Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నిజమే… ఈ సినిమా ఓ మ్యాడ్… మరో సెలబ్రిటీ పోరడి వెండితెర ఎంట్రీ…

October 6, 2023 by M S R

మ్యాడ్ అంటే… వెర్రి, పిచ్చి… ఈ మ్యాడ్ పేరుతో ఓ సినిమా వచ్చింది… మస్తు బ్యాక్ గ్రౌండ్ ఉన్న మరో వ్యక్తి హీరోగా తెరప్రవేశం (ఆరంగేట్రం) చేసిన సినిమా ఇది… జూనియర్ ఎన్టీయార్ సొంత బావమరిది నార్నే నితిన్ హీరో… మస్తు డబ్బుంది, పైగా జూనియర్ బావమరిది… ఇదే తన అర్హత… అఫ్‌కోర్స్, మన తెలుగు తెరను ఏలేది ఇలాంటి తారాగణమే… బలమైన ధననేపథ్యం లేదంటే వారసత్వం…

ఎలా చేశాడు..? ఏదో చేశాడంటే చేశాడు… కొత్త కదా… పైగా నటనను ఓ ప్యాషన్‌గా తీసుకుని, తపస్సుగా భావించే బ్యాచ్ కాదు కదా… సినిమా కూడా పాపులారిటీకి మార్గం, సంపాదనకు చాన్స్, క్లిక్కయితే రాజవైభోగం… సో, కొత్తకొత్తగానే కనిపించాడు… మరి అంత డబ్బుగల ఆసామి మామూలుగా కనిపిస్తే ఎలా..?

సినిమా మొత్తం కామెడీతో నడిపించినా సరే… నితిన్ ఎంట్రీ, యాక్షన్ సీన్స్, ఇమేజ్ బిల్డప్పులకు ఢోకా మాత్రం రానివ్వలేదు… సినిమా మొత్తమ్మీద ఈ ధోరణి ఆడ్‌గా కనిపిస్తుంది… మరి దర్శకుడికి తప్పదు కదా… అంతటి నార్నే వారి పుత్రరత్నాన్ని అల్లాటప్పాగా ప్రవేశపెట్టలేడు కదా… ఇక బయట వింటే ఒకటీరెండు పాటలు బాగున్నట్టు అనిపించినా, తీరా తెర మీద అంతగా ‘పండలేదు’… అది సంగీత దర్శకుడు భీమ్స్ తప్పు కాదు, దర్శకుడు కల్యాణ్ శంకర్ ఫెయిల్యూర్…

Ads

మరో అంశమూ ఇక్కడ ప్రస్తావనార్హం… ప్రస్తుతం థియేటర్లకు ప్రేక్షకులు పెద్దగా వెళ్లడం లేదు… ఎంచక్కా ఓటీటీల్లో ఇంట్లోనే కూర్చుని, వీలును బట్టి, వెనక్కి ముందుకూ జరుపుతూ సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు… థియేటర్ల నిలువుదోపిడీకి తల అప్పగించడం లేదు… ఈ స్థితిలో యూత్‌ను టార్గెట్ చేస్తే తప్ప థియేటర్లకు జనం రావడం లేదు… యూత్ టేస్ట్ పేరిట బూతును నింపినా యూత్ పట్టించుకోవడం లేదు… వాళ్ల స్మార్ట్ ఫోన్‌లో దొరకని బూతు ఏముంది..?

సో, కాస్త రొమాన్స్, కాస్త కామెడీ, కాస్త బూతు, కాస్త కాలేజీ లైఫ్ కిచిడీ చేసి సినిమా కొట్టాలి… దాంతో కాలేజీ స్టూడెంట్స్ థియేటర్లకు వస్తారనీ, యూత్ అట్రాక్ట్ అవుతారని ఓ భ్రమ… ఈ మ్యాడ్ సినిమా వెనుక ఆలోచన అదే… మ్యాడ్…! హేపీ డేస్, త్రీఇడియట్స్ హిట్టయ్యాయీ అంటే అందులో కాలేజీ లైఫ్ మాత్రమే కాదు, ఎమోషన్స్ ఉన్నాయి… మరి ‘జాతిరత్నాలు’లో ఏముంది..? ఫన్… అందులో కథాకాకరకాయ, ఎమోషన్స్ మన్నూమశానం ఏమీ ఉండదు… హైపర్ ఆది మార్క్ పంచ్ డైలాగుల్లా మాటలు పేలుతూ ఉంటయ్… సినిమా వేగంగా ఓ జబర్దస్త్ స్కిట్ చూస్తున్నట్టు ఉంటుంది… లైట్ గోయింగ్…

