Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

డైనమిక్ ఎడిషన్లు… స్మార్ట్ ఎడిషన్లు… డిజిటల్ ఎడిషన్లు… అన్నీ ఈ-పేపర్లే…

October 24, 2023 by M S R

నిన్న ఓ వార్త… వాట్సపు గ్రూపుల్లోనే విస్తృతంగా కనిపించింది… అవును, అది వాట్సపు గ్రూపుల్లోనే… ప్రింట్ చేసిన పత్రికలో కాదు… నిజమే, రాబోయే రోజుల్లో వాట్సపు గ్రూపులు, ఫేస్‌బుక్కులు, ఈ-పేపర్లు, వెబ్ ఎడిషన్లు, స్మార్ట్ ఎడిషన్లు మాత్రమే ఉండబోతున్నాయి… పత్రికలు కాదు… ఆ సంధి దశే ఆ వాట్సపు గ్రూపుల్లో కనిపించిన వార్త…

ఇంతకీ ఆ వార్త ఏమిటంటే… ఆంధ్రప్రభ ఇకపై రోజూ రెండుసార్లు స్మార్ట్ ఎడిషన్లను విడుదల చేస్తుందట… మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం మరొకటి… వాళ్లు చెప్పడం లేదు గానీ, ఈలోపు మరో ఇంపార్టెంట్ స్టోరీ వస్తే అప్పటికప్పుడు మరో ఎడిషన్ రెడీ, రిలీజ్… చాలా వీజీ… అవసరం కూడా… పత్రికల ఈవినింగ్ ఎడిషన్ల కాలం కాదిది… అసలు ఈవినింగ్ డెయిలీస్ ఏం బతికి బట్టకట్టాయని…

ఇప్పుడు ఆంధ్రప్రభ ప్రవేశపెట్టిన ప్రయోగం కొత్తదేమీ కాదు… తెలుగు రాష్ట్రాల్లో మొదట దిశ అనే డిజిటల్ పేపర్ ఇలా డైనమిక్ ఎడిషన్లను స్టార్ట్ చేసింది… తరువాత వెలుగు… ఇప్పుడు ఆంధ్రప్రభ… రేప్పొద్దున అన్నీ ఈ బాట పట్టక తప్పదు… అంతెందుకు, పెద్ద పెద్ద ఇంగ్లిష్ పేపర్లే మొన్నటి కరోనా కాలంలో తమ ప్రింటింగ్ యూనిట్లను మూసేసి, వెబ్ ఎడిషన్లకు పరిమితం అయ్యాయి… చెప్పుకున్నాం కదా, ఇది సంధి దశ… తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పెద్ద పేరుమోసిన జర్నలిస్టులు కూడా ఈ-పేపర్లకు పరిమితమవుతున్నారు… (స్మార్ట్ ఎడిషన్లు ఎందుకో ఆంధ్రప్రభ ఎండీ తన సైన్డ్ ఎడిటోరియల్ లో సుదీర్ఘంగా ఏదో చెప్పుకొచ్చాడు కానీ ఈ అనివార్యత గురించి చెప్పలేకపోయాడు…)

Ads

ఇంకా పత్రికల సర్క్యులేషన్ పెంచుకునే ప్రయాసలు, ప్రయత్నాలు శుద్ధ దండుగ… చాలామంది పాఠకులు పత్రికల్ని తెప్పించుకోవడమే మానేస్తున్నారు… అంత ఖర్చు కూడా అనవసరం పాఠకుడికి… ఎప్పటికప్పుడు సోషల్ మీడియా, టీవీ మీడియా వార్తల్ని విశ్లేషణలతో సహా అందిస్తున్నాయి… అవే వార్తలు తెల్లవారి పాచిపోయి పత్రికల్లో దర్శనమిస్తే ఎవడికి వాటిని చదవాలనే ఆసక్తి ఉంటుంది…

