పార్టీ, అభ్యర్థుల పేర్లను చదవలేని నిరక్షరాస్యత, తగ్గిపోయే వృద్ధుల కంటిచూపు, ఎన్నికల గుర్తును సరిగ్గా గుర్తుపట్టి వోటు వేయలేని అమాయకత్వం… ఈ కారణంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశమంతా ఒక గుర్తు అనుకుని మరో గుర్తుకు వోట్లేయడం, కొన్నిచోట్ల భీకరమైన పోటీ ఉన్నప్పుడు ఈ తప్పుడు వోట్ల ఫలితంగా గెలుపూవోటములు అటూఇటూ మారిపోయిన ఉదాహరణలూ బోలెడు…
పర్‌ఫెక్ట్ ఉదాహరణలు… సైకిల్ గుర్తుకు మోటార్ సైకిల్ గుర్తుతో జరిగిన నష్టం… అలాగే కేసీయార్ పార్టీకి రోడ్ రోలర్ గుర్తుతో జరిగిన డ్యామేజీ… అదొక్కటే కాదు, కారు గుర్తుగా పొరబడే ప్రమాదం ఉన్నవి ఇంకా టెలివిజన్, చపాతీ రోలర్, కెమెరా, సోప్ బాక్స్, కుట్టుమిషన్, షిప్, ఆటోరిక్షా, ట్రక్ ఎట్సెట్రా… అయితే ఫలానా గుర్తులు మాకు నష్టదాయకం అని కోర్టులకు వెళ్తే ఎన్నికల సంఘం ఎన్ని గుర్తులను రద్దు చేయగలదు..?
ఐనా సరే, బీఆర్ఎస్ కోర్టుకు వెళ్లింది… కోర్టు ససేమిరా అంది… ఫ్రీ సింబల్స్ కేటాయింపులపై జోక్యానికి నో అంది… మరిప్పుడు ఎలా..? సదరు గుర్తుల ఓనర్లను పిలిపించుకుని ఏదో మేనేజ్ చేసుకోవడమే… అదే పనిలో ఉన్నట్టున్నాడు కేసీయార్… అసలే ప్రస్తుతం కాంగ్రెస్‌తో చాలా టఫ్ ఫైట్ ఉంది… ఒకరకంగా కాంగ్రెసే స్వల్ప ఎడ్జ్‌లో ఉన్నట్టు ఫీల్డ్ రిపోర్టులు చెబుతున్నాయి… ఈ స్థితిలో గుర్తులు ఎటమటం చేస్తే జరిగే నష్టం చాలానే ఉంటుంది…
Ads
ఓ వార్త కనిపించింది… యుగతులసి పార్టీకి రోడ్ రోలర్ గుర్తు ఉందట… దాంతో ఎక్కువ నష్టం కాబట్టి సదరు పార్టీ చీఫ్ శివకుమార్‌ను పిలిచి కేసీయార్ ఏకంగా 1005 ఎకరాల భూమిని రంగారెడ్డి జిల్లాలో గోశాల పేరిట ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడనేది ఆ వార్త సారాంశం… అందులో సర్వే నంబర్లతో సహా వివరాలున్నయ్… ఐతే అందులో నిజానిజాల జోలికి ఇక్కడ పోవడం లేదు, ఆ వార్తను కాదనడం లేదు, అలాగని కరెక్టే అని ఎండార్స్ కూడా చేయడం లేదు… ఎందుకంటే..?
