దేశ రాజకీయాలను శాసిస్తున్న అమిత్ షా స్వయంగా జూనియర్ ఎన్టీయార్ దగ్గరకు వచ్చాడు, తనున్న హోటల్‌కు పిలిపించుకుని కలిశాడు… అసలే చంద్రబాబు మీద మంట మీదున్న జూనియర్ ఏం చెప్పాడు, అమిత్ షా ఏం ఆఫర్ ఇచ్చాడు అనేది పక్కన పెడితే… సీన్ కట్ చేయండి…
స్వయంగా లోకేష్ రకరకాల పైరవీలు చేసి, చివరకు పురంధేశ్వరి పైరవీ చేస్తే అమిత్ షా అపాయింట్‌మెంట్ ఇచ్చాడు… కలిశాడు… ఏదో లోకేష్ చెప్పింది విన్నాడు… తనకన్నీ తెలుసు… మోడీ మీద మిగతా విపక్ష నేతలకన్నా నీచమైన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు యూటర్నర్ మెంటాలిటీ గురించి తెలుసు… రాత్రి మద్దతు పలికితే తెల్లవారి తెగతెంపులు చేసుకునే అవకాశవాదమూ తెలుసు… ఇప్పుడు ‘‘అన్యథా శరణం నాస్తి’’ అంటూ లోకేష్ కాళ్లబేరానికి వచ్చిన కారణమూ తెలుసు…
మోడీని గుజరాత్ ముఖ్యమంత్రిగా తొలగించాల్సిందే, లేకపోతే హైదరాబాద్ వస్తే నేనే జైలులో వేయిస్తా అని బీరాలు పలికిన చంద్రబాబు తరువాత తనతోనే పొత్తు పెట్టుకోవడం, తరువాత పొత్తు కత్తిరించుకుని తీవ్ర స్థాయిలో (చివరకు మోడీని భార్య ప్రస్తావన తెచ్చి మరీ…) విమర్శలు చేసిన తీరు కూడా అమిత్ షాకు, మోడీకి అన్నీ గుర్తున్నయ్… అమిత్ షా కారు మీద రాళ్లేసిందీ గుర్తుంది… ఎవరూ ఏదీ మరిచిపోరు… ఇప్పుడు చంద్రబాబును కాపాడినా సరే, తెల్లవారే తోక జాడించడని నమ్మకమూ లేదు…
Ads
వోకే, అధికారికంగా చూస్తే… కోర్టు కేసుల్లో దేశ హోంమంత్రి అధికారికంగా చేయడానికి ఏముంటుంది..? జగన్ పకడ్బందీగా ప్లాన్లు వేశాడు… ఒకదాని వెంట మరో కేసు… ఏ కోర్టులైతే తన బలం అనుకున్నాడో చంద్రబాబు, అదే కోర్టుల్లో అష్ట దిగ్బంధనం చేస్తున్నాడు… వరుస కేసులు… ఏం పీక్కుంటావ్ జగన్ అని గొంతెత్తాడు కదా చంద్రబాబు, ఇప్పుడు తనే పీక్కోలేక సతమతం… దాన్నే డెస్టినీ అంటారు చంద్రబాబూ… అన్ని వ్యవస్థల్నీ అన్నివేళలా మేనేజ్ చేయలేం బాబాయ్… కానీ ఈ దశకు వచ్చాక అమిత్ షా చేయగలిగేది ఏముంది..? తను కోర్టుల్ని ఆదేశించలేడు కదా…
