నిజానికి ఇది చాలా కోణాల్లో ఇంట్రస్టింగు వార్త… ఓ పెద్ద సీనియర్ జర్నలిస్టు, చాలాచాలా కీలకమైన పొజిషన్లలో పనిచేసి… ఓ తప్పుడు ట్వీట్ వదిలినందుకు, నిర్ధారించుకోకుండా జనంలోకి ఓ తప్పుడు వార్తను పంపించినందుకు ఓ అవమానకరమైన శిక్షకు గురికావడం..! విషయం ఏమిటంటే..? (ది వైర్ వెబ్సైట్ ట్వీట్ ప్రకారం)… రాజ్‌దీప్ సర్దేశాయ్ తెలుసు కదా… దేశ ప్రముఖ జర్నలిస్టుల్లో తనూ ఒకడు… కాస్త దూకుడు ఎక్కువ… యాంటీ బీజేపీ జర్నలిస్టు… ఆయన భార్య సాగరిక ఘోష్ అయితే దాదాపు కాంగ్రెస్ అధికార ప్రతినిధే… రాజ్‌దీప్ ప్రస్తుతం ఇండియాటుడేలో సీనియర్ యాంకర్ కమ్ కన్సల్టింగ్ ఎడిటర్… సోషల్ మీడియాలో యాక్టివ్… సరే, ఇక్కడివరకూ బాగానే ఉంది… అప్పుడప్పుడూ సమాచారం పూర్తిగా నిర్ధారించుకోకుండానే ట్వీట్లు వదులుతూ ఉంటాడు, తరువాత దిద్దుకుంటాడు, డిలిట్ చేస్తాడు… మొన్నటి ఢిల్లీ అల్లర్లలో ఒక సిక్కు యువకుడు ట్రాక్టర్ బోల్తాపడి మరణించాడు…
ఈయన రాజదీపుడు ఏం చేశాడంటే..? పోలీసుల కాల్పుల్లో ఓ సిక్కు యువకుడు మరణించినట్టు గబగబా ఓ ట్వీట్ కొట్టాడు… అంత ఆత్రం ఎందుకో అర్థం కాదు… కనీసం తను పనిచేస్తున్న టీవీలో ఒకసారి ఆ సమాచాారాన్ని నిర్దారించుకోవచ్చు కదా… అబ్బే, అదేమీ లేదు… తరువాత నిజం తెలిసి, ఆ ట్వీట్ సరిదిద్దుకున్నాడు… ఈలోపు ప్రొ-బీజేపీ నెటిజన్లు ట్రోలింగుతో ఎక్కీదిగారు… ఇండియాటుడేకు కూడా వాచిపోయింది… రెండు వారాలపాటు తనను సస్పెండ్ చేసింది… అంటే ఆన్-బోర్డ్ కనిపించడన్నమాట… అంతేకాదు, ఓ నెలరోజుల జీతాన్ని కూడా కోసేసింది… జర్నలిస్టు సర్కిళ్లలో ఆశ్చర్యాన్ని కలిగించింది ఈ వార్త…
Ads
India Today has taken senior anchor and consulting editor @sardesairajdeep off the air for two weeks, citing his on-air claim and tweets of Delhi Police shooting and killing a farmer during the January 26 tractor rally.https://t.co/DCcoIWi685
— The Wire (@thewire_in) January 28, 2021
ఇక్కడ ఆశ్చర్యార్థకం ఎందుకంటే..? తను ఆ తప్పుడు వార్తను తను డ్యూటీలో ఉండగా, తను పనిచేస్తున్న మీడియా వ్యవస్థ ద్వారా స్ప్రెడ్ చేయలేదు… ఇక్కడ ఇండియాటుడేలో ఆ తప్పుడు వార్త రాలేదు… తను వ్యక్తిగత హోదాలో ఓ ట్వీట్ చేశాడు, అందులో తప్పు దొర్లింది, అది వాస్తవం… ఓ సోషల్ మీడియా వేదిక మీద తను చేసిన తప్పుకు ఇండియాటుడే శిక్ష వేయడం ఏమిటి అనేది ఓ సాంకేతిక అంశం… తమకు సంబంధించిన జర్నలిస్టులు వృత్తిగతంగా ప్లస్ వ్యక్తిగతంగానూ బాధ్యతగా మెలగాల్సిందే అని కఠినంగా చెప్పదలుచుకున్నదా ఇండియాటుడే… ఒక కోణంలో గుడ్… తన పట్ల ఇంత అవమానకరంగా వ్యవహరించిన ఇండియాటుడేను సదరు జర్నలిస్టు వదిలేశాడు అనేది బీజేపీ సైటు ఓపీ ఇండియా తాజా కథనం… ఆత్మాభిమానం ఉన్న జర్నలిస్టుగా తన స్పందన ఆశ్చర్యకరమేమీ కాదు.. అయితే..?
కొన్నిసార్లు జర్నలిస్టులు తప్పుడు పోస్టులు వాళ్లు పనిచేసే సంస్థల ఇమేజీకి కూడా భంగకరం అవుతుంటాయి కాబట్టి… చాలా పెద్ద మీడియా సంస్థలు తమ జర్నలిస్టుల సోషల్ పోస్టులపై కన్నేసి ఉంచుతాయి, కళ్లేలు వేసి ఉంచుతాయి… మీడియా సంస్థల్లో పనిచేసే వ్యక్తులకు సోషల్ జీవితం వేరు, ప్రైవేటు జీవితం వేరు, వృత్తిపరమైన జీవితం వేరు, సంస్థాపరమైన జీవితం వేరు గట్రా వేర్వేరు జీవితాలు ఉండవనీ… వాళ్ల వ్యవహార ధోరణి, నడవడిక తమ ఇమేజీకి డ్యామేజీగా మారొద్దనీ పెద్ద మీడియా సంస్థలు చెబుతున్నాయి… అంతటి రాజ్దీపుడినే శిక్షించి ఇండియాటుడే మరింత బలంగా చెప్పింది… మీడియా సంస్థలే కాదు, చాలా ప్రైవేటు సంస్థలు కూడా తమ స్టాఫ్ సోషల్ మీడియా జీవితాన్ని వాచ్ చేస్తున్నాయి… బహుపరాక్… భావప్రకటన, ప్రైవేట్ లైఫ్, తొక్కాతోలూ అంటే వినేరకాలు కావు మన ప్రైవేటు సంస్థలు…!! (ఇవన్నీ సరే, లెఫ్ట్‌కు సంబంధించిన పత్రికలు, టీవీలు, సైట్లు సదరు సిక్కు యువకుడు పోలీసు కాల్పుల్లో మరణించాడనే రాశాయి, ఫోటోలు పబ్లిష్ చేశాయి… మరి వాటిని ఏం చేయాలి…))
Share this Article