ఎప్పటిలాగే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన ‘పచ్చ’టిబాటలోనే జగన్‌పై విషాన్ని చిమ్ముతూ, తెలుగుదేశం అనుకూల వాయిస్ వినిపిస్తూ మరో ‘కొత్త పలుకు’లు పలికాడు… ఆ కంటెంటు జోలికి పోవడం లేదు కానీ జగన్-షర్మిల నడుమ పంచాయితీ, షర్మిల కొత్త పార్టీ ప్రచారాలకు సంబంధించి అప్పట్లో ఓ పెద్ద బ్యానర్ స్టోరీ కమ్ ఎడిట్ ఫీచర్ రాశాడు కదా… దానికి ఫాలో అప్ మీద మాట్లాడుకుందాం… నవ్వొచ్చిందేమిటీ అంటే..? ‘‘వాడు వ్యభిచారం చేస్తే తప్పులేదు గానీ నేను చేస్తే తప్పా..?’’ ఈ తరహాలో రాధాకృష్ణ అపరిపక్వ రాతలు కొన్ని కనిపించినయ్… కాస్త జాలేసింది కూడా… ఆ నేపథ్యంలోకి ఓసారి వెళ్దాం… జగన్ మీద కోపంతో షర్మిల ఓ కొత్త పార్టీ పెట్టబోతోంది అనేది ఓ వివాదాస్పద ప్రచారం… దాన్ని రాధాకృష్ణ తన భుజాన మోస్తున్నాడు… నిజానికి ఆ ప్రచారం పొలిటికల్ సర్కిళ్లలో ఉన్నదే… ఆమె పరిణతి లేకుండా అడుగులు వేస్తున్నదా..? జగన్ పట్ల అకారణ ఆగ్రహాన్ని పెంచుకుంటున్నదా..? అనే అంశాలు వదిలేస్తే… ఆంధ్రజ్యోతి రాతలపై వైసీపీ కూడా పెద్దగా ఖండించలేకపోయింది… ఎప్పటిలాగే సోషల్ మీడియాలో ఆర్కేను తిట్టిపోయడం మినహా… అధికారంలో ఉన్న పార్టీ హుందాగా ఒక ఖండన గానీ, ఒక వివరణ గానీ ఇవ్వలేకపోయింది… కనీస స్పందన లేదు… ఎహె, అది ఓ పత్రికా..? దానికి ఖండన ఇవ్వడం దేనికి..? అంటారా..? మరి అలాంటప్పుడు ఒక్క షర్మిల మాత్రమే ఎందుకు స్పందించింది..?
ఒకరోజు ఆలస్యంగా ఆమె పేరిట ఓ ఖండన వచ్చింది… అదీ విచిత్రంగా ఉంది… పంపాల్సిన పద్ధతిలో మీడియాకు పంపించలేదు… సోషల్ మీడియాలో ఎవరో పోస్ట్ చేశారు… అందులోనూ ఓ విచిత్రమైన వివరణ… ‘‘వైఎస్సార్ గారి కుటుంబంపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదు, బాధ్యులపై లీగల్ చర్యలు తీసుకుంటాను’’ అనే అర్థమొచ్చేలా అస్పష్టంగా ఉంది… తనే ఆ ఖండన రాసినట్టయితే… మా కుటుంబం మీద… అని ప్రస్తావించేది… అలాగే తన మీద జరుగుతున్న ‘సొంత పార్టీ’ అనే ప్రచారం మీద ఒక్క ముక్క కూడా వివరణ లేదు… ఆ కీలకాంశం మీద మౌనాన్ని అర్ధాంగీకారంగా భావించాలా..? సంపూర్ణాంగీకారంగా భావించాలా..? దానిపై వివరణ ఇవ్వాల్సిన పనిలేదు, ఆంధ్రజ్యోతిని గుర్తించాల్సిన పనిలేదు అనుకునే పక్షంలో ఈ మొత్తం ఖండన నోట్ వేస్ట్ కదా మరి..?
