వాల్తేరు వీరయ్య-Waltair Veerayya
వీరసింహారెడ్డి-Veerasimha Reddy
Ads
కార్తికేయ 2-Karthikeya 2
మట్టి కథ-Mattikatha
సర్-Sir Telugu & Tamil
ఉగ్రం-Ugram
యశోద-Yashoda
వీబీవీకే-VBVK
విరూపాక్ష-Virupaksha
రైటర్ పద్మనాభం-Writer Padmanabham
సీతారామం-Seetaramam
వంశాంకుర-Vamshankura
వారిసు-VARISU
మేమ్ ఫేమస్-MEMU FAMOUS
బింబిసార-Bimbisara
బేబీ-BABY
అన్నపూర్ణ స్టూడియో-Annapurna Studio
పై సినిమాలన్నీ మన తెలుగు నిర్మాతలు, 54 వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా, గోవా (ఇండియన్ పనోరమా సెక్షన్) కు పంపించినవి. మొత్తం అన్ని భారతీయ భాషల నుండి 25 సినిమాలను ఎంపిక చేస్తే, తెలుగు సినిమా ఒక్కటి కూడా లేదు. మన సినిమాల గొప్పదనం అది.
15 ఆగస్టు, 2022 లోపల సెన్సార్ అయిన సినిమాలే పోటీలకు అర్హత సంపాదించాయి. నా ‘ప్రజాకవి కాళోజీ’ సినిమా ఆ లోగా సెన్సార్ కాలేదు. వచ్చే సంవత్సరం తప్పక పంపిస్తాను.
ఇదీ పోస్టు… 25 సినిమాల్ని ఎంపిక చేస్తే అందులో ఒక్క తెలుగు సినిమా పేరు లేదు… 17 సినిమాలు… అందులో కమర్షియల్ హిట్స్ ఉన్నయ్, ఫ్లాపులు కూడా ఉన్నయ్… అయితే ఇవన్నీ 15 ఆగస్టులోపు సెన్సార్ అయిన సినిమాలు మాత్రమే… ఐనా సరే, ఒక్క ఫిలిమూ ఎంపిక కాకపోవడం మన సినిమాల నాణ్యతలేమిని పట్టిచూపే నిదర్శనం… ఒకవేళ నిజంగానే ఒకటోరెండో సినిమాలు ఎంపికైనా సరే, ఏమైనా అవార్డులు వస్తాయా అనేదీ డౌటే…
ప్చ్… ఆస్కార్‌కైనా సరే ప్రైవేటు ఎంట్రీలు, లాబీయింగులు, డబ్బు ఖర్చులు ఎట్సెట్రా వేషాలు వేయొచ్చు… మొన్న ఓ అవార్డు కూడా కొట్టాం కదా… ఆస్కార్ అవార్డుల డొల్లతనం బహిర్గతం చేస్తూ…! మరి ఆఫ్టరాల్ ఏ దేశవాళీ, దేశస్థాయి ఫిలిమ్ ఫెస్టివల్ కోసం ఆ ప్రైవేటు ఎంట్రీల అవకాశం ఎందుకు ఉండకూడదు అధ్యక్షా..? బలగం సినిమా ఆ గడువు తేదీలోపు సెన్సార్ కాలేదు కాబట్టి బహుశా అది వచ్చే ఫిలిమ్ ఫెస్టివల్‌కు ఎంపిక అవుతుందేమో… సరే, మళ్లీ ప్రభాకర్ జైనీ మాటల్లోనే చెప్పాలంటే…
‘‘అభూత కల్పనలు, మానవ మాత్రులకు సాధ్యం కాని ఫైట్లు, కాలం చెల్లిన ప్రేమ కథలు, పిచ్చి పాటలు… వీటన్నింటిని జ్యూరీలు ఎన్నో దశాబ్దాలుగా చూసి ఉంటారు. మనుమరాళ్ళ వయసున్న హీరోయిన్లతో గంతులేస్తుంటే మనకు నచ్చుతుందేమో కానీ, బయటివారికి ఎబ్బెట్టుగా ఉంటుంది. ఒక పాయింటు కూడా నిజమే. రాజకీయాలు తప్పక ఉన్నాయి. ఈసారి కన్నడ, మలయాళం సినిమాలు ఎక్కువగా ఎంపికయ్యాయి. కారణం నేను చెప్పనవసరం లేదు. తెలుగు వాళ్ళను ఎవరినైనా పెడితే వాళ్ళు పెద్ద సినిమాలకే కొమ్ము కాస్తారు…’’
వీటిల్లో సీతారామం సినిమాకు ప్రేక్షకుల నుంచి కొంత అప్లాజ్ వచ్చింది, నిర్మాతలకు డబ్బులు కూడా బాగానే వచ్చాయి… వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిల గురించి చెప్పుకోవడం దండుగ… కార్తికేయ-2 హిట్టే, కానీ ఉత్తమ సినిమాలకు, ప్రదర్శనలకు పోటీపడే కంటెంట్ మాత్రం కాదు… బేబీ కాస్త బెటర్… కానీ పోటీలో నిలబడలేకపోయింది… ఒకవైపు మనకు ఈసారి బోలెడు జాతీయ అవార్డులు వచ్చాయి… కానీ ఇదే ఇండస్ట్రీ ఓ ఫేమస్ ఫిలిం ఫెస్టివల్ కోసం ఒక్క సినిమాను ఇవ్వలేకపోయింది… వావ్… ఏం కంట్రాస్టు…!!
Share this Article