రష్మి, అనసూయ, భానుశ్రీ, తేజస్వి… తాజాగా జ్ఞానేశ్వరి… టీవీ వల్ల ఫేమ్ వచ్చి… సినిమాల కోసం ట్రై చేస్తే బోల్డ్ టైప్ పాత్రలే దిక్కా..? వాటితో వాళ్లు నిచ్చెనమెట్లు ఎక్కడం సాధ్యమేనా..? హేమిటో… సుధీర్, రాంప్రసాద్, గెటప్ సీను వంటి నటులే త్రీమంకీస్ వంటి బోల్డ్ అండ్ అగ్లీ కథలతో కుస్తీ పడుతుంటే పాపం ఆడతారల్ని ఆడిపోసుకోవడం దేనికి లెండి… ఈ జ్ఞానేశ్వరి ఎవరో టీవీలు, సినిమాలు ఎక్కువగా చూసే ప్రేక్షకులకు తెలుసు… మాటీవీలో వచ్చిన పెళ్లిచూపులు అనే ఓ అట్టర్ ఫ్లాప్ షో ద్వారా వెలుగులోకి వచ్చింది… ఆ షోలో పెళ్లికొడుకు ప్రదీప్… స్వయంవరం టైపులో స్వయంవధు అన్నమాట.,. ఇప్పుడు అదే ప్రదీప్ హీరోగా ఒక సినిమా, అదే జ్ఞానేశ్వరి హీరోయిన్గా మరో సినిమా థియేటర్లలోకి వచ్చిపడ్డయ్… పేరుకు ఏడెనిమిది కొత్త సినిమాలు వచ్చిపడ్డా, ఈ రెండు సినిమాలే కాస్త ఇంట్రస్టింగు… అవి ప్రదీప్, జ్ఞానేశ్వరి వల్ల మాత్రమే కాదు…
జ్ఞానేశ్వరి తన భుజాల మీద మోసిన మిస్టర్ అండ్ మిస్ సినిమా క్రౌండ్ ఫండింగ్ ద్వారా తీయబడిన సినిమా… గతంలో అవార్డు పొందిన ఓ షార్ట్ ఫిలిమ్ కాన్సెప్టునే పొడిగించి, ఫీచర్ సినిమాగా తీశారు… ఇక ప్రదీప్ నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాకు సంబంధించిన విశేషం ఏమిటంటే… అందులోని నీలి నీలి ఆకాశం అనే పాట సూపర్ డూపర్ హిట్టయింది… అదే ప్రేక్షకుల్ని ఆకర్షించింది… చివరకు రెండు సినిమాలూ ఢమాల్… చెప్పుకోవడానికి ఏ డౌటూ అక్కర్లేదు… ప్రదీప్ సినిమా గురించిన చర్చ ఎలా ఉన్నా ఒక్కసారి ఈ మిస్టర్ అండ్ మిస్ కథేమిటో చూద్దాం…
Ads
ఓ ఆడపిల్ల ఒకరితో లవ్వు, లివ్ ఇన్ రిలేషన్… ఈమధ్య ట్రెండ్ అదే కదా… వాడికి ఇంకేవో యవ్వారాలున్నట్టు గమనించి బ్రేకప్… ఇంకెవడితోనూ ఈ లవ్వు, కొవ్వూ జోలికి చస్తే పోనని అంటూనే మళ్లీ ఒకడితో పడిపోతుంది… వాడి మైనసులూ తెలుస్తయ్… మళ్లీ బ్రేకప్పుకు రెడీ… నిజానికి వీళ్ల సంబంధాల్లో లవ్వు ఏమీ ఉండదు… ఏదో లైంగికసంబంధమే తప్ప ఇంకేమీ ఎమోషనూ ఉండదు… సినిమాకు బేసిక్ పాయింట్ ఏమిటంటే..? హీరో, హీరోయిన్ల సంభోగ దృశ్యాలు… అవి రికార్డు చేసుకునే ఓ ఉన్మాదం తరహా టేస్ట్… ఆ ఫోన్ కాస్త మిస్… సినిమా పేరులో మిస్ అంటే కుమారి అని కాదు… బహుశా ఫోన్ మిస్ అనే అంశం కోసం పెట్టారేమో… ఆ మిస్టర్ ఫోన్ మిస్ అని…!
ఆ వీడియో బయటికి పోతే ఎలా..? నెట్‌కు ఎక్కితే ఎలా..? ఇదీ వాళ్ల సమస్య… ఈ కథ అర్థం కాగానే సినిమా మీద, పాత్రల కేరక్టరైజేషన్ మీద, నిర్మాత అభిరుచి మీద మనకు ఓ క్లారిటీ వచ్చేస్తుంది… ఇక జ్ఞానేశ్వరి బోల్డ్నెస్, ఆ సీన్లు పెద్దగా ఆకట్టుకోవు… ఏదో నిడివి మరీ ఎక్కువైన ఓ బోర్ షార్ట్ ఫిలిమ్ చూస్తున్నట్టుగా… వెగటు వాసన… మరి కథే అది కదా అంటారా..? అవును, అలాంటి కథలే యూత్‌ను థియేటర్ల దాకా రప్పిస్తాయని ఎంఎస్‌రాజు వంటి డర్టీ హరిలే నమ్ముతుంటే… ఇక కొత్త దర్శకులను ఎందుకు తప్పుపట్టడం..? అలాంటి సీన్లు కావాలంటే యువత థియేటర్ల దాకా రావాలా ఏం..? అరచేతిలో స్మార్ట్ ఫోన్ ఆ అవసరాన్ని పచ్చిపచ్చిగా తీర్చడం లేదా..? అవునూ, యాపిల్ ఫోన్ ఎవరికైనా దొరికితే ప్రాబ్లం ఏమిటట..? పెద్ద పెద్ద తోపు హ్యాకర్లే వాటిని ఓపెన్ చేయలేరు… ఇక అందులో సీన్లతో వచ్చే నష్టమేమిటట..? మరీ జీపీఎస్ గట్రా సాంకేతిక జ్ఙానంతో అన్వేషణ దేనికట..? పైగా ఆమె అనుమతి లేకుండా ఆ ఇంటిమేట్ సీన్లన్నీ తీయడం ఏమిటి అసలు..? పైగా ఆ సీన్లను ఫోన్లో భద్రంగా సేవ్ చేసుకోవడం ఏమిటి..? ఉత్త నాన్సెన్స్ సినిమా… మిస్ అయినా పర్లేదు, కాదు, కాదు, మిస్ చేయాల్సిన సినిమాయే… హహహ, నవ్వొచ్చేదేమిటంటే..? ఈ సినిమా మంచిగా క్లిక్కయిందని జ్ఞానేశ్వరి సంబరాలు చేసుకుందట… మరింత నవ్వొచ్చేది ఏమిటంటే..? ఈ సినిమాకు ఫ్యామిలీ ప్రేక్షకులు బాగా వస్తున్నారని చెబుతోందట… అచ్చు ఆ సినిమాలో పాత్ర అజ్ఞానేశ్వరి తరహాలోనే..,!!
Share this Article