Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నువ్వేమైనా బాలాకుమారివా..? హీరో తల్లిగా చేస్తే ఏం పోయిందట ఫాఫం…!!

November 2, 2023 by M S R

అమ్మా షఫాలి…. కొంత ఫేమ్‌ రాగానే అవాకులు పేలడం Actors కి అలవాటే… మొన్నామధ్య ఒక ప్రముఖ ఛానల్‌ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గతంలో చేసిన సినిమాలపైన కొంత కాంట్రవర్సీగా మాట్లాడుతావా… ‘‘వక్త్ అనే సిని మాలో హీరో అక్షయ కుమార్ కి తల్లిగా చేయాల్సి వచ్చింది. తెరపై హీరో తల్లులు నిజానికి వారికంటే చిన్న ఏజ్ వారు.  నేను ఇకపై అలాంటి పాత్రలు చెయ్యను అంటావా…?!’’ సర్లే, అది నీ అభిప్రాయం, నిన్ను నువ్వు హీరోయిన్‌ అని ఫీలవ్వడంలో తప్పు లేదు.

కానీ మ్యాడం….. నర్స్ ఐనా నటి ఐనా ఒప్పుకున్నాక చెయ్యాల్సిందే, బిడ్డ వస్తుందా గడ్డ వస్తుందా అని ఆలోచించకూడదు. నచ్చకుంటే ముందే తప్పుకోవాలి…! అలాగే నటీనటులన్నాక ఎలాంటి పాత్రనైనా అవలీలగా చెయ్యగలగాలి.పైగా నచ్చి ఒప్పుకుని కమిటయ్యాక చేసి తీరాలి. ఇరవై ఏళ్ళ తర్వాత తప్పుచేసాను అని మెటికలు ఇరవకూడదు….!

అమీర్‌ఖాన్‌ ని చూసి ఏం నేర్చుకోలేదా…? తమరేమైనా హీరోయిన్‌ మెటీరియలా…? రెండు యాంగిల్స్ పెట్టాక మూడో యాంగిల్లో చూడటానికే చికాకుగా వుండే తమరి ఫేసుకి మహానటి అని పేరెవడిచ్చాడో…?! అన్నిటికీ ఒకే రకమైన ఎక్స్ప్రెషన్‌ ఇచ్చే తమరిది ‘సటిల్‌’ నటన అన్నోడిని అనాలి అసలు….

Ads

యేదో తమరి భర్త గారైన విపుల్‌ షా పుణ్యమా అని ‘human’ అనే సీరీస్ తో సెకండ్‌ ఇన్నింగ్స్ మొదలెట్టి ఓటీటీ పుణ్యమా అని నెట్టుకొస్తున్నావు. హర్ష ఛాయతోనే వుండి వుంటే నీకు ఈ మాత్రం గుర్తింపైనా వచ్చేదా మేడం…? విపుల్‌ కనెక్షన్స్ ని వాడుకుని వర్క్ తెచ్చుకునే నువ్వు కూడా mainstreem movies మీద విరుచుకుపడుడేనా…

నాకు తెలీక అడుగుతాను ఇది చెప్పు… అసలు నువ్వు బాలీవుడ్డులో ఎన్ని సినిమాలు చేసావు…? నేను స్కూల్లో వున్నప్పట్నుండి చూస్తున్నా, నువ్వు హర్ష ఛాయతో రొమాన్సు చేసి అతగాడి కనెక్షన్స్ వాడి ఎన్ని సీరియల్స్ చేయ్యలేదు….?! అవకాశం విపుల్‌ రూపంలో రాగానే అంది పుచ్చుకుని ఎగిరిపోయావు… నువ్వే అంత పుడింగివైతే మరి ఆ తర్వాత ఎందుకు బాలీవుడ్డులో సినిమాలు చెయ్యలేదు.

యేదో ఈమధ్య ఓటీటీ పుణ్యమా అని ఫేడౌట్‌ ఫేసులకు గిరాకీ దొరికిన నేపథ్యంలో నీకు పుసుక్కున ఆ ‘డిల్లీ క్రైంలో తీసుకున్నారు, అది కూడా కాస్టింగ్‌ డైరెక్టర్‌ ముకేష్ ఛాబ్రాతో నీకున్న పూర్వపు పరిచయం వల్ల….! ఇక అక్కడి నుండి ఓటీటీల సీరీస్ లు నీకు దక్కాయి. హ్యూమన్‌ సీరీస్‌లో ఒక స్టైలిష్ రిచ్‌ ఆంటీగా నటించిన తమరు ఏం హావభావాలు చూపించారు… మూతిబిగించి కళ్ళు గిరగిరా తిప్పడమనేది ఒక్కటే తమరికి వచ్చు.

డార్లింగ్స్ వెబ్‌మూవీలో కూడా అంతే… దివ్యదత్తా లాగా పర్మనెంట్‌ పనిమనిషి పాత్రకు సరిగ్గా సరిపోయే నిన్ను ఆ జల్సా డైరెక్టర్‌ మాత్రం సరిగ్గా కాస్టింగ్‌ చేసాడు. బొటాక్స్ లు, ఇంప్లాంట్లు వేసుకోడం నేరం కాదు గానీ మరీ హాలీవుడ్డు హీరోయిన్‌ లా బిల్డప్పులు ఏంటసలు..?! ఎప్పుడు చూడూ, ఆ నీరసగొట్టు హావభావాలు, గొంతుపెగలని గుసగుస డైలాగ్‌ డెలివరీని నువ్వో పెద్ద వైవిధ్యమైన నటన అని మమ్మల్లి ఫీలవ్వమంటున్నావు చూడూ…అదీ మా ఖర్మ…!

హీరో తల్లిగా చెయ్యను, నాకంటే వయసులో పెద్దోళ్ళు అని సన్నాయి నొక్కులు నొక్కమాక. నువ్వేం పదారుప్రాయపు బాలాకుమారివా…?! నటనంటేనే యూతు వాడు ముసలిగా, ఆరోగ్యవంతుడు రోగిగా, పునిస్త్రీ ముండమోపిగా చెయ్యడమే…. ముందు అది తెలుసుకో.. లేకుంటే మీ విపుల్‌తో ‘దేసీగాళ్’ ‘గజగామిని’ లాంటి సినిమాలు నిన్ను వీరోయీన్‌గా పెట్టి తీయించుకో…. మా బాలివుడ్‌ సినిమాలని హీరోలని వొగ్గేయ్‌…!… ఇట్లు, ప్రియదర్శిని కృష్ణ

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions