మనిషికి basic needs అయిన, తిండి – బట్టలు – ఇల్లు – ఉద్యోగం – ఆరోగ్యం – security – స్నేహితులు – family లాంటివి, ఒక్కసారి నెరవేరితే చాలు content గా ఉంటాడు. కానీ అవి incremental happiness ని ఇవ్వవు.
అంటే…ఒక certain point కి వచ్చాక, అవి ఇంకా ఇంకా కావాలి అనే need ఉండదు. అయినా కూడా కావాలి అని సమకూర్చుకున్నా, ఆ accumulation కి proportional గా happiness పెరుగుతూ ఉండదు.
మరి మనిషి చనిపోయే వరకూ కావాలి – ఇంకా కావలి అనుకునేది, motivate చేసేది ఏంటి? ఏది అతనికి పొందుతున్నా కొద్దీ happiness పెరుగుతూ ఉంటుంది??
అవే….”society లో తనకి ఒక గౌరవం – గుర్తింపు – హోదా – బలం – పరువు”
దీనికి పైన ఇంకొకటి ఉంటుంది. అదే self actualization.
అంటే ఒక మనిషి తన talent ని – uniqueness ని – తన maximum potential ని fulfill చేసుకునే ప్రక్రియలో ఉండటం. తనకి జీవితంలో ఒక purpose ని ఇచ్చేది – ఇంకా ఒక అందమైన అర్దాన్ని రాసుకునేది.
ఇది తనలో ఒక best version గా evolve అవ్వాలనే ఒక strong desire.
ఇది కూడా జీవితం అంతా ఉంటుంది మనిషికి. incremental happiness ని ఇస్తుంది.
కానీ self actualization అనే need ని fulfill చేసుకునే “విషయం” అందరి దగ్గరా ఉండదు.
అందికే వాళ్ళ focus ఎప్పుడూ society లో గుర్తింపు – హోదా దెగ్గర ఆగిపోతుంది. వెంపర్లాడుతుంది.
దానికోసం ఏమైనా చేస్తారు. ఎంతకయినా తెగించేస్తారు.
వాళ్ళకి అది పొందాక వచ్చే satisfaction ఇంకా fulfillment మాత్రమే ముఖ్యం.
——-
లక్షలు – కోట్లు పెట్టి లడ్డు కొనడంలో భక్తి – విశిష్టత – ప్రాముఖ్యతలు ఏమి ఉండవు. మీరు నమ్మే దేవుడు అంటే ఏంటో మీకయినా అర్ధమైతే…
మనిషి బుద్ది గురించి అవగాహన లేనివారు అది ‘భక్తి’ అనే భ్రమలో ఉంటారంతే.
కొనేవారిలో భక్తి aspect కొంచెం ఉంటుంది…అది మీ భక్తి కంటే ఎక్కువేమీ ఉండదు.
“ఆ ధర, status కోసం కొంతమంది పోటీ పడిన ‘ఆట’ ది మాత్రమే.”
——
Wish you a safe Ganesh immersion.
తాగి తలని నేలకేసి కొట్టుకోవడాలు, current తీగలు పట్టుకుని వేలాడటాలు కొంచెం తగ్గిస్తే మంచిది… By Sharath Kumar
Share this Article