హఠాత్తుగా నమస్తే తెలంగాణలో వచ్చిన ఓ వార్తా శీర్షిక గుర్తొచ్చింది… నవ్వొచ్చింది… నిజానికి ఆర్టికల్ పర్లేదు, రాసిందాంట్లో తప్పులేమీ లేవు… కానీ ఒక తెలంగాణ అమ్మాయి బిగ్‌బాస్ హౌజులోకి వెళ్తే… అదేమైనా ఘనకార్యమా..? అసలు ఆ షోపైనే బోలెడన్ని విమర్శలున్నయ్… అలాంటిది ఆ షోకు సెలెక్టయితే ఏదో గొప్పదనం సాధించినట్టు ఓ స్టోరీ రాసేశారు… దానికి పెట్టిన హెడింగ్ ‘ఓట్ ఫర్ పటాస్ రతిక’… (గతంలో తెలంగాణ యువతులు ఎవరూ బిగ్‌బాస్ షోలోకి వెళ్లలేదా..?)
సరే, ఏదో రాసితిరి పో… పాఠకులను, ప్రజలను ఆమెకు వోటేయాలని పిలుపునిస్తున్నట్టు హెడింగ్ పెట్టడమే నవ్వుపుట్టించగా… మూడు వారాలకే ఆమె బయటికి వెళ్లిపోవడం, ప్రేక్షకులు కూడా ఆమెను అడ్డంగా తిరస్కరించడం గమనించాక… ఈమెకా నమస్తే తెలంగాణ ‘‘వోటు వేయాలని’’ రిక్వెస్ట్ హెడింగ్ పెట్టి, నెత్తిన మోసిన వైనం గుర్తొచ్చింది… ఇదుగో ఆ హెడింగ్… ఆ ఇంట్రో… (అవునూ ఓట్ కరెక్టా..? వోట్ కరెక్టా..? ఇంగ్లిషులో vote… మరి తెలుగులో వోటు అని రాయాలి కదా…)
Ads
ఆమె బిగ్‌బాస్ హౌజు నుంచి నిష్క్రమించింది… పోతేపోనీ… మొదట్లో స్ట్రాంగ్ కంటెండర్ గా కనిపించిన ఆమె క్రమేపీ పాపులారిటీ పడిపోయి, చివరకు ఆ యావర్, ఆ శివాజీ, ఆ తేజకన్నా తక్కువ వోట్లు సంపాదించి చివరకు గుడ్ బై చెప్పాల్సి వచ్చింది… పలు సైట్లు పెట్టే వోటింగులో కూడా ఆమె లాస్ట్ ప్లేసులో ఉంది… కాబట్టి సీక్రెట్ రూం డ్రామా, రీఎంట్రీ వంటివి ఏమీ ఉండకపోవచ్చు కూడా… పైగా తన అడ్డదిడ్డం వాదనలతో విసిగిస్తున్నది కూడా…
రాహుల్ సిప్లిగంజ్‌తో ఫోటోలు లీక్ వంటివి హౌజు బయట స్వల్ప వివాదాన్ని రేకెత్తించాయి… సరే, ఇవన్నీ వదిలేస్తే… వీక్ డేస్‌లో ఈ షోను ఎవడూ పెద్దగా దేకడం లేదు… ఆ వీకెండ్స్‌లో నాగార్జున వచ్చి సిల్లీ థింగ్స్ మీద హౌజ్‌మేట్స్‌కు క్లాస్ పీకుతుంటాడు కదా… కొందరు అధికంగా చూస్తూ ఉంటారు… ఈసారి కూడా అంతే… గౌతమ్ అనేవాడు శోభాశెట్టి ఎదురుగా ఏదో అరుస్తూ ‘షేప్స్’ అర్థమొచ్చేలా చేతులతో సైగలు చూపించాడు అనేది ఓ వివాదం… దాని మీద క్లాస్… (షేప్స్ అనకుండా ఫిజికాలిటీ అన్నాడు… అంటే..?)
ఆ సైగల్ని ఆ సందర్భంలో ఆమే పట్టించుకోలేదు… కానీ పల్లవి ప్రశాంత్ అది చూసి ఫీలైపోయాడట… ఛిఛీ ఇలాంటోడు షోలో ఉండటం ఏమిటని గౌతమ్‌ను నామినేట్ చేశాడట… సిల్లీ… అలాగే మరొకటి… శివాజీ మరొకామె మీదమీదకు పోయాడట… నాకు నచ్చలేదు అంటుంది ఆమె… అబ్బే, నాకు ఏ ఉద్దేశామూ లేదు అని అమాయకపు ఫోజు పెడతాడు శివాజీ… దాని మీద నాగార్జున క్లాస్… శివాజీ అలా చేయడంలో తప్పులేదట, కానీ ఆమె వద్దంటున్నా, వారిస్తున్నా, అంత దగ్గరగా వెళ్లకుండా ఉండాల్సిందని, ఆమె మనోభావాల్ని గౌరవించాలని ఏదో శుష్కవాదన చెప్పాడు నాగార్జున… ఆడ, మగ తేడా లేకుండా ఆడండి, మీదపడి దొర్లండి, ప్రతి సిల్లీ ఇష్యూకు హగ్గులు చేసుకొండి అని బిగ్‌బాసే చెబుతాడు… దగ్గరగా వస్తే ఏమైందట…
మొత్తమ్మీద తేజ అనేవాడికి ఏవో పిచ్చి పనిష్మెంట్లు ఇచ్చి క్షమించేశారు… ఏదో టాస్క్‌లో తేజ బిహేవియర్ అస్సలు బాగాలేదు… బయటికి పంపించి ఉండాల్సింది… బిగ్‌బాస్ తనే సిగ్గుపడ్డాడేమో తన ఎంపిక పట్ల…! శివాజీ వేస్ట్ అక్కడ… ఎంటర్‌టెయిన్‌మెంట్ చేతకాదు, టాస్కులు చేతకావు… ఏదో పెత్తనం చేస్తున్నాడు అందరి మీద… నీతులు చెబుతున్నాడు… గతంలో ఓ వీర హేతువాది హౌజులో ఇలాగే ఉండేవాడు… శివాజీకి నాగార్జున అనవసర మద్దతు, వెనకేసుకురావడం కనిపిస్తూనే ఉంది… అవునూ, హౌజ్‌మేట్స్ గా ఖరారైనంత మాత్రాన వాళ్లు జడ్జిలు అయిపోయి, మిగతా ఆటగాళ్లను జడ్జ్ చేస్తారా..? ఇదేం మూర్ఖత్వం బిగ్‌బాస్..? మొత్తానికి షోను మళ్లీ భ్రష్టుపట్టించారు కదరా…!! ‘పుల్టా చేశారు కదరా…’
Share this Article