ఈ వార్త ఉద్దేశాన్ని, వార్త సారాంశాన్ని, స్థూలంగా వార్తను నేనేమీ తప్పుపట్టడం లేదు… అదొక కోణం… తెలంగాణలో బీజేపీ టికెట్ల కోసం వెయ్యి మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారనే ఓ కొత్త పాయింట్ పట్టుకుని, అసలు ఇంతవరకూ రాష్ట్రంలో ఏ ఒక్కరూ బీజేపీ టికెట్టు మీద ఎమ్మెల్యేగా ఎన్నిక కాకపోయినా సరే అంత భారీగా దరఖాస్తులు వచ్చాయనేది ఆ వార్త కోణం… కాకపోతే ఆ శీర్షికే భిన్నంగా ఉండి, వెక్కిరిస్తున్నట్టుగా అనిపిస్తోంది… రాసిన విలేఖరి కూడా సీనియర్ లేడీ జర్నలిస్టు…
అది అవసరం లేదు… No bjp woman candidate ever won assembly poll in telangana, but 1000 seek party ticket… డీకే అరుణ, రాణి రుద్రమ ఫోటోలతో ఏయే స్థానం నుంచి ఇంకా ఎవరెవరు టికెట్లు ఆశిస్తున్నారో ఈ వార్త రాసుకొచ్చింది… గుడ్… ఇక్కడ పాయింట్ ఏమిటంటే… నిజమే, గతంలో మహిళా నాయకులు ఎవ్వరూ తెలంగాణలో బీజేపీ టికెట్టు మీద గెలవలేదు… సరే, ఇప్పుడు టికెట్లు ఆశిస్తే తప్పేమిటి..? ఇప్పుడు గెలవకూడదని ఏముంది..?
Ads
ఈమాత్రం దానికి ‘‘ఇప్పటిదాకా ఎవ్వరూ గెలవలేదు గానీ ఈసారి 1000 మంది టికెట్లు కావాలట…’’ అనే ధ్వని వినిపిస్తోంది ఈ శీర్షికలో… ఎస్, పార్టీ కేడర్‌లో ఓ కదలిక కోసం, ఎన్నికల వాతావరణంలోకి పార్టీ శ్రేణుల్ని తీసుకువెళ్లడం కోసం… ఈమధ్య బీజేపీ జోష్ దారుణంగా తగ్గిపోయింది కదా, మళ్లీ ఓ ఉత్సాహాన్ని తీసుకురావడం కోసం పార్టీ అభ్యర్థిత్వ దరఖాస్తుల్ని స్వీకరించింది… ఈ చిన్న చిన్న ప్రయత్నాలతో మళ్లీ బీజేపీ జోష్ కొంతైనా పెరుగుతుందా అనేది మళ్లీ డిబేటబుల్…
ఒకవైపు పార్లమెంటు మహిళా బిల్లును ఆమోదిస్తూ… వచ్చే ఎన్నికల నాటికైనా సరే మూడో వంతు సీట్లను మహిళలే దక్కించుకోబోతున్న సందర్భంలో ఈ వార్త అసందర్భం అనిపిస్తోంది… పేరున్న నాయకుల సతీమణులు, బంధువులు, పిల్లలు టికెట్లు దక్కించుకోవచ్చుగాక… బీజేపీ నుంచి కూడా పలువురు గెలవవచ్చుగాక… ఇదంతా రాజకీయం… మెల్లిమెల్లిగా మహిళలు ఏ కుటుంబ రాజకీయ నేపథ్యం లేకుండానే సొంతంగానే బరిలోకి దిగే దశ వైపు ఈ అడుగులు… ఆ రోజులు రావాలనే కోరుకుందాం…
నిజానికి గతంలో ఒక్కరూ గెలవకపోయినా సరే 1000 మంది దరఖాస్తు చేసుకున్నారనేదే ఓ పాజిటివ్ అంశం… ఈ వార్తలో అరుణ, రాణి రుద్రమ పేర్లతో పాటు బంగారు శృతి, ఆకుల శ్రీవాణి, జీవిత రాజశేఖర్, కరాటే కల్యాణి తదితరుల పేర్లు కూడా రాసుకొచ్చారు… జీవిత రాజశేఖర్ నాలుగైదు స్థానాలకు దరఖాస్తు చేసుకున్నట్టుంది… సరే, అందులో ఎందరికి పార్టీ టికెట్లు ఇస్తుంది, దరఖాస్తు చేసుకున్నవారిలో ఆల్‌రెడీ రాజకీయ చిత్రపటంలో యాక్టివ్‌గా ఉన్నారు, ఎందరు పురుష నాయకుల బినామీలు అనే విశ్లేషణ ఇప్పుడు అనవసరం… ఈ సంఖ్యలో మహిళా నాయకుల సంసిద్ధత, కోరిక, దరఖాస్తులు సకారాత్మకమే కదా…
అఫ్‌కోర్స్, తెలంగాణలో బీజేపీ పేరుతో గెలిచిన మహిళలు లేరుగా అంటారా..? బీజేపీ పేరుతో కాకపోవచ్చుగానీ డీకే అరుణది దాదాపు సొంత గెలుపే… ప్రస్తుతం కోర్టులో చిక్కినట్టుంది వ్యాజ్యం… ఏపీలో మహిళా అధ్యక్షురాలు ఉంది… రాష్ట్రపతి మహిళ… మంత్రుల్లో స్మృతి, నిర్మల తదితరులు పాపులరే… వసుంధర రాజే వంటి ముఖ్యమంత్రి రేంజ్ నాయకులూ ఉన్నారు… సో, గేలి అవసరం లేదు… కాస్త పుష్ చేయడమే బెటర్… అవునూ, హుజూరాబాద్ నుంచి సీనియర్ జర్నలిస్టు దేవికారెడ్డి దరఖాస్తు చేసుకోలేదా..?
Share this Article