ఒక వార్త… నిజానికి పత్రికల్లో, టీవీల్లో దీనికి పెద్ద ఇంపార్టెన్స్ ఎందుకు లభించలేదో తెలియదు గానీ… ప్రామినెంటుగా రావల్సిన వార్తే…. న్యాయవ్యవస్థను విమర్శిస్తూ రచిత్ తనేజా చేసిన ట్వీట్లపై కేసు… కోర్టు ధిక్కరణ కేసు నమోదైంది ఈమెపై… అలాంటి ట్వీటే చేసినందుకు కునాల్ కమ్రా అనే హాస్యనటుడిపైనా సేమ్ కేసు నమోదైంది… వీటిపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఓ వ్యాఖ్య చేసింది… ‘న్యాయస్థానాల్ని విమర్శించడం పెరుగుతోంది, అందరూ అదే పనిచేస్తున్నారు’ ఇదీ ఆ వ్యాఖ్య… ఓహ్, గమనించారన్నమాట…! ఇక్కడ న్యాయస్థానాల తీర్పులు నచ్చనిపక్షంలో విమర్శించకూడదా అనేది ఓ ప్రధాన ప్రశ్న… తీర్పులపై అభిప్రాయం చెబితే తప్పేమిటనే ప్రశ్న తలెత్తుతున్నాయి… న్యాయమూర్తులకు ఎలాంటి ఉద్దేశాలు ఆపాదించకుండా తీర్పుల మంచీచెడు ప్రస్తావిస్తే అది తప్పు కాదనీ, కోర్టు ధిక్కరణ కాదనీ గతంలో కూడా ఇదే సుప్రీం చెప్పినట్టు గుర్తు… సరే, దాన్నలా వదిలేస్తే…
కోర్టులను ఏ కేసులతోనూ సంబంధం లేని వ్యక్తులు లేదా జనసామాన్యం విమర్శించొచ్చా..? కొన్ని తీర్పుల ప్రభావం సమాజంపై నెగెటివ్‌గా పడే ప్రమాదం ఉన్నప్పుడు… చట్టాల స్పూర్తినే దెబ్బతీస్తున్నప్పుడు… సమాజం పట్ల కన్సర్న్ ఉన్న వ్యక్తులు వాటిని విమర్శిస్తే దాన్ని కోర్టులు కూడా నెగెటివ్‌గా ఎందుకు తీసుకోవాలి…? ఉదాహరణకు… ఇటీవల బాంబే హైకోర్టు, నాగపూర్ బెంచ్ జడ్జి పుష్ప వివాదాస్పద తీర్పులు వెలువరించింది… స్కిన్‌టుస్కిన్ కేసు… దైహిక స్పర్శ లేకుండా బాలిక లేదా బాలుడి ప్రైవేట్ పార్ట్స్‌ను ఏం చేసినా తప్పులేదన్నట్టుగా ఓ తీర్పు… దానిపై దేశవ్యాప్తంగా గగ్గోలు… ఓ ముసలోడు తన ప్యాంటు జిప్పు విప్పి, తన లోభాగాలు చూపిస్తూ, ఓ బాలికను బెడ్ వైపు లాక్కెళ్లిన కేసులోనూ అంతే… చివరకు ఇదే సుప్రీంకోర్టు ఆ స్కిన్‌టుస్కిన్ కేసుపై స్టే ఇచ్చింది కదా…
Ads
అదే జడ్జి… మరో కేసు… ఒకే వ్యక్తి దుస్తులు విప్పి, రేప్ ఎలా చేయగలడు, సాక్ష్యాలు సరిగ్గా లేవు అంటూ కేసు కొట్టేసింది… సేమ్, జగేశ్వర్ కావ్లే అనే మరో నిందితుడినీ వదిలేసింది… కోర్టులను విమర్శిస్తున్నారు అనే ఆందోళనకన్నా ఎందుకు విమర్శిస్తున్నారు అనే ఆత్మమథనం అవసరం కదా ఇప్పుడు..? ఇదే జడ్జిని హైకోర్టు శాశ్వత జడ్జిగా నియమించే ప్రతిపాదనలను ఇప్పుడు సుప్రీం వాపస్ పంపించేసింది… అది సరే, ఇప్పుడు సుప్రీంకు అర్థమైంది… కానీ అసలు ప్రతిపాదనల దశ దాకా ఆమె పేరు ఎలా వచ్చింది అనే ఓ కీలక ప్రశ్నకు సమాధానాలు వెతుక్కోవాలి సుప్రీం కోర్టు… మొన్న మరో కేసులో ఓ వింత బెయిల్…
https://twitter.com/LiveLawIndia/status/1355087762798436353
https://twitter.com/LiveLawIndia/status/1355113182751145989
ఒక వివాహితుడు ఓ మైనర్ అమ్మాయిని రేప్ చేశాడు, ఆ పిల్ల గర్భం దాల్చింది… ఈకేసులో నిందితుడి లాయర్ ‘‘మరో రెండేళ్లలో ఆమె మైనారిటీ తీరిపోతుంది… నా క్లయింట్ మతం ఎక్కువ పెళ్లిళ్లను అనుమతిస్తుంది, కాబట్టి రెండేళ్ల తరువాత ఆమెను పెళ్లిచేసుకుంటాడు, బెయిల్ ఇవ్వండి’ అని వాదించాడు… కోర్టు బెయిల్ ఇచ్చేసింది… ఆ పిల్ల అంగీకారం ఉన్నా సరే, మైనారిటీ తీరని అమ్మాయితో సంభోగం అనేది కూడా నేరం కాదా..? మరో కేసులో కాస్త ఏజ్ తక్కువ ఉంది, నేను బాలనేరస్థుల జాబితాలోకి వస్తాను అని మరో నిందితుడి వాదన… ప్రశాంత్ భూషణ్ అనే లాయర్ హామీ ఇచ్చాడని మొన్న ఢిల్లీలో ట్రాక్టర్ల ర్యాలీకి వోకే చెప్పిన కోర్టు… చివరకు అదెలా మారిందో తెలుసు కదా… ఇవన్నీ ఈమధ్యకాలంలో కేసులే… కోర్టుల్ని అందరూ విమర్శిస్తున్నారు అనే ఆందోళనకన్నా ఈ పరిస్థితి ఎందుకు పెరుగుతుందనేదే ఆలోచించాల్సిన అంశం… తీర్పులకు పవిత్రత వాటి నాణ్యత వల్ల రావాలి, అంతేతప్ప, వాటిని పబ్లిక్ డొమెయిన్‌లో చర్చించకుండా ఆంక్షలు పెట్టడం వల్ల కాదు… ఒక తీర్పుపై అభిప్రాయం చెప్పడం అంటే మొత్తంగా న్యాయవ్యవస్థను ధిక్కరించినట్టూ కాదు… ఇదుగో, ఈ భావనలు కూడా పెరుగుతున్నయ్…!!
Share this Article