చాలారోజుల క్రితం.,. అంటే జగన్ జైలుకు వెళ్లిన తొలిరోజులు… అప్పటికే సాక్షి పత్రిక ప్రారంభమైంది… ఇప్పుడు టీవీ5, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈటీవీ, ఏబీఎన్, మహాన్యూస్ ప్రదర్శిస్తున్న చిత్త పైత్యాన్నే అప్పట్లో సాక్షి కూడా ప్రదర్శించింది… ప్రత్యేకించి ఒక వార్త… ఇప్పుడు దాని క్లిప్పింగ్ దొరకడం లేదు గానీ బాగా వైరల్…
ఓ పసిపిల్లాడు జగన్ అరెస్టయ్యాక ఏడుస్తూ అన్నం కూడా తినడం లేదట… టీవీలో జగన్ వీడియో ఏదో చూపించాక తిన్నాడట… దాదాపు ఇలాంటి వార్తే… భజన వార్తలు ఎలా ఉండకూడదో, కీర్తనలు కూడా నాణ్యతతో ఉండాలని చెప్పడానికి ఇలాంటి ఉదాహరణలు మన తెలుగు పాత్రికేయంలో బోలెడు… ఇక టీవీలు, సోషల్ సైట్ల సంగతి చెప్పనక్కర్లేదు…
నిజానికి ఇలాంటివి సదరు నాయకుల్నే నవ్వులపాలు చేస్తాయి… ఆ సోయి వార్తా రచయితలకు ఉండదు… సేమ్, ఇప్పుడు చంద్రబాబు అరెస్టు మీద తమ వార్తలతో ఆయన మీద ప్రజల్లో బోలెడంత సానుభూతిని సంపాదించి పెట్టాలని పైన చెప్పిన మీడియా సంస్థలు తెగ ఆరాటపడుతున్నాయి… కానీ జనం నవ్వుకుంటున్నారనే సోయి లేదు వాటికి… ఓ న్యూస్ ప్రజెంటర్ దోమల్ని వేరే ప్రాంతాల నుంచి తెప్పించి, రాజమండ్రి జైలులో వదులుతున్నారనీ, ఆయన్ని చంపేయడానికి కుట్రపన్నారనీ కళ్లలో నీళ్లు పెట్టుకుంటాడు… రేపు బెయిల్ గ్యారంటీ అని జోస్యాలు చెబుతుంటాడు…
Ads
మరొక మహా జర్నలిస్టు ఏకంగా వంద దేశాల్లో చంద్రబాబు విడుదల కోసం ఆందోళనలు సాగుతున్నాయని అంటాడు… ఎన్టీవో విషవాయువుల్ని వదులుతున్నారని మరొక అత్యుత్తమ వ్యాఖ్యానం… పాత్రికేయ పతనంలోనూ కొత్త లోతు అన్నమాట… రోజూ ఇలాంటి పైత్య ప్రదర్శనలు బోలెడు… లాఫింగ్ గ్యాస్‌తో మనుషులు మరణించరురా బాబూ అని ఎవరైనా చెప్పినా సరే వినరు వాళ్లు… అంతా టాల్కమ్ పౌడర్ బాపతు జర్నలిజం కదా… వీళ్లనే ఇప్పుడు ఎలపరం జర్నలిస్టులు అంటున్నారు…
చివరకు ఈనాడు సైతం తనేం రాస్తున్నదో తనే వెనక్కి తిరిగి చూసుకునే స్టేజ్ దాటిపోయింది… వేగపతనం… ప్రమాణాల్ని పాతరేయడంలో తాజా ఈనాడు వార్తను ఓ ఉదాహరణగా చెప్పొచ్చు… ఇదుగో అదే ఇది…
ఏదో తాళ్లరేవు అనే సెంటర్ నుంచి జనరేటైన వార్త… ఆ మండలంలోని నీలపల్లిలో టీడీపీ కార్యకర్తలు ‘బాబుతో నేను’ అనే ఇంటింటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ… మాదాసు సుందరమ్మ అనే వృద్దురాలిని కలిశారట… చంద్రబాబు అరెస్టు గురించి చెప్పారట… దాంతో ఆమె బాగా ఆవేదనకు గురై ‘నా పెద్ద కొడుకును అరెస్టు చేసినప్పటి నుంచి నిద్ర, ఆకలి లేవు బాబూ అని కన్నీరుమున్నీరు అయిపోయిందట… ఆయన చేసిన తప్పేమిటో చెప్పండిరా అని ఆగ్రహించిందట కూడా… నాయకులు ఫాఫం ఆమెను ఓదార్చారట…
అరెస్టు గురించి అప్పుడే చెబితే తప్ప ఆమెకు అరెస్టు సంగతి తెలియదని వార్త రాస్తూ… ఆయన అరెస్టు చేసినప్పటి నుంచి నిద్ర, ఆకలి లేవని ఆమె ఏడ్చిందని రాయడాన్ని ‘దిక్కుమాలిన పాత్రికేయం’ అనాలా..? ‘తలతిక్క జర్నలిజం’ అనాలా..? ‘పైత్య ప్రదర్శన’ అనాలా..? ‘చిత్తప్రకోపం’ అనాలా..? ఈనాడు పెద్దలంతా కాలర్లు ఎగరేయండి… సదరు వార్త రాసిన విలేకరికి, దిద్దిన సబ్‌ఎడిటర్‌కు కూడా అవార్డులు ఇవ్వండి, గర్వపడండి… తలలు ఎగరేయండి… ఈనాడు పెద్దలకూ టీవీ5 సాంబశివుడికీ, మహాన్యూస్ వంశీకి తేడా ఏమున్నట్టు ఇక…!! తెలంగాణ ఏర్పడ్డాక 11 రోజులు నిద్రాహారాలు లేవని బాధపడ్డ పవన్ కల్యాణుడికి మాదాసు సుందరమ్మదీ దీటైన బాధే…!!
Share this Article