ఇంతకుముందు మనం అబార్షన్లకు పిండం వయస్సు మీద సుప్రీంలో జరుగుతున్న విచారణ గురించి చెప్పుకున్నాం కదా… అదొక ఇంట్రస్టింగ్ కేసు అయితే సుప్రీంలోనే మరో కేసు ఇంట్రస్టింగ్‌గా సాగింది ఈమధ్య… ఇదేమో విడాకులకు సంబంధించి… సుప్రీం మహిళ కోరికకు మద్దతు పలికింది… కేసు వివరాల్లోకి వెళ్తే…
అప్పుడెప్పుడో 1963లో పెళ్లి జరిగింది వాళ్లిద్దరికీ… అంటే అరవై ఏళ్ల దాంపత్యం… వాళ్లకు ముగ్గురు పిల్లలు… ఆయన భారత సైన్యంలో పనిచేస్తున్నప్పుడు మద్రాస్‌కు పంపించారు… అక్కడే ఉండాలి… కానీ ఆమెకు ఇష్టం లేదు… అక్కడ వాళ్ల నడుమ బేధాభిప్రాయాలు స్టార్టయ్యాయి…
అలాగని విడిచిపెట్టి పోలేదు… కొంతకాలం భర్త తల్లిదండ్రులతో, అంటే అత్తామామలతో కలిసి ఉంది… తరువాత కొడుకు దగ్గర ఉంది… ఇప్పుడాయనకు 89 ఏళ్లు… ఇన్నాళ్లకు భార్యకు విడాకులు ఇవ్వాలని సంకల్పించాడు… జిల్లా కోర్టులో పిటిషన్ వేశాడు… ఆ కోర్టు కూడా సరేనంది… కానీ హైకోర్టు (పంజాబ్- హర్యానా హైకోర్టు) జిల్లా కోర్టు తీర్పును కొట్టిపారేసింది… ఆ ముసలాయన ఈసారి ఏకంగా సుప్రీంకోర్టుకు వచ్చాడు… ‘మా బంధం ఇక ఏమాత్రం పునరుద్ధరణకు ఆస్కారం లేకుండా దెబ్బతిన్నది, సో, విడాకులు ఇప్పించండి అని అభ్యర్థించాడు… ఇదీ కేసు నేపథ్యం…
Ads
ఆమెకు ఇప్పుడు 82 ఏళ్లు… ఆమె వాదన ఏమిటంటే..? ఈ వయస్సులో నేను విడాకులు తీసుకుని ఒంటరి మహిళను కావాలా..? నో, నాకు ఓ డైవొర్సీగా మరణించడం ఇష్టం లేదు… నా భర్త బాగోగులు చూసుకొమ్మంటారా, వోకే… నాకు అతన్ని విడిచిపెట్టే ఉద్దేశం లేదు, విడిపోయిన మహిళగా ఉండలేను, అందుకని నేను విడాకులు ఇచ్చేదే లేదు…’
సుప్రీంకోర్టు ఆమె వాదన పట్ల మొగ్గు చూపింది… విడాకుల కేసులు పెరుగుతున్నా సరే, మన దేశంలో ఇప్పటికీ పెళ్లిని పవిత్రంగా పరిగణిస్తారు, విడాకుల విషయంలో మహిళల అభిప్రాయాలు వేరు… వాటిని గౌరవించాల్సి ఉంది… 82 ఏళ్ల ఓ వృద్ధురాలు నాకు విడాకులు అక్కర్లేదని చెప్పినప్పుడు దాన్ని సానుభూతితో పరిశీలించాల్సి ఉంటుంది… ఏమాత్రం చక్కబడే అవకాశం లేనంతా బంధం దెబ్బతిన్నందున విడాకులు ఇవ్వాలనే వాదనను తిరస్కరిస్తున్నాం… అందుకని సదరు భర్త అభ్యర్థనను తోసిపుచ్చుతున్నాం అని తీర్పు చెప్పింది…
‘వివాహం అనేది ఇప్పటికీ భారతీయ సమాజంలో భార్యాభర్తల మధ్య పవిత్రమైన, ఆధ్యాత్మిక, అమూల్యమైన భావోద్వేగ జీవిత వలయంగా పరిగణించబడుతుంది” అని కోర్టు తన 24 పేజీల తీర్పులో పేర్కొంది…
‘ఆర్టికల్ 142 ప్రకారం విడాకులు ఇవ్వడం ఈ కేసులో సరికాదు… కోలుకోలేని బంధం పేరిట స్ట్రెయిట్ అవే విడాకులు ఇవ్వలేం… ప్రతి విడాకుల కేసునూ ఒకే సూత్రం, ఒకే కోణంలో పరిశీలించలేం… అది న్యాయం కూడా కాదు… ఇక్కడ సదరు వృద్ధురాలి కోరిక సమంజసంగానే అనిపిస్తోంది… అందుకని ఆ వృద్ధుడికి విడాకులు మంజూరు చేయలేం…’ అని కోర్టు స్పష్టంగా పేర్కొంది… ఇంట్రస్టింగ్…
Share this Article