Nationalist Narasinga Rao …….. #iccworldcup2023 సగం టోర్నమెంట్ ముగిసింది… ఒక్కొక్క టీమ్ తొమ్మిదేసి మ్యాచ్ లు ఆడాల్సి ఉండగా 5 మ్యాచ్ లు అయిపోయాయి.. ఈరోజు ఆసీస్ నెదర్లాండ్స్ మధ్య, రేపు ఇంగ్లాండ్ శ్రీలంకల మధ్య ఐదో మ్యాచ్ ఉంది ఆసీస్ కు ఇది కూడా కీలక మ్యాచ్ …
ఏదైనా అద్భుతం జరిగి నెదర్లాండ్స్ గెలిస్తే నాలుగో స్థానం కోసం హోరాహోరీ తప్పదు… నార్మల్ గా ఆస్ట్రేలియా గెలిస్తే పెద్ద అంచనాల్లో మార్పు ఉండదు .. ఏదైనా అద్భుతాలు జరిగితే తప్ప సుమారు ఇప్పుడు టేబుల్ టాప్ లో ఉన్న ఫోర్ టీమ్స్ సెమీస్ కు వెళ్ళే అవకాశాలే ఎక్కువ… ఒకసారి టీమ్ వారీగా…
భారత్: టేబుల్ టాప్ లో ఉంది.. ఆడిన 5 మ్యాచ్ లలో గెల్చి ఉత్సాహంతో ఉంది… ఇప్పటి జోష్ చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో సౌతాఫ్రికాతో మ్యాచ్ తప్ప మిగిలిన మూడూ అవలీలగా నెగ్గడానికే అవకాశాలు మెండు… సో ఆటో మేటిక్ గా టేబుల్ 1 లో ఉండే అవకాశం కనిపిస్తోంది…..
Ads
సౌతాఫ్రికా: ఈ టోర్నమెంట్ లో అండర్ డాగ్స్ గా ఎంటర్ అయ్యి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అద్భుతమైన ఆట తీరుతో టేబుల్ లో సెకండ్ ప్లేస్ లో ఉంది… ఆడిన ఐదు మ్యాచ్ లలో నాలుగు సార్లు భారీ స్కోర్ చేసింది.. రెండు ముఖ్యమైన మ్యాచ్ లు ఉన్నాయి నాలుగులో… భారత్ న్యూజిలాండ్… రెండు గెలిచి రెండు ఓడినా సెకండ్ ప్లేస్ అటూ ఇటూ అయినా కూడా సెమీస్ అవకాశాలకు డోకా లేదు…. ( నాలుగు ఓడితే తప్ప ఇప్పుడున్న జోష్ లో అది కష్టం, మిగిలిన రెండు పాక్, నెదర్లాండ్స్ మ్యాచులు).
న్యూజిలాండ్: ఆడిన 5 మ్యాచ్ లలో ఒకటి భారత్ తో తప్ప మిగిలిన అన్ని మ్యాచ్ లు గెలిచి మూడో స్థానంలో ఉంది… ఆ జట్టు ట్రాక్ రికార్డ్ చూస్తే నాలుగులో రెండు ఖచ్చితంగా గెలిచే అవకాశాలు.. రెండు హోరాహోరీగా ఉండొచ్చు…ఒకటి సౌతాఫ్రికాతో మరొకటి ఆస్ట్రేలియాతో … పాకిస్థాన్ శ్రీలంకలతో ఈజీగా గెలిచే అవకాశాలు ఉన్నాయి.. సో, న్యూజిలాండ్ కు కూడా సెమీస్ బెర్త్ ఖాయంగానే కనిపిస్తూ ఉంది…
ఇక మిగిలింది ఆస్ట్రేలియా… ఇప్పటికీ నాలుగు మ్యాచ్ లు అయ్యాయి, ఈరోజు 5 మ్యాచ్ కీలకం.. ఈరోజు మ్యాచ్ అయ్యాక మిగిలిన నాలుగులో ఒకటి ఇంగ్లాండ్ తో, మరొకటి న్యూజిలాండ్ తో ఉంది…. మిగిలిన రెండు బంగ్లా ఆఫ్ఘన్ లు.. సెమీస్ కు ఆస్ట్రేలియాకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి…
పాకిస్థాన్ కు ఇంకా నాలుగు కీలక మ్యాచ్ లు ఉన్నాయి ఇంగ్లాండ్ సౌతాఫ్రికా న్యూజిలాండ్ . బంగ్లా… ఇప్పుడు ఆ జట్టు ప్రదర్శనను బట్టి రెండు మూడు ఓడే అవకాశం ఉంది.. పైగా బాబర్ ను కెప్టెన్సీ నుండి తప్పిస్తునారు అనే వార్తలు టోర్నమెంట్ మధ్యలో రావడం .. జట్టులో సమన్వయం లేకపోవడం అనేక కారణాల వల్ల ఈ అంచనా.. ఒకవేళ ఈరోజు అనూహ్యంగా ఆస్ట్రేలియా మీద నెదర్లాండ్స్ గెలిస్తే మళ్లీ కొద్దిగా అటూ ఇటుగా అయ్యే అవకాశం ఉంది… మిగిలిన మూడూ సేమ్ టూ సేమ్…..
Share this Article