ముందుగా ఈ శివకుమార్ ఎవరో తెలుసు కదా… జగన్ పార్టీ పేరు ఫస్ట్ రిజిష్టర్ చేయించుకున్నది తనే… ఆ పార్టీ పేరును తీసుకున్న జగన్ తన పార్టీ సెంట్రల్ కమిటీలో కూడా శివకుమార్‌ను తీసుకున్నాడు కొంతకాలం… ఎంత డబ్బు ఇచ్చాడనేది సహజంగానే బయటికి రాదు కదా… ఇప్పుడు కేసీయార్ ఏమివ్వబోతున్నాడు అనేది కూడా అంత తేలికగా బయటపడే యవ్వారం కాదు… మరొకటి ఆ వార్తలో ఉన్నదేమిటంటే…
కామన్ సింబల్ ఇలాగే కొనసాగడానికి వీలుగా… అంటే కనీసం 5 శాతం వోట్లు పొందేలా… హిందువుల వోట్లు ఎక్కువగా ఉన్న చోట్ల, ఆదిలాబాద్ జిల్లాలో కొన్నిచోట్ల మాత్రం యుగతులసి పోటీ చేస్తుందట… మిగతాచోట్ల కేసీయార్‌ను వదిలేస్తుందట, అంటే పోటీ చేయదట… పాత బస్తీ తప్ప కేసీయార్‌కు ఆశలేని సీట్లు ఏమున్నాయి..? ప్రతి సీటూ ప్రతిష్ఠాత్మకమే ఇప్పుడు పోటీ స్థితిలో… సో, 5 శాతం వోట్లు పోందే చాన్స్ ఇస్తాడా తను..?
నిజానికి ఈ సింబల్స్‌కు సంబంధించి అప్పట్లో కొన్ని సవరణలు చేశారు… రికగ్నయిజ్ కాని, రిజిష్టర్డ్ పార్టీలు కనీసం 10 శాతం సీట్లలో పోటీచేస్తేనే కామన్ సింబల్స్ ఇస్తారనేది ఓ సమాచారం… అంటే తెలంగాణలో 12 సీట్లలో పోటీచేస్తే అది బీఆర్ఎస్‌కు లాస్ కాదా..? ఇలా ఒప్పందం ఎందుకు ఉంటుంది..? చిన్న లాజిక్ అది… పైగా యుగతులసి పార్టీకి ఎన్ని వోట్లున్నయ్… ఓసారి ఇది చూడండి…
గత ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు తప్ప ఎవరికీ 5 శాతం దాటి వోట్లు రాలేదు… ఏడు సీట్లు గెలిచిన ఎంఐఎం వోట్ల శాతం 2.7 మాత్రమే… (సరే, దానికి కారణాలున్నయ్…) వైఎస్సార్టీపీ, ప్రజాశాంతి, జనసేన, టీటీడీపీ, తెలంగాణ జనసమితి, ఫార్వర్డ్ బ్లాక్ ఎట్సెట్రా ఏ పార్టీ అయినా సరే 5 శాతం వోట్లు సాధించే సిట్యుయేషన్ అస్సలు లేదు… ఈ సిట్యుయేషన్‌లో 5 శాతం వోట్లకు యుగతులసి పార్టీ పరిమితం అవుతుంది అనే వాక్యంతో వార్త క్రెడిబులిటీ మొత్తం పోయింది…
సరే, ఎన్నికలు కదా, రకరకాల వార్తలు వస్తూ ఉంటాయి… ఐతే, గుర్తుల తకరారు ఈసారి బీఆర్ఎస్‌కు బాగానే చికాకు పెట్టేట్టుంది… అది మాత్రం నిజం… సరే, శివకుమార్‌కు 1000 ఎకరాలు ఇస్తారు అనుకుందాం, మరి మిగతా గుర్తుల మాటేమిటి..? ఆయా పార్టీల చీఫ్‌లకు ఏమివ్వాలో…!! పాతబస్తీ దాటి కూడా పోటీచేయడానికి మజ్లిస్ సై అంటోందట, మరి మజ్లిస్‌ను ఎలా మచ్చిక చేసుకోవడం..? (ఇలాంటి లీగల్, టెక్నికల్, పొలిటికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఫింగర్స్ టిప్స్ మీద క్లారిటీ ఇచ్చేవాడు దివంగత జర్నలిస్ట్ సీహెచ్ఎంవీ కృష్ణారావు అలియాస్ పెద్ద బాబాయ్… తనలా సాధికారంగా వివరణలు చెప్పేవాళ్లు కనిపించడం లేదు ఇప్పుడు… గుర్తొచ్చాడు…)
Share this Article