నిమ్మగడ్డతో సాగిస్తున్న పోరాటంలో ఒకేసారి చేతులెత్తేయలేక… ఓటమిని అంగీకరించలేక… ఇక పూర్తిగా యుద్ధాన్ని నిమ్మగడ్డకు వదిలేయలేక… జగన్ ప్రభుత్వం, పార్టీ ఓ స్ట్రాటజిక్ గేమ్ స్టార్ట్ చేసింది… అది బహుముఖం… చిన్న చిన్న విషయాలపై నిమ్మగడ్డ చూపించే ఆధిపత్య భావనల్ని సీరియస్‌గా పట్టించుకోవద్దు… అందుకే ద్వివేదీని, గిరిజాశంకర్‌లను మార్చమంటావా..? వోకే… మార్చేస్తాం… ఎన్నికలయ్యాక అవే సీట్లలో కూర్చోబెడతాం, పర్లేదు… అభిశంసిస్తావా..? అడ్డుకుంటాం… నీకు ఆ అధికారమెక్కడిదీ అనడుగుతాం… కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం, బదనాం చేస్తాం… మా ఐఏఎస్‌లకు అండగా నిలుస్తాం… రెండు జిల్లాల కలెక్టర్లు, ఓ ఎస్సీని బదిలీ చేయమంటావా…? వోకే… చేసేస్తాం… పెద్ద ఫరక్ పడదు… నీ ఎన్నికల సంఘానికి కొత్త కార్యదర్శి కావాలా..? వోకే, తీసుకో, ఇచ్చేస్తాం…… ఇది ఒక పార్శ్వం…
ఈ బదిలీలతో భయం ఉండదని భావించిన నిమ్మగడ్డ చాకచక్యంగా ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులపై అభిశంసన అస్త్రం ప్రయోగించాడు… చాలా తెలివిగా ఆలోచించి వదిలిన బాణం అది… ఈ దెబ్బకు మిగతావాళ్లంతా చెప్పుచేతల్లోకి వస్తారనేది తన భావన… ఇంకా కెలుకుతూనే ఉంటాడు… మనం ముందే ‘ముచ్చట’లో చెప్పుకున్నాం కదా… ఔర్ బహుత్ సినిమా బాకీ హై సర్కార్… ఆ దిశలోనే ప్రవీణ్ ప్రకాష్‌ను కెలికాడు… తను దాదాపు యాక్టింగ్ చీఫ్ సెక్రెటరీ… అందుకని నేరుగా తనపైనే పడింది బాణం… ఎన్నికల విధుల నుంచి తప్పించండి అని ఆదేశం… ప్రవీణ్ సీఎస్‌కు ఓ పెద్ద వివరణ లేఖ రాసి, నిర్ణయం మీ ఇష్టం అన్నాడు… జగన్ సర్కారు వచ్చాక తొలిసారిగా ప్రవీణ్ ప్రకాష్ సీఎస్‌ను గౌరవిస్తున్న దృశ్యం… ఆదిత్యనాథ్ కూడా బహుశా నిమ్మగడ్డకు లోలోపల థాంక్స్ చెప్పుకోవాలేమో…
Ads
అప్పుడే అయిపోలేదు… అసలు సినిమా ఇప్పుడే మొదలైంది… ఈ పంచాయతీ ఎన్నికలు.., పెండింగులో ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు… బహుశా ఇవయిపోయేలోపు మున్సిపల్ ఎన్నికలకూ సై అంటాడేమో… తనను తొలగించి, తనను పనిచేయనివ్వని 3 నెలల పదవీకాలం అదనంగా ఇవ్వాలని అడుగుతాడేమో… సరే, అవేం జరుగుతాయో వేచి చూద్దాం… కానీ ఇప్పుడు నిమ్మగడ్డ యుద్ధం ఫుల్ స్వింగులోకి వచ్చేసింది… అవేవో ధ్రువీకరణలపై జగన్ బొమ్మలు ఎందుకు అనడిగాడుట… ఎవరిని అడిగి పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చారు అని సమాచార కమిషనర్‌కు తలంటాడు… అసలు ఈ ఏకగ్రీవాల మీద నిఘా పెడతాం అంటున్నాడు… అంతేకాదు, ఏకగ్రీవాలతో అభివృద్ధి అనేది తాను నమ్మబోమనీ నిన్న ఓ మీడియా మీట్లో అన్నాడు… ఇది తన అధికార పరిధిని దాటడమే… ఏకగ్రీవాల మీద తన వ్యక్తిగత అభిప్రాయం అనవసరం… ఒకవైపు పంచాయతీ ఎన్నికల్ని అధికారికంగా తనే నిర్వహిస్తూ, ఏకగ్రీవాలపై వ్యతిరేకంగా వ్యక్తిగత అభిప్రాయం వ్యక్తీకరించడం అసందర్భం, అప్రస్తుతం…
