నిన్నటి నుంచీ ఓ వార్త చక్కర్లు కొడుతోంది… సీ వోటర్ ఓ సర్వే చేసిందట… అరెస్టు తరువాత చంద్రబాబుకు సింపతీ పెరిగిందా..? అది వోట్లుగా కన్వర్ట్ అవుతుందా..? ఏ పార్టీ వోటర్లు ఏమనుకుంటున్నారు..? ఇదీ ఆ వార్త… అందరూ మూకుమ్మడిగా చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తున్నారట… చివరకు వైసీపీ వోటర్లకు కూడా ఈ అరెస్టు నచ్చలేదట… అనవసరంగా చంద్రబాబుకు సింపతీ వచ్చేలా జగన్ దుందుడుకు చర్యకు పాల్పడ్డాడని భావిస్తున్నారట…
ఈ దెబ్బకు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు సింపతీ వోటుతో విజయం సాధించబోతున్నాడనే కలరింగు ఈ సర్వే వార్త ద్వారా కనిపించింది… సహజంగానే సాక్షికి ఇలాంటివి కనిపించవు కదా, ఈనాడు- ఆంధ్రజ్యోతి ఇతర యెల్లో చానెళ్లు ఈ వార్తను, ఈ సర్వే ఫలితాలను కుమ్మేశాయి… మరి చంద్రబాబుకు అనుకూలమైన వార్త కదా… అనుకూలమైన సర్వే కదా…
మరి నాలుగు రోజులు అక్కడే నిక్షేపంగా, నిమ్మలంగా ఉండొచ్చు కదా… ఈ కోట్ల ఖర్చు లాయర్లు దేనికి..? వాదనలు దేనికి..? ఏసీ లేదని శోకాలు దేనికి..? వేణ్ణీళ్లు లేవని ఆందోళన దేనికి..? మీసాలు తిప్పుడు, తొడలు కొట్టి ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామనే వ్యర్థ పిలుపులు దేనికి..? ప్రజాక్షేత్రంలో తేల్చుకునే పక్షంలో కోర్టులకు వెళ్లడం దేనికి బాలయ్యా…
Ads
అదేమిటి..? సీ-వోటర్ సర్వే చాలా క్రెడిబుల్… పొలిటికల్ పార్టీలు దాన్ని ప్రామాణికంగా తీసుకుంటాయి తెలుసా..? ఇదేనా మీ సందేహం, మీ ప్రశ్న… సరే, అంగీకరిద్దాం కాసేపు… సీ-వోటర్ సర్వేలో తీసుకున్న శాంపిళ్లు ఎన్ని..? మిక్స్ ఎంత..? ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు చేశారు వంటి వివరాలు ఏమీ కనిపించడం లేదు… ఏ సర్వే సంస్థయినా తమ సర్వేను పబ్లిష్ చేస్తున్నప్పుడు (అనగా జనంలోకి వదులుతున్నప్పుడు) సర్వే వివరాలను కూడా తెలియజెప్పాలి… అది సర్వే సంస్థల కనీస విజ్ఞత… అవునూ, జాతీయ స్థాయిలో కీలకమైన సందర్భాల్లో సర్వేలు చేసే సదరు సీ-వోటర్ ఇంత అర్జెంటుగా ఒక నాయకుడి అరెస్టు మీద సర్వే చేయడం ఏమిటి..? తన సర్వేల ప్రయారిటీ లిస్టులోకి ఈ అరెస్టు ఎలా వచ్చింది..?
సరే, అదీ వదిలేద్దాం… అసలు ఏపీలో బీజేపీ, కాంగ్రెస్ వోటర్లు ఎక్కడున్నారు..? ఉంటే గింటే జనసేనకు కొన్ని వోట్లు ఉన్నాయి… ప్రధాన ప్రత్యర్థులు వైసీపీ, తెలుగుదేశం మాత్రమే… ఆ వోట్లర అభిప్రాయాలే పరిగణనలోకి రావాలి… అనగా క్రోడీకరణలోకి రావాలి… మరి ఏ పార్టీ వోట్లు ఎన్ని తీసుకున్నారో కూడా తెలియదు… కాంగ్రెస్, బీజేపీ వోటర్ల అభిప్రాయంతో ఒరిగేదేమిటి..? వాటిని కూడా ఇతర పార్టీలకు ఈక్వల్‌గా లెక్కలోకి తీసుకుంటే దాని క్రెడిబులిటీ ఎంత..?
ఈ అరెస్టుతో పరిణామాలు, సింపతీ ఎలా ఉంటాయో జగన్‌కు ఆల్‌రెడీ ఐప్యాక్ టీం ఇన్‌స్టంట్ సర్వే చేసి వివరాలు చెప్పిందని మరో సమాచారం… తన వోట్లకు ప్రమాదం ఉంటే… ఉన్నతాధికారులు, మంత్రులతో మాట్లాడుతూ… మార్గదర్శి శైలజ విదేశాలకు వెళ్లిపోయింది, ఇక రామోజీని, లోకేష్‌నూ జైలుకు పంపించేద్దాం… సీట్లు తగ్గినా మళ్లీ అధికారంలోకి వస్తాను.,. మీకు ఏమీ కాదు అని భరోసా ఇవ్వడం ఏమిటి..? (టీవీ5 నాయుడు, ఏబీఎన్ రాధాకృష్ణలు తనకు తెలుగుదేశాన్ని మించి ప్రత్యర్థులు అని జగన్ గతంలో బహిరంగంగానే అన్నాడు కదా… మరి అరెస్టుల జాబితాలో వాళ్ల పేర్లు మాత్రం లేవు…)
సరే, ఈ సర్వే నిజమేననీ, చంద్రబాబు పట్ల సింపతీ బాగా పెరిగిపోయిందనీ నమ్ముదాం… (సర్వేలు రకరకాలు, ఆ వివరాలు-చర్చ జోలికి ఇక్కడ వెళ్లడం లేదు)… ఒకవేళ ఇదే నిజమైతే ఇక జగన్ ముందస్తు ఆలోచన మానుకుని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు సై అంటాడా..? రోజులు గడిచేకొద్దీ చంద్రబాబు మీద సానుభూతి పెరుగుతుందా..? తగ్గిపోతుందా..? ఓ నెలరోజులాగి, రామోజీ-లోకేష్‌ల అరెస్టులూ జరిగాక మరోసారి సీ-వోటర్ రంగంలోకి దిగుతుందేమో… అప్పుడు సర్వే ఏమంటుందో మరి…!!
Share this Article