సినిమా సైట్లు, యూట్యూబ్ చానెళ్లు, సోషల్ మీడియాలో ఓ చర్చ జరుగుతోంది… చంద్రముఖిగా ఎవరు బాగా చేశారు అని..! సరదాగా బాగానే ఉంది కానీ చాలామంది కంగనా రనౌత్‌ను నాలుగో నంబర్ చంద్రముఖిగా చెబుతున్నారు… అదీ బ్లండర్…
ఆమె త్వరలో విడుదల కాబోయే చంద్రముఖి-2 సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది… నటిగా ఆమె మెరిట్‌కు వంక పెట్టలేం… కాకపోతే ఆమె సౌత్ సినిమాల్లో నటించి ఎప్పుడూ పెద్దగా క్లిక్ కాలేదు… ఈ సినిమా రిజల్ట్ చూడాలిక… దెయ్యం, ఆత్మల సినిమాలకు రాఘవ లారెన్స్ పెట్టింది పేరు, ఆ కోణంలో తను నటించిన సినిమాలన్నీ దాదాపు హిట్లే… సో, ఆ కోణంలో చంద్రముఖి-2 క్లిక్ కావచ్చు కూడా…
నిజానికి నాగవల్లి సినిమాను చంద్రముఖి సీక్వెల్ అని చెప్పుకున్నారు గానీ కాదు… అస్సలే కాదు… ఆ కథకూ నాగవల్లికీ అసలు సంబంధమే లేదు… పైగా నాగవల్లి సినిమాలో అంతా నాన్సెన్స్ నింపారు, దాంతో అట్టర్ ఫ్లాప్… పలు భాషల్లో చంద్రముఖి కథతో ఇన్‌స్పయిరై పలు సినిమాలు తీశారు గానీ అవేవీ చంద్రముఖి సీక్వెల్స్ కావు… సో, ఇప్పుడు రాబోయే లారెన్స్, కంగనాల చంద్రముఖే అసలు సీక్వెన్స్ అనుకోవాలి…
Ads
పైగా కంగనా రనౌత్ చంద్రముఖి-4 కానే కాదు… నిజానికి ఆమె చంద్రముఖి నంబర్ ఫైవ్… ఎందుకంటే…? మొదట ఈ కథ మలయాళంలో మణిచిత్రతాజు పేరుతో రిలీజైంది… సూపర్ హిట్… అందులో శోభన ప్రధాన పాత్ర… స్వతహాగా ఆమె శిక్షణ పొందిన శాస్త్రీయ నృత్యకారిణి… ఆ పాత్రలో బాగానే చేసింది… కాకపోతే డాన్సయినా, నటనయినా ఆమె మొహంలో కనిపించే ఉద్వేగాలు ఇవీ అని చెప్పడం కష్టం… అర్థం కావు…
కన్నడంలో ఇదే సినిమాను ఆప్తమిత్రగా తీశారు… అందులో సౌందర్య ప్రధాన పాత్ర పోషించింది… సౌందర్య అంటే సౌందర్యే… నటనకు వంకల్లేవ్… కానీ ఎందుకో ఈ సినిమాలో కొన్ని సీన్లలో ఓవరాక్షన్ చేసినట్టు అనిపిస్తుంది… క్లైమాక్స్‌లో… తరువాత తమిళం, తెలుగు భాషల్లో చంద్రముఖి పేరిట తీశారు… రజినీకాంత్ హీరో, జ్యోతిక ప్రధాన పాత్ర… నయనతార సెకండ్ హీరోయిన్…
జ్యోతిక ఇరగదీసింది… ఎక్కడా అతి లేకుండా, పాత్రకు తగ్గకుండా (తగినట్టుగా) నటించింది… ప్రత్యేకించి క్లైమాక్స్‌ను నిలబెట్టింది ఆమే… రజినీ, వడివేలు నటించిన కొన్ని సీన్లు, డైలాగులు వెగటు పుట్టించేలా ఉండి, ఫస్టాఫ్ చిరాకెత్తిస్తుంది… ఈటీవీ బూతుల జబర్దస్త్ నయం… సదరు దర్శకుడిది చీప్ టేస్ట్… కథాబలమే ఈ సినిమా బలం… తరువాత హిందీలో భూల్ భులయ్యా వచ్చింది… అందులో విద్యాబాలన్ చంద్రముఖి పాత్రను పోషించింది… ఆమె కూడా ఒరిజినల్ గా సౌతే కదా… బాగా చేసింది… డాన్సర్ పాత్రను చంద్రముఖి తెలుగులో చేసిన వినీతే హిందీలోనూ చేశాడు…
సో, ఇప్పుడు వస్తోంది చంద్రముఖి నంబర్ ఫైవ్… పైన చెప్పిన నలుగురూ దక్షిణాది హీరోయిన్లు… మొదటిసారి నార్త్ చంద్రముఖి వస్తోంది… పైగా ఇది సీక్వెల్… కథ, కథనం, ప్రజెంటేషన్ ఎలా ఉంటాయో చూడాలిక… చంద్రముఖిలో రజినీ హీరో… ఇప్పుడు సీక్వెల్‌లో రాఘవ లారెన్స్ హీరో… అంత పెద్ద రజినీ బూట్లలో కాళ్లు పెడుతున్నాడు… అందుకే ఆసక్తి…
అఫ్‌కోర్స్, కంగనా వోకే… డౌటే లేదు… కాకపోతే ఆ పాత దర్శకుడు వాసే దీనికీ దర్శకుడు… అందుకే కాస్త డౌట్ కొడుతోంది… అంతే… సంగీతం కూడా బాగానే నప్పినట్టుంది… కీరవాణి కదా… అన్నట్టు ఇది పాన్ ఇండియా మూవీ… అయిదు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు… ఇక సీక్వెల్‌ను వేరే భాషల్లోకి రీమేక్ చేసే చాన్సే లేదు…!!
Share this Article