సో, హేపీడేస్ బాపతు కాలేజీ లైఫ్, జాతిరత్నాలు వంటి ఫన్ కంటెంట్… రెండూ కలిపితే ఇక ఢోకా లేదనుకున్నాడు ఈ దర్శకుడు కూడా… మ్యాడ్… అందుకే ఎమోషన్స్, కథలో బలం ఎట్సెట్రా పట్టించుకోలేదు… నార్నే వారి అబ్బాయిని హీరోగా ప్రొజెక్ట్ చేయాలి, నాలుగు ఫన్ సీన్లతో కథ నడిపించేయాలి అని ఫిక్సయ్యాడు… తన టార్గెట్ కంప్లీట్ చేశాడు… అంతే… మొత్తంగా చూస్తే సినిమా నథింగ్… ఏదో ఉబుసుపోక సినిమా… ప్రేక్షకులు ఇలాంటివే ఇష్టపడతారూ అనుకుంటే… దాన్నే మ్యాడ్ అంటాం…

లోతైన కథ, ఆకట్టుకునే కథన ప్రయోగం, ఉద్వేగాలు, జీవితం ఏమీ లేకపోతే… సినిమాకు ఎందుకు పోవడం..? జబర్దస్త్ చూస్తే సరిపోదా ఏం..? బుర్రల్లేని తెలుగు టీవీ సీరియళ్లు చూసినా బోలెడంత వినోదం, మస్తు నవ్వుకోవచ్చు… మన ఘన పొలిటిషియన్స్ స్పీచుల వీడియోలు చూడొచ్చు… అది మరింత వినోదం…

గతంలో బూతు మిక్సయిన కామెడీ స్కిట్స్ ఉండేవి, ఇప్పుడు ఆ జబర్దస్త్ స్కిట్స్ కూడా దారితప్పి చాన్నాళ్లయింది… ఎమోషన్సూ తొక్కాతోలూ అని ఏమీ చూడవు, ఆ కాస్తసేపు నవ్వించామా లేదా… అవును, మ్యాడ్ సినిమా కూడా అంతే… బూతు డైలాగులు… కాస్త కామెడీ కలరింగు… (యూత్ నిజంగా వాటినే ఇష్టపడతారా..? ఇదొక ప్రశ్న…) మిగతా నటులు దాదాపు అందరూ కొత్తవాళ్లే ఐనా తమ పాత్రలకు తగిన ఓ మోస్తరు నటనకు ఢోకా రానివ్వలేదు… చివరగా… ప్రతి ఫన్ బేస్డ్ సినిమా ‘జాతిరత్నాలు’ అనిపించుకోదు మాస్టారూ… (రొటీన్ రొడ్డకొట్టుడు ఫార్ములా రివ్యూలతో పోలిస్తే ఇదీ ఓ మ్యాడ్ రివ్యూ అంటారా..? ఎస్… ప్రీమియర్ల ఫీడ్ బ్యాక్ ఇదే…)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రేవంత్ రెడ్డి ప్రదర్శించిన అరుదైన గౌరవం… రోశయ్యకు ఘన నివాళి…
  • మార్గన్..! ఆ ‘బిచ్చగాడు’ గుడ్డిగా ఓ దర్శకుడిని నమ్మి మునిగిన కథ..!!
  • అవునూ హరీషూ… కొండగట్టు బస్సు ప్రమాద మృతులు గుర్తున్నారా..?!
  • సైన్స్, ఎమోషన్, సంప్రదాయం ఆస్తికత్వం, హేతువాదం… హేట్సాఫ్ టి.కృష్ణ..!!
  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions