ముందుగా ఫేస్‌బుక్‌లోని ఈ పోస్టు చదవండి… ఇది మిత్రుడు శ్రీనాథ్ సుస్వరం వాల్ నుంచి తీసుకున్నాను… అది యథాతథంగా…
ఈ చిత్రంలో కనబడే పిల్లాడికి పన్నెండు నుండీ పదమూడు ఏళ్ళు ఉండొచ్చు. ఊరు, పేరు చూస్తే అతడి నేపథ్యం అర్థం అవుతుంది. ఇప్పుడు ఈ పిల్లాడు చేసిన వ్యాఖ్యల వల్ల అతడి కుటుంబ నేపథ్యం కూడా ఈజీగా అర్థం అవుతుంది.
Ads
ఈ మీడియా, రాజకీయ నాయకులదేముంది? తమ అవసరాల కోసం కొన్నాళ్ళు ప్రోత్సహిస్తారు. తరువాత కూరలో కరివేపాకులాగా పక్కకు విసిరేస్తారు.
వార్త కూడా చదివారుగా… చాలా ధైర్యంగా తన అభిప్రాయాలు చెప్పాడట… జ్వరంతో ఉన్నా, జపాన్‌లో ఉన్నా, థాయ్‌లాండ్‌లో ఉన్నా థాయ్ మసాజ్ తప్పదట జగన్‌కు… (తాట తీస్తా, నువ్వెంత నీ బతుకెంత టైపు పవన్ వ్యాఖ్యలు గుర్తొచ్చాయి…) అసలే కుళ్లికంపు కొడుతున్న ఏపీ పాలిటిక్స్‌లో చివరకు ఇలాంటి దేశముదురు విద్యార్థులు, వాళ్ల వ్యాఖ్యలు పెద్ద విడ్డూరం ఏమీ కాదు… కానీ దాన్ని ఓ వార్తగా ప్రచురించిన ఆంధ్రజ్యోతి పాత్రికేయ విచక్షణ, విజ్ఞత గురించి ఇక చెప్పుకోవడమూ దండుగ…
ఇక్కడ సీన్ కట్ చేసి… మన కాకినాడ డాక్టర్ గారి పోస్టు చదువుదాం… అదీ యథాతథంగా…
Yanamadala Murali Krishna…. ఎన్నో అవమానాలను.. అనుమానాలను.. వ్యక్తిత్వ హననాలను.. ద్వేషం అసూయలను.. కుటుంబ నేపథ్యాలను.. పేదరికాన్ని.. అమాయకత్వాన్ని దాటుకొని మాములు పల్లెల్లో గవర్నమెంట్ బడుల్లో చదువుకున్న నా తెలుగు బిడ్డలు ఈరోజున ఐక్యరాజ్యసమితి లాంటి అత్యున్నత ప్రపంచ వేదిక మీద సగర్వంగా నిలబడ్డారు..
ఐయామ్ ఫ్రం బెండపూడీ.. అంటూ ట్రోలింగులు చేస్తూ వెకిలించిన చదువుకున్న భావ దరిద్రులందరినీ చెప్పుతో కొట్టినట్టు! తల ఎత్తుకొని నిలబడ్డారు…
ఇదీ ఆ ఫోటో… ఒకే రాష్ట్రం… కొందరు మరీ బాలయ్య బాబులా మీసాలు తిప్పి, తొడలు కొట్టే బాపతు… తాటతీస్తా, థాయ్ మసాజ్ చేయిస్తా వంటి పవన్ కల్యాణ్ బాబు వ్యాఖ్యల బాపతు… మరోవైపు పూర్తి భిన్నమైన దృశ్యం… ఏపీ విద్యార్థులు ఐరాస వేదికపై తెలుగు జెండా ఎగరవేస్తున్న దృశ్యం… సరే ఈ కంపు రాజకీయాల నుంచి బయటికి వస్తే… మన విద్యార్థులదే మరో మంచి న్యూస్… వైసీపీకి, సాక్షికి ‘‘చెప్పుకోవడం తెలియని’’ వార్త… సాయిరెడ్డి ట్వీట్ చదవండి ఓసారి… (ఏదో పత్రికలో ఎవరో మంత్రి కూడా చెప్పినట్టు ఓ సింగిల్ కాలమ్ వార్త చదివినట్టు గుర్తు…)
ఇప్పటికే ఏపీలో సర్కారు బడి తన రూపురేఖలు మార్చుకుంటోంది… లుక్కే కాదు, మౌలిక వసతులకూ బోలెడంత ఖర్చు పెడుతున్నారు… ఇంగ్లిష్ మీడియం పెట్టారు… (సర్కారీ టీచర్లకు ఈ అవసరాలకు అనుగుణమైన సంపూర్ణ శాస్త్రీయ శిక్షణ ఇంకా అవసరం…) టెన్త్, ఇంటర్ ఫెయిల్డ్ టీచర్లతోనూ పాఠాలు చెప్పించి మమ అనిపించేస్తున్న నాసిరకం ప్రైవేటు స్కూళ్ల దోపిడీకి ఇది చెక్… కాదు, నాణ్యమైన సర్కారీ విద్య దిశలో మంచి అడుగులు… క్రమేపీ హయ్యర్ స్టాండర్డ్స్‌తో గురుకుల విద్య వైపు ఇంకా అడుగులు పడితే మరింత మేలు…
సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ సిలబస్‌లు మాత్రమే కాదు… తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్నేషనల్ స్కూళ్లు ఇతర అంతర్జాతీయ సిలబస్‌లను అమలు చేస్తున్నాయి… తాజాగా జగన్ ప్రభుత్వం ఐబీ సిలబస్‌ను రాష్ట్రంలోని స్కూళ్లల్లో అమలు చేసేందుకు వీలుగా ఒప్పందం కుదుర్చుకుంది… ఈ ఐబీ కరిక్యులం చాలా ఫేమస్… ప్రపంచంలోని ప్రతి దేశమూ దీన్ని విలువైన సిలబస్‌గా గుర్తిస్తుంది… హైదరాబాద్‌లోని కొన్ని ప్రిస్టేజియస్ ఇంటర్నేషనల్ స్కూళ్లలో ఈ సిలబస్‌లో బోధనకు 2 నుంచి 2.5 లక్షలు తీసుకుంటున్నారు… అదీ ఆ సిలబస్ స్టాండర్డ్…
ప్రస్తుతం ఏపీలోని 60 వేల స్కూళ్లలోని 80 లక్షల మంది పిల్లలకు ఈ సిలబస్ అందుబాటులోకి రానుంది… రాజకీయాలకు అతీతంగా జగన్ ప్రభుత్వ నిర్ణయాల్ని, అడుగులను మెచ్చుకోవాలి… (జరగాల్సింది ఇదుగో ఇదే… థాయ్ మసాజ్ పిల్లలు కాదు…) ఈ సిలబస్ గొప్పతనాన్ని కనీసం సాక్షి కూడా రాసుకోలేకపోయింది… ఇక వైసీపీ శ్రేణుల గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది… ఈ సిలబస్‌లో ఫస్ట్, సెకండ్ లాంగ్వేజీలతో పాటు మ్యాథ్స్, సైన్సెస్, హిస్టరీ, ఆర్ట్స్‌తోపాటు థియరీ ఆఫ్ నాలెడ్జ్ సబ్జెక్టు కూడా ఉంటుంది… గుడ్ మూవ్ జగన్… కీపిటప్…
Share this Article