Ads
ఇప్పుడు రాధాకృష్ణ ‘‘నిజానికి నేను చెప్పిన అనేక అంశాలను షర్మిల ఖండించలేదు… శ్రీమతి విజయలక్ష్మి బెంగళూరులో ఉన్న షర్మిల వద్దకు హుటాహుటిన ఎందుకు వెళ్లారు? పులివెందుల నుంచి ఎవరెవరు బెంగళూరు వెళ్లారు? అక్కడ ఏం జరిగింది? ఏ పరిస్థితులలో ఆ ప్రకటనపై షర్మిల సంతకం చేసిందీ నాకు తెలియదనుకుంటున్నారా?’’ అంటున్నాడు… ఓహ్, రాధాకృష్ణకు చాలా రహస్యాలు తెలిసిపోతున్నయ్… జాగ్రత్త జగనూ… మీ ఇంట్లో కూడా రాధాకృష్ణ స్పయింగ్ కెమెరాలు, బగ్స్ ఫిట్ చేసిపెట్టాడు రాధాకృష్ణ… హహహ… నిజానికి ఇక్కడ ఇది కాదు మనం చెప్పుకోవాల్సింది… ‘‘ఏం..? కుటుంబ వ్యవహారాలపై రాయడం నీతిమాలిన చర్య అంటున్నారు, మరి ఒకప్పుడు రామోజీరావుతో విభేదించిన ఆయన చిన్న కుమారుడు దివంగత సుమన్‌తో ఇంటర్వ్యూ చేసి రామోజీరావును తిట్టించిన జగన్మోహన్ రెడ్డి కూడా నీతిమాలిన చర్యకు పాల్పడినట్టే కదా..! జగన్ ఇప్పుడు ముఖ్యమంత్రి… ఆయనది ప్రైవేటు కుటుంబం కాదు… షర్మిల కూడా వైసీపీ తరఫున ప్రచారం చేశారు. ప్రజా జీవితంలో ఉన్నవారి మధ్య విభేదాలు ఏర్పడితే అది వార్త కాకుండా పోదు… అని సమర్థించుకుంటున్నాడు… ‘‘రామోజీరావు ప్రజాజీవితంలో లేకపోయినా ఆయన కుటుంబాన్ని బజారుకు ఈడ్చిన వాళ్లు నీతి గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించడమే! అయినా నేను రాసినవి అసత్యాలని అటు శ్రీమతి విజయలక్ష్మి గానీ, ఇటు షర్మిల గానీ బైబిల్ పట్టుకుని చెప్పగలరా? అని సవాల్ విసురుతున్నాడు… ఆ టెంపర్మెంట్ను మెచ్చుకుందాం… కానీ ఇక్కడ తనను చూస్తే ఎందుకు జాలేస్తున్నదంటే..?
…… ఇదీ అప్పట్లో సాక్షి రాసిన సుమన్ బాగోతం… ప్రజాజీవితంలో లేని రామోజీ అని రాధాకృష్ణ రాయడమే నవ్వొచ్చే అంశం… రామోజీరావు కొన్ని దశాబ్దాలపాటు రాజకీయాల్నే శాసించాడు… ప్రజల మెదళ్లను ట్యూన్ చేశాడు… లేదా పొల్యూట్ చేశాడు… ప్రజాజీవితం అంటే ఏమిటి రాధాకృష్ణా..? ఐనా సుమన్ ఓ సెలబ్రిటీ, రామోజీ ఓ సెలబ్రిటీ… కళలు, వ్యాపారం, రాజకీయం, స్థిరాస్తి… ఇలా అనేక అంశాల్లో వేలు, లక్షల కోట్ల యవ్వారం వాళ్లది… ఆ కుటుంబంలో ఏం జరిగినా వార్తే అవుతుంది కదా..? పోనీ, అది వార్త కాదు సరే, వాళ్లు అలా చేశారు కాబట్టి నేను కుటుంబాల మీద రాసినా తప్పులేదనే సమర్థన దివాలాకోరుతనం కాదా..? అది వ్యభిచరించింది, సో, నేనూ ఆ పనిచేస్తే తప్పు కాదు అన్నట్టుగా రాయడం పెద్ద అబ్సర్డిటీ… ఆనాడు సాక్షి తన సొంత పైత్యాన్ని రాయలేదు… సాక్షాత్తూ సుమన్ చెప్పిన మాటల్నే రాసింది… ఇప్పుడు షర్మిల కొత్త పార్టీ మీద రాధాకృష్ణ ఏదో రాయడాన్ని వ్యతిరేకించాల్సిన పనిలేదు… కానీ సాక్షి వాడి రామోజీ కథనాలతో పోలుస్తూ సమర్థించుకోవడమే అసలు దరిద్రం…! షర్మిల నిజంగానే పార్టీ పెడితే అది కుటుంబవ్యవహారం ఎందుకు అవుతుంది..? ప్రజాజీవితానికి సంబంధించి వ్యవహారమే అవుతుంది అని గట్టిగా సమర్థించుకుంటే సరిపోయేది…!!
Share this Article