ఓహో, ఈయన పని ఇలా ఉందా..? ఇలా కాదు, తిట్టేద్దాం… కడిగేద్దాం… అందరూ కాదు, సెలెక్టెడ్‌గా కొందరే ఆ పనిచేయాలి… ఏం చేస్తాడో చూద్దాం… ఒక ప్రవీణ్ ప్రకాష్‌పై చర్య అంటాడు… జీతం తీసుకుంటున్నాడు కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి మీద చర్య తీసుకోవాలని ఆదేశించగలడు… కానీ వరుసబెట్టి, కావాలని ఎడాపెడా వ్యాఖ్యలు, విమర్శలు చేస్తున్న మంత్రులను, ఎంపీలను ఏం చేయగలడు..? ఇదీ వైసీపీ ఆలోచన… అందుకే పెద్దిరెడ్డి, బొత్స రంగంలోకి దిగారు… సాయిరెడ్డి సహజంగానే దిగుతాడు కదా… ఒక ఎంపీ మీద నిమ్మగడ్డ ఎవరికి ఫిర్యాదు చేయాలి..? మంత్రులపై ఎవరికి మొరపెట్టుకోవాలి..? గవర్నర్‌కు ఫిర్యాదు చేశాడు… గవర్నర్ ఏం చేస్తాడు పాపం… ఏయ్, ఆయన్ని తిట్టేయడం తక్షణం ఆపేయండి, లేకపోతే మిమ్మల్ని పీకేస్తాను అనలేడుగా… ఇక ఎంపీల జోలికి అసలే పోలేడు తను… వరుసబెట్టి వైసీపీ ఎంపీలంతా నిమ్మగడ్డపై తిట్లపర్వానికి పూనుకుంటే… పార్టీ కోపం తీరినట్టు అవుతుంది, నిమ్మగడ్డకు కౌంటర్లు ఇచ్చినట్టూ అవుతుంది, తనను కావాలని చులకన చేయడం, నిన్ను మేం గుర్తించడం లేదుపో అని పరోక్షంగా చెప్పడం, వార్ కొనసాగించడం… ఇన్నిరకాలన్నమాట… నన్ను తిడుతున్నారు మహాప్రభో అని కోర్టులకు వెళ్తాడా..? వెళ్లనీ… వ్యక్తిని దూషించిన కేసులు అవి… ఒకవేళ కోర్టు కేసులు పెట్టమని ఆదేశిస్తుందా..? వోకే, మళ్లీ వాదనలు, మళ్లీ విచారణలు… నిమ్మగడ్డను డిస్టర్బ్ చేయాలనే సంకల్పం అదే కదా… నన్ను ఒక్కడిని చేసి, అరిగోస పెడుతున్నారు కదా, చెబుతా, ఎక్కడ దొరికితే అక్కడ బుక్ చేస్తా అన్నట్టుగా నిమ్మగడ్డ కూడా రెడీగా ఉన్నాడు… వెరసి… సినిమా ఫస్ట్ రీల్ దాటింది ఇప్పుడే… కథ మొదలైంది… తెలుగు తెరపై చూస్తూనే ఉండండి…! అవునూ, సాయిరెడ్డిపై రాజ్యసభ ఛైర్మన్‌కు, లోకసభ ఎంపీలయితే లోకసభ స్పీకర్‌కు ఫిర్యాదు చేసే అవకాశం ఏమైనా ఉందా..? వాళ్లు ఇలాంటి విషయాల్లో ఇన్వాల్వ్ అవుతాడా..? తమ అధికార పరిధి ఏమిటి ఇలాంటి అంశాల్లో…? ఎంపీల నైతికవర్తన పరిధిలోకి వస్తుందా ఇది..? నిమ్మగడ్డ గనుక రాజ్యసభ ఛైర్మన్‌కు ఫిర్యాదు చేస్తే కథలో మరో ట్విస్ట్ అన్నమాట..!!
Share this Article