ప్లీజ్ సమయం ఇవ్వండి!
అమెరికన్ స్టేట్ సెక్రటరీ ఆంటోనీ బ్లింకెన్!
మొన్న సాయంత్రం రియాద్ కి చేరుకున్న ఆంటోనీ బ్లింకెన్
Ads
సౌదీ ప్రిన్స్ తో సమావేశమవ్వడానికి!
సాయంత్రం 6 గంటలకి సౌదీ ప్రిన్స్ తో అపాయింట్మెంట్ ఉంది.
ఒకవైపు బ్లింకెన్ సౌదీ ప్రిన్స్ నుండి పిలుపు వస్తుందని ఎదురు చూడడం, ఇదిగో అదిగో అంటూ కాలయాపన జరగడం, రాత్రి అయిపోవడం, ఆ రోజు ఇక ప్రిన్స్ ఎవరినీ కలవరు అని బ్లింకెన్ కి చెప్పడం జరిగిపోయింది!
మరుసటి రోజు అంటే నిన్న ఉదయం 9 గంటలకి సమావేశమయ్యారు ఇద్దరూ!
బ్లింకెన్ సౌదీ పర్యటన ఉద్దేశం క్రూడ్ ఉత్పత్తి పెంచమని అడగడానికే!
సౌదీ రోజుకి 2 మిలియన్ బారేళ్ల క్రూడ్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. ఇది మునపటి కంటే తక్కువ.
దీని వల్ల క్రూడ్ ధరలు పెరగడమే కాదు ఇంధన సరఫరాలో ఇబ్బందులు ఎదరువుతాయి. ముఖ్యంగా అమెరికా, యూరోపు మీద మరీ ఎక్కువగా ఉంటుంది!
******************
వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం …
సౌదీ ప్రిన్స్: మీ విధానాలు మార్చుకోండి. గాజా ముట్టడిని వెంటనే ఆపేయండి.
బ్లింకెన్: నేను ఒక యూదు జాతీయుడుగా ఇక్కడికి వచ్చాను. US సెక్రటరీ ఆఫ్ స్టేట్ గా కాదు.
సౌదీ ప్రిన్స్: సంతోషం! మాతో పాటు ఖతార్ కనుక EU కి గాస్ సప్లయ్ ఆపేస్తే అది ఆర్ధిక సంక్షోభానికి దారి తీస్తుంది!
బ్లింకెన్: ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహూ అమెరికాని లెక్క చేసే స్థితిలో లేడు. హమాస్ వద్ద బందీలుగా ఉన్న అమెరికన్ పౌరులని రక్షించుకోవాల్సిన బాధ్యత మామీద ఉంది.
*********************
పై సంభాషణ ని చూస్తే సౌదీ ప్రిన్స్ ఇజ్రాయెల్ కి హెచ్చరిక చేయకుండా అమెరికాని హెచ్చరించాడు! జో బిడెన్ కి, అతని యంత్రాoగానికి హెచ్చరిక అది! డెమోక్రాట్లు ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాల్సిన స్థితి ఇది! వచ్చే ఎన్నికలలో అమెరికన్ ఓటర్లు మళ్లీ డెమోక్రాట్లకి ఓటు వేస్తే అది అమెరికా పతనానికి ఓటు వేసినట్లే!
*********************
మరోవైపు సౌదీ OIC (ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్) సమావేశానికి పిలుపునిచ్చింది. ఈ సమావేశంలో యూరోపు దేశాలకి గ్యాస్ సరఫరా నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంటే మాత్రం అది మరోసారి ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక మాంద్యానికి దారి తీస్తుంది. భారత్ మీద చాలా తక్కువగా ఉంటుంది! గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇజ్రాయెల్ మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. నేరుగా అమెరికా, యూరోపు దేశాల మీద చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది సౌదీ!
*****************
సౌదీ ప్రిన్స్ అసంతృప్తికి వేరే కారణం ఉంది. ఇరాన్ కి చెందిన 6 బిలియన్ డాలర్లని గతంలో ఫ్రీజ్ చేసింది అమెరికా. వాటిని ఇటీవలే విడుదల చేసింది. కానీ ఇరాన్ ఆ డాలర్లని ఇంతవరకు వాడుకోలేదు. ఇరాన్ తన ఆయిల్ అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బుతోనే హమాస్ కి సహాయం చేసింది.
గుడ్ విల్ గెశ్చర్ కింద ఇరాన్ డాలర్లని విడుదల చేసినా అది మంచి ఫలితాలని ఇవ్వలేదు. సౌదీ కోపానికి ఇదే కారణం అయి ఉంటుంది!
******************
యుద్ధం అంటూ చేయాల్సి వస్తే క్రూడ్ ఆయిల్ అవసరం ఎక్కువగా ఉంటుంది. సౌదీ తన క్రూడ్ ఉత్పత్తిని తగ్గించి ధరలు పెరిగేలా చేసింది.
ఇరాన్ మీద దాడి చేయాలి అంటే అమెరికాకి తగినంత క్రూడ్ కావాలి. ఇప్పుడు అమెరికాకి ఉన్న ఒకే అవకాశం వెనిజులా! వెనిజులా మీద ఉన్న ఆంక్షలని పూర్తిగా ఎత్తివేసి ముందు అమెరికా, యూరోపుకి ఆయిల్ సరఫరా చేయాలి అని షరతు విధించి ఒప్పందం చేసుకుంటుంది. ఇది పరోక్షంగా ఓపెక్ దేశాల మీద ప్రభావం చూపిస్తుంది. వెనిజులా దగ్గర ఆయిల్ నిక్షేపాలు 30 ఏళ్ళకి సరిపడా ఉన్నాయి.
**********************
ఎవరి ఆటలు వాళ్ళు ఆడుకుంటున్నారు! గాజా ముట్టడి ఆపేస్తే బందీలని విడుదల చేస్తాను అని హమాస్ ప్రకటించింది! ఇది మరో ట్విస్ట్ కాదు! 10 వేల మంది హేజ్బొల్లా తీవ్రవాదులు ఇజ్రాయెల్ మీద దాడికి సిద్ధంగా ఉన్నారు అని ఇరాన్ ప్రకటించింది! So! ఉక్రేయిన్ విషయంలో అమెరికా దూరంగా ఉంటే ఇజ్రాయెల్ ప్రశాంతంగా ఉంటుంది అనే సంకేతంగా అనుకోవాలి. కానీ ఇజ్రాయెల్ ని కెలికి తప్పు చేశాయి ఇరాన్, రష్యాలు. ఎవరు ఎన్ని చెప్పినా ఇజ్రాయెల్ లెక్కచేయదు.
****************
ఇజ్రాయెల్ రక్షణ మంత్రి మాత్రం మేము యుద్ధ నియమాలు పాటించము అని ప్రకటించాడు. కానీ…. ఎవరి మధ్యవర్తిత్వం అంగీకరించేది లేదు అని ఖరాఖండిగా చెప్తూనే భారత ప్రధాని మోదీ కనుక చొరవ తీసుకుంటే హమాస్ తో చర్చలకు సిద్ధం అన్నాడు! జెలెన్స్కీ మోదీ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నాడు, ఇప్పుడు హమాస్ తరుపున ఇరాన్ అడుగుతుందో లేదో వేచి చూడాలి!……. పార్ధసారధి పోట్లూరి
Share this Article