కెనడా- ఇండియా నడుమ దూరం బాగా పెరిగిపోతూ, గతంలో ఎన్నడూ లేనివిధంగా అక్కడి విద్యార్థులకు ఇండియా అలర్ట్ నోటీసులు జారీ చేయడం తెలిసిందే కదా… లక్షల మంది విద్యార్థులు, ప్రవాసులు… భారతీయ హిందువుల్లో ఓ భయం… భద్రతపై జంకు…
హిందువుల్లారా కెనడాను వదిలేసి ఇండియా వెళ్లిపొండి అని ఎవడో హెచ్చరికలు జారీ చేశాడు… ఆమధ్య హిందూ దేవాలయాలపై ఖలిస్థానీ రాతలు, హిందూ వ్యతిరేక స్లోగన్స్ రాశారు… నజ్జర్ హత్యకు ఇండియన్ ఏజెంట్లే కారణమని కెనడా ప్రధాని ట్రూడా ఆరోపించి, ఇండియన్ డిప్లొమాట్‌ను బహిష్కరించగా… ప్రతిగా ఇండియా ఇక్కడి కెనడా డిప్లొమాట్‌ను బహిష్కరించింది… రెండు దేశాల నడుమ అగాధం ఏర్పడింది, ద్వైపాక్షిక చర్చలూ నిలిచిపోయాయి…
చివరకు అమెరికా కూడా పెద్దన్న పాత్రలోకి వచ్చి నజ్జర్ హత్య దర్యాప్తులో కెనడాకు సహకరించాలని పిలుపునిచ్చింది… అసలు ఈ ట్రూడా అనేవాడికి వాళ్ల పార్లమెంటులో సరైన బలం లేకపోవడంతో సిక్కు ఎంపీల మీద ఆధారపడ్డాడనీ, వాళ్ల ఒత్తిడి మేరకే కెనడా ఖలిస్థానీ అడ్డా అవుతున్నా సరే కిమ్మనడం లేదనీ, పైగా మద్దతుగా నిలుస్తున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి… అసలు నజ్జర్ అనేవాడు దొంగ పత్రాలతో కెనడా వెళ్లాడు…
Ads
రాజకీయ ఆశ్రయమూ కోరాడు… అవన్నీ కెనడా గతంలోనే తిరస్కరించింది… అసలు తప్పుడు పాస్‌పోర్టుతో తమ దేశంలో ఉన్న నజ్జర్‌ను కెనడా ఎలా ఓన్ చేసుకుంటున్నదనే ప్రశ్నకు జవాబు లేదు… బ్రిటిష్ కొలంబియాకు చెందిన ఓ మహిళను పెళ్లిచేసుకున్నాడు నజ్జర్, ఆమె తన పాస్‌పోర్టును స్పాన్సర్ చేసింది… నిజానికి ఆమే గతంలో మరో కెనడా పౌరసత్వం ఉన్న వ్యక్తి ద్వారా స్పాన్సర్ చేయించుకుంది… సో, కెనడా పాస్‌పోర్టు కోసమే ఆ మహిళను పెళ్లిచేసుకున్నాడనే సందేహాలతో నజ్జర్ పాస్‌పోర్టు దరఖాస్తును తిరస్కరించింది…
సరే, ఇదంతా నజ్జర్ సంగతి, తనను గుర్తుతెలియని ముసుగు వ్యక్తులు ఆమధ్య కాల్చిపడేశారు… ఇప్పుడు తాజాగా మరో సంఘటన ఇలాంటిదే… సుఖదూల్ సింగ్ అలియాస్ సుఖా దునికే అనే ఓ గ్యాంగ్‌స్టర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు… 2017లో పంజాబ్ నుంచి నకిలీ డాక్యుమెంట్లతో కెనడా వెళ్లిన సుఖా మీద పంజాబ్ యాంటీ గ్యాంగ్‌స్టర్ టాస్క్ ఫోర్స్ కన్నుంది చాన్నాళ్లుగా… ఎన్ఐఏ కూడా నిఘా వేసింది… వాంటెడ్ టెర్రరిస్టు తను…
అతన్ని ఈరోజు విన్నీపెగ్‌లో కాల్చేశారు… తనకు డీబీ గ్యాంగ్‌తో (దవీందర్ బాంబియా గ్యాంగ్) పాటు ఖలిస్థానీ శక్తులతో సన్నిహిత సంబంధాలున్నాయని పంజాబ్ పోలీసులు చెబుతున్నారు… ఇప్పటికే ఇండియాతో గోక్కున్న కెనడా ప్రధాని ట్రూడా ‘అబ్బే, మేం ఇండియాను రెచ్చగొట్టదలుచుకోలేదు’ అని డ్యామేజ్ కంట్రోల్ మాటలు మాట్లాడుతున్నా సరే… ఇండియా మాత్రం ఖలిస్థానీ శక్తులకు కెనడా అడ్డాగా మారిన తీరుపై సీరియస్‌గానే ఉంది… జీ20 సదస్సు కోసం ఇండియాకు వచ్చిన బ్రిటన్, ఆస్ట్రేలియా ప్రభుత్వ ముఖ్యులకు కూడా మోడీ స్వయంగా ఇండియా ఆందోళనను వ్యక్తీకరించాడు… తాజా వార్త ఏమిటంటే… ఇండియా కెనడా వీసాల జారీని నిలిపివేసింది…
Share this Article