పండితపుత్ర పరమశుంఠ… దీనికి పూర్తి విరుద్ధమైన వాక్యాలు కూడా బోలెడు… విత్తును బట్టే చెట్టు, తండ్రిని మించిన తనయుడు ఎట్సెట్రా… వారసుల ప్రతిభాపాటవాలను బట్టి ఏదో ఒకటి వర్తింపజేసి, వ్యాఖ్యలు చేస్తారు… ప్రముఖుల వారసులు ఏం చేస్తున్నారనే ఆసక్తి కూడా ప్రజల్లో ఎక్కువ… మరి నారాయణమూర్తి కొడుకు ఏం చేస్తున్నాడు..? అసలు ఎవరాయన..?
నారాయణమూర్తి ప్రజలందరికీ తెలిసిన పేరు, ఇన్ఫోసిస్ ఫౌండర్… ఆయన భార్య సుధామూర్తి కూడా అందరికీ తెలిసిన పేరే… ఇంజనీర్, దానశీలి, వక్త, రచయిత, ధనికురాలు మాత్రమే కాదు… బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్ అత్తగారు… ఆమె బిడ్డ పేరు అక్షత… అదే సుధామూర్తి, నారాయణమూర్తిల కొడుకు పేరు రోహన్ మూర్తి… ఇప్పుడు తన వయస్సు 40 ఏళ్లు… రోహన్ మేనమామ పేరు శ్రీనివాస్ కులకర్ణి… తను కాలిఫోర్నియా టెక్నలాజికల్ యూనివర్శిటీలో ఆస్ట్రో ఫిజిక్స్, ప్లానిటరీ సైన్స్‌లో ప్రొఫెసర్… ఎంతటి హైప్రొఫైల్ ఫ్యామిలీ…!!
తన పీహెచ్‌డీకి మైక్రోసాఫ్ట్ సాయం చేయడం విశేషం… కర్నాటకలోని హుబ్బలిలో పుట్టిన రోహన్ అమెరికాలోని కార్నెల్ యూనివర్శిటీలో కంప్యూటర్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసి, తరువాత హార్వర్డ్ యూనివర్శిటీలో పీహెచ్‌డీ చేశాడు… ఇది తన ప్రొఫైల్… సొరొకో అనే స్టార్టప్‌ను సొంతంగా స్టార్ట్ చేశాడు… ప్రస్తుతం ఆ కంపెనీ పేరిట దాదాపు 40 పేటెంట్లు ఉన్నాయి…
Ads
నిజానికి రోహన్ తమ ఇన్ఫోసిస్‌లో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా చేరాడు… తరువాత కొన్ని సంస్థాగత వ్యవహారాలతో విసిగి బయటికి వచ్చేశాడు… తన ఆస్తుల నిజవిలువ తనకే తెలియదు… ఇన్ఫోసిస్‌లో వ్యక్తిగతంగా ఎక్కువ షేర్లున్నవాడు… హార్వర్డ్ సొసైటీ ఆఫ్ ఫెలోస్‌లో జూనియర్ ఫెలో… తను సొంతంగా మూర్తి క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా అనే సంస్థను స్థాపించాడు… తన డిజిటల్ ట్రాాన్స్‌ఫార్మేషన్ కంపెనీ సొరొకో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ మీద వర్క్ చేస్తుంటుంది…
అసలు చెప్పుకోవాల్సింది ఏమిటంటే… ఇంత మంది ప్రముఖుల కుటుంబసభ్యుడు కదా… సేమ్ రేంజ్ ప్రొఫైల్ కలిగిన లక్ష్మివేణును పెళ్లి చేసుకున్నాడు… ఆమె ఎవరంటే..? టీవీఎస్ గ్రూపు తెలుసు కదా… దానికి యువరాణి… తండ్రి వేణు శ్రీనివాసన్ టీవీఎస్ గ్రూపు ఛైర్మన్… తల్లి మల్లికా శ్రీనివాసన్ అదే గ్రూపుకు చెందిన TAFE సీఈవో… ఈ రెండు ప్రముఖ కుటుంబాల వియ్యం కదా… అట్టహాసంగా పెళ్లి జరిగింది… 2011లో పెళ్లి జరిగితే జస్ట్, రెండేళ్లలోనే, అంటే 2013లో విడిపోయారు… 2015లో విడాకులు కూడా మంజూరయ్యాయి…
తరువాత మహేశ్ గోగినేనిని పెళ్లి చేసుకుంది… తను ఎవరంటే… మనందరికీ బాగా తెలిసిన ఎన్జీరంగాకు సొంత మనమడు… మరి రోహన్ అంటారా..? ఇండియన్ నేవీ మాజీ ఆఫీసర్ కేఆర్ కృష్ణన్ కూతురు అపర్ణా కృష్ణన్‌ను పెళ్లి చేసుకున్నాడు… అపర్ణ తల్లి సావిత్రి స్టేట్ బ్యాంకులో ఉన్నతాధికారిణిగా చేసి రిటైరైంది… ఎంత హైప్రొఫైల్ సంబంధాలు అయితేనేం… నాలుగు రోజులు నిలబడాలని ఏముంది..? ఆ కుటుంబాల్లో కాస్త ఇగో, యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ కదా…!!
Share this Article