బిజినెస్, హైలెవల్ మీడియా, పొలిటికల్ సర్కిళ్లలో ఒక టాక్… రాయిటర్స్ ఓ వార్త రాసింది… అదీ బ్లూంబర్గ్ న్యూస్‌ను బేస్ చేసుకుని… నేపథ్యం ఏమిటంటే..? తనదంటూ ఓ మీడియా కావాలని ఆదానీ ఏకంగా ఎన్డీటీవీని టేకోవర్ చేశాడు కదా… అంబానీకి ఆల్‌రెడీ అనేక చానెళ్లున్న గ్రూపు ఉంది… అయితే డిజిటల్ మీడియాకు సంబంధించి (బ్రాడ్‌బ్యాండ్ దందా) అంబానీ చాలా దూకుడు మీద ఉన్నాడు…
ఆమధ్య ఏకంగా డిస్నీ హాట్ స్టార్ ఇండియా టీవీ, డిజిటల్ మీడియా వ్యాపారాన్ని రిలయెన్స్ కొనుగోలు చేసేందుకు చర్చలు సాగాయి… పలు మీడియా రిలేటెడ్ సైట్లు ఈ వార్తలు పబ్లిష్ చేశాయి… ప్రత్యేకించి క్రికెట్ మ్యాచుల ప్రసారాలకు సంబంధించిన హక్కుల కొనుగోలులో రిలయెన్స్ గ్రూపు దూకుడు అందరినీ నివ్వెరపరిచింది… నిజంగానే ఆ వ్యాపారానికి రాబోయే రోజుల్లో చాలా స్కోప్ ఉంది కూడా… ఏటా వేల కోట్ల టర్నోవర్ ఉన్న వ్యాపారం అది…
అన్నింటికీ మించి తమ వ్యాపారాలపై, వ్యవహారాలపై వచ్చే ఆరోపణలకు, విమర్శలకు కౌంటర్లు ఇవ్వడానికి ఓ బలమైన మీడియా గ్రూపు కావాలి ఆదానీకి… పైగా మంచి కమర్షియల్ రెవిన్యూ స్కోప్ ఉన్న వ్యాపారం… సో, అంబానీకి దీటుగా ఈ కోణంలో పోటీపడటానికి ఆదానీ ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం ఉంది… తాజా వార్త ఏమిటంటే… డిస్నీ హాట్ స్టార్ గ్రూపు (టీవీ ప్రసారాల్లో నంబర్ వన్…) గౌతమ్ ఆదానీతో కూడా చర్చలు ప్రారంభించిందట…
Ads
ఆ గ్రూపు మాత్రమే కాదు, సన్ టీవీ కూడా ఇదే ప్రయత్నాల్లో ఉందనేది ఆ వార్తలోని ఇంట్రస్టింగ్ అంశం… నిజానికి టీవీ రేటింగ్స్‌లో పలుసార్లు సన్ టీవీ చాలా బెటర్ పొజిషన్‌లో ఉంటుంది, బలమైన గ్రూపు, పైగా తమిళనాడులో అధికారంలో ఉన్న స్టాలిన్ కుటుంబీకుల గ్రూపు అది… కానీ ఆ గ్రూపు వ్యవహారాల్ని చూసే కళానిధి మారన్ సన్ టీవీలో మెజారిటీ వాటాలు అమ్మేయడానికి ట్రై చేస్తున్నాడనేది విశేషమే…
ఐతే ఏ సంస్థ కూడా ఏ విషయాన్ని లీక్ కానివ్వడం లేదు… చర్చలు మాత్రమే కదా… వర్కవుట్ కావాలని కూడా ఏమీలేదు… బిజినెస్ సర్కిళ్లలో టాక్ మరొకటి ఆసక్తికరంగా అనిపించింది… నిజం కాకపోవచ్చు, అలాగని ఇట్టే కొట్టిపారేయలేం… రాజకీయాల్లో, మీడియా వ్యాపారాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు… ఈమధ్య ఆదానీ వచ్చి ఏపీ సీఎం జగన్‌ను కలిశాడు కదా… వాళ్ల చర్చలో రామోజీ ఫిలిమ్ సిటీ ప్రస్తావన వచ్చినట్టు ధ్రువపడని టాక్…
ఎందుకు..? జగన్ రామోజీరావును అష్టదిగ్బంధనం చేసి, ఏకంగా ఆదానీతో ఫిలిమ్ సిటీని టేకోవర్ చేయిస్తాడని ఆ టాక్ సారాంశం… కానీ ఈనాడులో గానీ, ఫిలిమ్ సిటీలో గానీ ఆల్‌రెడీ అంబానీ వాటాలున్నయ్… సో, అంబానీని పక్కన పెట్టేసి ఆదానీ దాన్ని తీసుకుంటాడనేది నమ్మబుల్‌గా లేదు… అంబానీ ఎందుకు వదిలేస్తాడు..?
సరే, ఇదెలా ఉన్నా… తన కన్నుపడిన వ్యాపారాలను టేకోవర్ చేయడానికి ఆదానీ తనకు సన్నిహితమైన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రయోగించి మరీ, ఆ ఓనర్ల మెడలపై కత్తులు పెట్టి వ్యవహారాలు నడిపిస్తాడని పేరుంది కదా… అదీ చర్చనీయాంశం… బట్, రామోజీరావు ఇలాంటి చాలా సవాళ్లను అధిగమించినవాడే… అంత తేలికగా ఒత్తిడికి తలొగ్గే కేరక్టర్ కాదు… బట్, డిబేట్ అయితే సాగుతూ ఉంది… రివెంజ్ కాదు, అంతా బిజినెస్సే అని…!!
Share this Article