జర్నలిస్టులే కాదు, నాన్-జర్నలిస్టులకూ ఇది ఓ మంచి వార్తే… ఎందుకంటే, భార్య తనను వదిలేసిందనే ఫ్రస్ట్రేషన్లో ఒక భర్త ఉన్మాదిగా మారి, ఒంటరిగా కనిపించిన మహిళలను ఆకర్షించి, ఎక్కడికో తీసుకుపోయి, హతమార్చే సైకో బాపతు వార్త ఇది… సాధారణంగా సైకో దర్శకులు తీసే థ్రిల్లర్ సినిమాల్లో ఇలాంటి కేరక్టర్లు కనిపిస్తాయి… నిజజీవితంలో కొందరు ఇలా తారసపడతారు… గుడ్, పోలీసులు పట్టుకున్నారు, మీడియా మీట్ పెట్టారు, ఐడెంటిఫికేషన్ ఇష్యూస్ రాకుండా ఓ ముసుగు కప్పేసి విలేకరుల ఎదుట ప్రజెంట్ చేశారు… ఆల్ గుడ్… కానీ..? కానీ..? ఇప్పటివరకూ 18 హత్యలు చేసిన ఓ సీరియల్ కిల్లర్ విషయంలో కోర్టులు గానీ, పోలీసులు గానీ నిజంగా స్పందించాల్సిన రీతిలోనే స్పందించారా..? జస్ట్, కేరేపిన్ అన్నట్టుగా వ్యవహరించారా..? వాళ్లు బహుముఖంగా ఆలోచించడం ఏనాడో మానేశారా..? ఎమ్మెల్యేల ప్రైవేటు బలగాలుగా మారిపోయిన మన పోలీస్ వ్యవస్థ తమ ప్రొఫెషనలిజాన్ని కోల్డ్ స్టోరేజీలో పెట్టేశారా ఎప్పుడో…. ఇదీ ప్రశ్న… ఓసారి ఈ వార్త చదవండి,,,
ఇదీ సదరు రాములు నేరగాథ… వాడికి బయట తిరిగే హక్కు లేదు… అసలు బతికే హక్కు ఉందా లేదానేదీ ఒక ప్రశ్నే… దాన్నలా వదిలేద్దాం… వాడు ఒక్కొక్కరినీ ఎలా హతమార్చాడో కూడా వదిలేద్దాం… కానీ తను సీరియల్ కిల్లర్ కదా… తన నేరస్వభావం వెనుక ఓ మూలకథ ఉంది కదా… అందుకే కదా తను సైకోగా మారింది… తను నేరస్థుడా..? మానసిక వ్యాధి బాధితుడా..? తనను శిక్షించాలా..? చికిత్స అందించాలా..? సరే, అదీ వదిలేద్దాం… మన శిక్షాస్మృతి, మన చట్టాలు, మన న్యాయస్థానాలు ఇంకా ఆ స్థాయికి ఎదగడానికి చాలా తరాలు పడుతుంది కాబట్టి మరో టాపిక్ చూద్దాం… సీరియస్‌గా ఆలోచించాలి సుమా…
Ads
ఇంతకుముందే… పదేళ్ల క్రితం తనకు జీవితఖైదు వేశారు… వాడి మెంటల్ కండిషన్ సరిగ్గా లేదు అని ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో చేర్చారు… తరువాత పోలీసుల కళ్లు గప్పి పారిపోయాడు… (కళ్లగప్పడం వెనుక కథల్ని కూడా వదిలేద్దాం…) తప్పించుకున్నాక కూడా 5 హత్యలు చేశాడు… అంటే తన ఉన్మాదం పీక్స్‌లోకి వెళ్లింది… 2013లో మళ్లీ అరెస్టు చేశారు… శిక్ష పడింది… 2018లో జీవితఖైదుకు సంబంధించి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నాడు… కోర్టు నిజంగానే క్షమాభిక్ష ప్రసాదించేసింది.,. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే..? ఏ బేసిస్ మీద తనకు క్షమాభిక్ష లభించింది..? తను మారినట్టు ఎవరు నిర్ధారించారు..? పోలీసులు దీన్ని ఎందుకు వ్యతిరేకించలేదు..? బయటికి వచ్చాడు, మరో ఇద్దరిని ఖతం చేశాడు… ఈ రెండు హత్యలకు కారణం నిజంగా ఎవరు..? జీవితఖైదు నుంచి క్షమాభిక్ష ప్రసాదించడానికి ప్రాతిపదిక ఏమిటి..? ఒక మనిషి నిజంగా మారాడు అని ఎవరు, ఎలా నిర్ధారిస్తున్నారు..? ఇది కదా మనం అసలు ఆలోచించాల్సిన ప్రశ్న… మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఈ కోణంలో ఒక్క ముక్క కూడా రాకపోయేసరికి ఆశ్చర్యం వేసింది..? ఏమో, రేప్పొద్దున మళ్లీ ఇదే రాములు మళ్లీ క్షమాభిక్ష పిటిషన్ వేస్తే..? ఇదే పోలీసులు మళ్లీ మౌనంగా ఉండిపోతే..? మరో ఇద్దరు మహిళల ప్రాణాలు హరీమంటే..? అప్పుడు మళ్లీ కేసు, మళ్లీ అరెస్టు… మళ్లీ జైలు… అంతేనా..? పోలీసులు, జర్నలిస్టులు, లాయర్లు, జడ్జిలు మాత్రమే కాదు… అన్ని సెక్షన్ల ప్రజలూ కాస్త ఆలోచించాల్సిన ప్రశ్న కాదా ఇది..? రాములూ, నువ్వు చార్లెస్ శోభరాజ్కన్నా గొప్పోడివిరా…!! వారసుల పట్టాభిషేక ఆలోచనల్లో బిజీగా ఉన్న మహాపాలకుడికి ఇవన్నీ తెలియవు, పట్టవు, చదవడు, ఎవరూ ఆయన నోటీసుకు తీసుకురారు, ఆఫ్టరాల్ రాములు…! ఇంతకూ మన హోం మినిష్టర్ ఎవరబ్బా…!!
Share this Article