ ట్రయిల్గానే ఉండిపోయింది… పోనీ, ఆమె బతికే హక్కును ఏమైనా రక్షించిందా మన వ్యవస్థ..? లేదు… మన చట్టాలు, మన కోర్టులు, మన పోలీసులు, మన జైళ్లు… ఆమెను అమాంతంగా మింగేశాయి… వోకే… ఆమెకు మావోయిస్టులతో సంబంధాలున్నాయి, వాళ్లకోసం పనిచేస్తున్నదీ అనే ఆరోపణ నిజమే అనుకుందాం… ఉపా చట్టమే ఆమెను నిర్బంధించడానికి సరైన చట్టం అనేదీ అంగీకరిద్దాం… కానీ సరైన విచారణ, నిరూపణ, తీర్పు ఉండాలి కదా… ఆమెకు మన రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులే కదా అవి…
Ads
కోర్టులో విచారణలూ ఉండవు, బెయిలూ ఇవ్వరు… అంటే అనుమతించబడని జైలుశిక్ష అన్నట్టే కదా… బెయిళ్లకు నోచుకోకుండా ఉన్న అండర్ ట్రయల్స్ అనుభవించే శిక్ష అన్యాయం కాదా..? అది ఎవరైనా సరే… ఒకవేళ ఏ పుణ్యతిథినాడో, ఎన్నేళ్లకో కోర్టులో పోలీసులు నేరనిరూపణ చేయలేకపోతే, కోర్టు వదిలిపెడితే… మరి ఇన్నేళ్ల నిర్బంధానికి, ఆరోగ్యనష్టానికి, అన్నిరకాల నష్టాలకూ ఏం పరిహారం వస్తుంది..? ఎవరివ్వాలి..? ఈ కేసులో చివరకు ప్రాణాలే కోల్పోయింది కదా…… విచారణలు జరిగితే, తీర్పులు వస్తే… పైకోర్టులకు అప్పీళ్లకు వెళ్లి, బెయిళ్లు తెచ్చుకుని, ఇళ్లకు వెళ్లి, మళ్లీ తమ నేరాల్ని యథాతథంగా సాగిస్తారు, అందుకని లెక్కాపత్రం లేని, విచారణ లేని జైలుశిక్షే కరెక్టు అన్నట్టుగా ఉంది ఈ చట్టం అమలు… కోర్టులు పౌరుల ప్రాథమిక హక్కుల కోణంలో ఎందుకు ఆలోచించకూడదు..? వరవరరావు అనారోగ్యం గురించిన వార్తలూ చదివాం, ఆయనతోపాటే ‘శిక్ష’ అనుభవిస్తున్న ఓ పెద్దాయనకు ద్రవాహారం తీసుకునేందుకు కనీసం కప్పు, స్ట్రా ఇవ్వడానికి కూడా ఎన్ఐఏ అధికారులు అంగీకరించలేదు… నేరం చేస్తే శిక్షించండి, కానీ నిరూపించి మరీ శిక్షను అమలు చేయండి… అంతేతప్ప, ఈ అమానవీయ ధోరణి దేనికి..? నేరస్థులకూ హక్కులుంటయ్ సార్… వీళ్లేమో నిరూపిత నేరస్థులు కారు… అలాగని విడుదలకూ నోచుకోరు… వీటిని ఏం ‘శిక్షలు’గా పిలవాలి ప్రభూ…!!
Share this Article