చాలా పత్రికలు ఇప్పుడు తప్పుడు సర్క్యులేషన్ వివరాలతో, ప్రభుత్వ యాడ్స్ కోసం ఏవో కొన్ని పేపర్లను ప్రింట్ చేస్తున్నాయి… ఎక్కువగా తమ ఈ-పేపర్లు, వెబ్‌‌సైట్ల మీదే కాన్సంట్రేట్ చేస్తున్నాయి… వాట్సప్ ఎడిషన్లు అంటుంటారు వాటిని… వాట్సపు గ్రూపుల్లో సర్క్యులేట్ చేస్తుంటారు… ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి వంటి పెద్ద పత్రికలే కాపీలు పెంచుకోవాలనే తాపత్రయాన్ని కత్తిరించుకుని, అన్నీ మూసుకుని ఎలాగోలా కథ నడిపిస్తున్నాయి… ఇక చిన్న పత్రికల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలా..? ఆ పెద్ద పత్రికల యాడ్ రెవిన్యూ కూడా పడిపోయింది… అడ్డికిపావుశేరు రేట్లతో యాడ్స్ పబ్లిష్ చేస్తున్నాయి… అదీ దురవస్థ…

మరి ఈ స్మార్ట్, డిజిటల్, డైనమిక్ ఎడిషన్లు ఏమిటీ అంటారా..? చాలా సింపుల్… వెబ్‌సైట్లలో రాసే వార్తల్నే ఓ పేజీలో పెట్టేసి, రిలీజ్ చేయడమే… అనగా నెట్‌లో పెట్టేయడమే… ఈ-పేపర్లు రావడం లేదా..? ఇవి అవే… కాకపోతే స్మార్ట్, డైనమిక్, డిజిటల్ వంటి పేర్లు పెట్టుకోవడమే… అంతే… పత్రికలకు యాడ్స్ తీసుకుంటున్నట్టే వెబ్, స్మార్ట్ ఎడిషన్లకు కూడా కలిపి, ఓ బొకేలాగా యాడ్స్ తీసుకోవాలి… దాంతో ఆదాయం…

మరి పాఠకుడి మాటేమిటి అంటారా..? భలేవారే… చాలామంది పాఠకులు టీవీలను లేదంటే సోషల్ మీడియాను మాత్రమే ఫాలో అవుతున్నారు… ఈ ధోరణి ఇంకా పెరగబోతోంది వేగంగా… నిష్ఠురంగా ఉన్నా ఇదే నిజం… మేం పత్రికలో పేజీల సంఖ్య పెంచుతాం, జనం ఫిజికల్ పత్రికల్నే చదవడానికి ఇష్టపడతారు, మళ్లీ పాత రోజులు వస్తాయి అని ఎవరైనా భావిస్తే… దాన్ని సింపుల్‌గా మూర్ఖత్వం అంటారు..!! హిందూ, జ్యోతి కూడా అప్పట్లో ఓ దశలో ఇలాగే భావించి, చేతులు కాల్చుకుని, వాటంతటవే ‘‘అందరి బాట’’లోకి వచ్చేసి, పేజీలు తగ్గించేసి కాలిన చేతులకు ఆకులు కట్టుకున్నాయి..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • చంద్రబాబు ప్రమోట్ చేశాడు… టేస్ట్ అట్లాస్ కూడా తప్పనిసరై గౌరవించింది…
  • ఇద్దరు వీరోయిన్లతో చిరంజీవి కిందామీదా పడి దొర్లినా… ప్చ్, పాపం..!!
  • 82వ ర్యాంకు కాదు…! 2, 3 ఏళ్లలో వరల్డ్ టాప్-20 లిస్టులోకి హైదరాబాద్..!!
  • ధర్మేంద్ర కుటుంబానికి బ్రిటిష్ రాజవంశంతో చుట్టరికం..! ఎలా..?!
  • సాంబ, మూర్తి, వెంకటకృష్ణ… వీళ్లే హైదరాబాద్ ప్రేక్షకులకు ఇష్టులు..!!
  • అడ్డగోలు దందా బీఆర్ఎస్ హయాంలో..! బురద జల్లేది ఈ ప్రభుత్వంపై..!!
  • మీడియా జీవితాలను, కుటుంబాలను నిలబెట్టగలదు… ఇవి అవే స్టోరీస్…
  • సర్‌ప్రయిజ్ అప్పియరెన్స్..! ఈ తెలంగాణ ‘బతుకమ్మ’ గుర్తుందా మీకు..?!
  • యాక్షన్ లేదు, ఆధార్ బ్లాకూ లేదు… ఈ వివాదం పూర్వపరాలు ఇవీ…
  • మిస్టర్ కీరవాణీ… ఈ వారణాసి లవ్ సాంగ్ వీడియో నువ్వైనా చూశావా..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions