ఒక ఉత్తర తెలంగాణ ఎమ్మెల్యే… ఒకరోజు 36 చోట్ల శిలాఫలకాలు వేయించాడు… మరుసటిరోజు తన రికార్డును తనే బ్రేక్ చేస్తూ 41 శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశాడు… ఏదేని ప్రభుత్వ భవనం, రోడ్డు, ప్రాజెక్టు, పైప్‌లైన్ ఎట్సెట్రా పనులకు శిలాఫలకాలు వేయడం పరిపాటే… కానీ ఇప్పుడు మరీ దారుణంగా చివరకు లక్ష రూపాయల పనులకు సైతం శిలాఫలకం వేసేస్తున్నారు… ఎందుకు..?
ఎన్నికలొస్తున్నయ్… మస్తు ప్రచారం కావాలి… ఊళ్లలో తిరగాలి… ఆ పని చేశాను, ఈ పని చేశాను, ఇదీ నా ఘనత అని చెప్పుకోవాలి… ఇదీ యావ… దీంతో రాష్ట్రమంతా శిలాఫలకాలకు మస్తు డిమాండ్ ఏర్పడింది… మామూలు రోజుల్లో అయిదారు వేలకు దొరికే ఒక చిన్న ఓ మోస్తరు ఫలకం (అక్షరాలు చెక్కిన బండ) ఇప్పుడు పది వేలు… మరీ అత్యవసరమైతే 12 వేల దాకా… పెద్ద సైజువి అయితే 20 వేలు, 30 వేలు… మరి తప్పదు కదా…
ఐనా అవి చెక్కేవాళ్లు తక్కువ… పెద్దగా డిమాండ్ ఉండేది కాదు… ఇప్పుడిక నాయకుల ప్రచారయావతో వాళ్లకూ ఫుల్లు డిమాండ్ ఏర్పడింది… ఊళ్లల్లో, చిన్న సైజు పట్టణాల్లో గిరాకీ ఎక్కువై ఆర్డర్లు తీసుకోవడం లేదు… దాంతో కంట్రాక్టర్లు, దిగువ శ్రేణి కార్యకర్తలు హైదరాబాద్, ఇతర నగరాలకు అర్జెంటుగా వెళ్లి, అడిగిన ధరలకు బండలు మోసుకొస్తున్నారు… మరి లేకపోతే నాయకుడు ఊరుకోడు కదా…
Ads
(ఫోటో కర్టెసీ :: వెలుగు)
ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల సంఘం టీమ్ తిరుగుతోంది… వాళ్లు ఢిల్లీ వెళ్లాక ఇక రేపోమాపో షెడ్యూల్ వెలువడుతుంది… ఒకసారి షెడ్యూల్ ప్రకటన వచ్చిందంటే ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుంది… సో, దాంతో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఉండవు కదా… పైగా బీఆర్ఎస్‌లో పెద్దగా టికెట్ల చికాకు లేదు కదా, ముందే ప్రకటించేశాడు కదా దొరవారు… ఇక ఊరూరా ఇవే జాతర్లు సాగుతున్నయ్…
కేవలం అభివృద్ధి పనులే కాదు, ప్రార్థన మందిరాలు, కమ్యూనిటీ హాళ్లు… సీఎం స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్స్ నుంచి ఎడాపెడా మంజూరీలు కానిచ్చేస్తున్నారు… ఓ ఫలకం పాతేస్తున్నారు… శుభం…
Share this Article