ముందుగా ఓ చిన్న విషయం… బిగ్‌బాస్ రేటింగ్స్ ఈసారి మెరుగ్గా ఉన్నయ్… అంటే బాగా ఉన్నాయని కాదు, గత వారాలతో పోలిస్తే బెటర్… బట్ స్టిల్, గత సీజన్‌లాగే సాగుతోంది… ఇక విషయంలోకి వెళ్తే… ఫాఫం రతిక…
ఆమె ఎలిమినేట్ అయ్యాక కొందరు అరెరె, ఆమెను అనవసరంగా ఎలిమినేట్ చేశారని వ్యాఖ్యలు చేశారు… కానీ స్వయంకృతం… సరే, వెళ్లిపోయింది… తిరిగి వచ్చింది… ఎలా వచ్చింది..? హౌజులో ఉన్నవాళ్లు తక్కువగా వోట్లు వేస్తే, ఈసారి బిగ్‌బాసోడి మూర్ఖత్వం పాలు ఎక్కువై, తక్కువ వోట్లు వచ్చినందుకు లోపలకు తీసుకొచ్చారు… వచ్చాక ఆమెకు ఒకే పని…
శివాజీ కాళ్లు మొక్కి, బతిమిలాడి… యావర్ మద్దతు కోసం పాకులాడి… చివరకు ప్రశాంత్ దగ్గర కూడా ఏడ్చి, బాబ్బాబు, మనం ఫ్రెండ్స్ అయిపోదాం అని వేడుకుని… ఎందుకీ ప్రయాస..? ఇలాంటి రతిక ఎనిమిది వారాలుగా స్టడీగా ఆడుతున్న వాళ్లలో ఎవరు కెప్టెన్ కావాలో అభిప్రాయం చెప్పాలట, దానికి వాల్యూ ఉందట… ఇదొక క్రియేటివ్ దరిద్రం బిగ్‌బాస్‌ది… రతిక ఆడేది లేదు, ఆకట్టుకునేది లేదు… ఇదే ధోరణి… హౌజులోకి ఆమె ఎంట్రీ శుద్ధ దండుగ…
Ads
హౌజులో వాళ్లు ఎవరు కెప్టెన్ కావాలో తేల్చాలని ఫిక్సయితే, మరి వాళ్లతో నాలుగు ఆటలు ఎందుకు ఆడించినట్టు..? దేడ్ దిమాక్ క్రియేటివ్ టీం… స్పష్టంగా అర్థమవుతూనే ఉంది… బిగ్‌బాస్ టీం, నాగార్జున కావాలని శివాజీని మోస్తున్నారు… శివాజీ ఓ గ్రూపు మెయింటెయిన్ చేస్తున్నాడు… ఓ మిత్రుడి వ్యంగ్యంగా వ్యాఖ్యానించినట్టు… బిజ్జాలదేవ శివాజీ, బూతులు- వెకిలి వెక్కిరింపుల భోలే, ఆవేశం అరుపులు తప్ప ఆలోచన లేని యావర్, అపరిచితుడు ప్రశాంత్… ఇక వీళ్లతో ఇప్పుడు రతిక కలిసింది… (శివాజీని బిజ్జాలదేవ అని తన దైహిక అస్వస్థతను వెక్కిరిస్తూ చేసిన కామెంట్ కరెక్టు కాదు…)
ఒకవైపు కెప్టెన్ కాలేకపోయామని హౌజు లోపల కొందరు బాధపడుతుంటే బయట ఈ గ్రూపు డాన్సులు… కావాలని ప్రియాంక, శోభాశెట్టి, ఆట సందీప్‌లను డిస్ క్వాలిఫై చేసింది ఈ గ్రూపు… ఇక్కడ మెచ్చుకునేది ఏమిటంటే…? ప్రియాంక, శోభాశెట్టి ఈ గ్రూపుతో ఢీ అంటే ఢీ అంటున్నారు… టెంపర్‌మెంట్ ఉండాలి అలాగే… బిగ్‌బాస్ ఆట ఆడాలంటే అదే కరెక్టు… (అఫ్ కోర్స్, శోభాశెట్టిని లీస్ట్ వోట్లు వస్తున్నాయి వోటింగు సైట్లలో… కానీ తను ఎంచుకున్న స్ట్రాటజీ అది, తన గేమ్ అది… ఎక్కడా ఆమె తన గేమ్ ప్లాన్ నుంచి డీవియేట్ కావడం లేదు… యావర్ మీదమీదకు వస్తుంటే తలెత్తుకుని, మాటకుమాట జవాబు ఇచ్చింది…)
శివాజీయే ఓ దశలో తన గ్రూపు వాళ్లతో అంటున్నాడు… ‘ప్రియాంక, శోభ అటాకింగ్ ప్లేయర్లు, వాళ్లకు వాళ్ల ఆట మీద క్లారిటీ ఉంటుంది’ అని… నిజం… హౌజులో ఉన్న రతిక, అశ్వినిలతో పోలిస్తే ప్రియాంక, శోభ చాలా బెటర్… అశ్విని అయితే శుద్ధ దండుగ… మిగతా వాళ్లలో అర్జున్ చాలా బ్యాలెన్స్‌డ్‌గా, హుందాగా వ్యవహరిస్తున్నాడు… తేజ ఆటలో అరటిపండు… అంతే… గౌతమ్, అమర్‌దీప్ సోసో… ఆట సందీప్, శోభాశెట్టి ఇద్దరూ లీస్ట్ వోట్లకు పోటీపడుతున్నారు… ఎవరు బయటికి వెళ్లినా శివాజీ గ్రూపుకి మరింత బలం… సరిగ్గా నాగార్జున కోరుకునేదీ అదేగా…
Share this Article