నిజానికి జగన్ మనస్తత్వం చంద్రబాబుకు బాగా తెలుసు… కానీ ఫ్లోలో ఏం పీక్కుంటావో పీక్కో అన్నాడు జగన్‌ను… (సేమ్, అప్పట్లో మోడీని అన్నట్టుగా…) కార్యకర్తల చప్పట్లు, జగన్ ప్రభుత్వ వరుస దాడులు, కేసులతో దిగజారుతున్న వాళ్ల మనోధైర్యం పుష్ చేయడానికి అలా మాట్లాడి ఉంటాడు… కానీ అక్కడ ఉన్నది జగన్ అని మరిచిపోయాడు… అదసలే నెలల తరబడీ జైలు గదిలో ముదిరిపోయిన కేరక్టర్… తీరా ఎన్నికల ముందు కేసుల కొరడా పట్టుకున్నాడు… అటు రామోజీరావు, ఇటు చంద్రబాబు… లబోదిబో…
మళ్లీ గెలుస్తాడా..? మోడీ ఎదుట ఇలాగే ఎల్లప్పుడూ సాగిలబడి ఉంటాడా..? అది కాలం తేలుస్తుంది… కానీ ఇప్పుడైతే బాబుకు గడ్డుకాలమే… నిజానికి ఇది ఊహించే చాన్నాళ్లుగా మోడీ ప్రసన్నం కోసం వెంపర్లాడాడు… మోడీ లైట్ తీసుకున్నాడు… చంద్రబాబు కోసం డబుల్ గేమ్స్ ఆడిన వెంకయ్యనే తీసి పక్కన పెట్టాడు… ఇక చంద్రబాబు ఎంత..? ఇప్పుడిక లోకేష్ వెళ్లి కాళ్లావేళ్లా… తప్పదు… ఢిల్లీ పాదుషాలు ఆడింది ఆట…
సరే, బయట ఏం చెప్పుకుంటున్నారనేది పక్కన పెడితే… లోకేష్ ద్వారా అమిత్ షా చంద్రబాబుకు స్పష్టమైన సందేశాన్నే పంపించి ఉంటాడు… సాక్షులుగా ఏపీ, తెలంగాణ పార్టీ అధ్యక్షులను పక్కన పెట్టుకున్నాడు… పైగా తమ పార్టీ అధ్యక్షురాలికి చంద్రబాబు స్వయానా బావ… (ఆమె భర్త, కొడుకు ఏ పార్టీ అనేది కాసేపు పక్కన పెట్టేయండి…) సొంతంగా పార్టీ నడిపిస్తావా..? బీజేపీలో విలీనం చేసి బతికిపోతావా..? క్లియర్ కట్ మెసేజ్…
ఒకవేళ నిజంగానే తెలంగాణ, ఏపీల్లో ప్రస్తుతానికి తాత్కాలికంగా టీడీపీతో పొత్తు సంకేతాలే బీజేపీ పంపిస్తున్నదీ అనుకుందాం… తెలంగాణలో టీడీపీ వోట్లతో బీజేపీకి ఒరిగేది ఏమీ లేదు… ఏపీలో అసలు ఏమీలేదు… కానీ బీజేపీ హైకమాండ్ ఏపీ, తెలంగాణల్లో ఏదో మాస్టర్ ప్లాన్ ఆచరణలో పెట్టింది… బీజేపీలో టీడీపీ విలీనం వంటి అల్టిమేట్ వ్యూహం బయటికి ఏమీ అర్థం కాదు… బీఆర్ఎస్ బీటీం, మజ్లిస్ సీటీం… జనసేన తోక టీం… అల్టిమేట్ టార్గెట్ ఏదో ఉంది…
ఆ దిశలో చంద్రబాబు కేరక్టర్ నథింగ్… ఇలా లోకేషులు వెళ్లి బాబ్బాబు అంటూ కాళ్లావేళ్లా పడాల్సిందే… అఫ్‌కోర్స్, వాళ్లకు చంద్రబాబు ఏమిటో తెలుసు, కేసీయార్ ఏమిటో తెలుసు… ఎవరినీ నమ్మరు, జాన్తానై… కానీ ఓ దశ వచ్చాక జగన్ అమిత్ షా చెప్పినా వింటాడా అనేది అసలు ప్రశ్న… అసలే మంటమీదున్నాడు కదా… ఆ కులం మీద… ఆ పార్టీ మీద… పైగా అసలు గేమ్ స్టార్ట్ చేశాడు… కులచదరంగం…!!
Share this Article