ఎవరో క్రోడీకరించారు తెలుగువారి వంటలు అని… తెలుగువాణ్ని తిండిలో కొట్టగలరా అని… ఇంత మెనూ ప్రపంచంలోనే ఏ దేశంలోనూ ఉండదట… సరే, దీన్ని వ్యతిరేకించే పని లేదు… ఇన్ని వంటలు ఒక్కచోట గుర్తుచేయడం ఓ మంచి ప్రయత్నమే… కాకపోతే తెలుగు వంటలు అని ముద్రవేయడమే సబబుగా లేదు… (దిగువన ఇచ్చిన ఫోటో చదవడం కష్టం… జూమ్ చేస్తే చదువుకోవచ్చు.,. ఒక్కసారి లుక్కేయండి…)
.
.
Ads
ఈ జాబితాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ వెజ్ వంటకాలు లేవు… రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నాన్ వెజ్ వంటకాలు ఇష్టమైనవే… పాయ వంటి తెలంగాణ బాపతు వంటకాలూ బోలెడు… పైగా ఈ జాబితాలో పకోడీలు, ఇడ్లీలు, దోశలు, పప్పులు, పచ్చళ్లు, పులిహోర, రైస్ ఎట్సెట్రా వంటకాల్లో దినుసులను బట్టి, చేసే విధానాలను బట్టి ఇంకా బోెలెడు రకాలు ఉంటయ్… ఇవి గాక మరెన్నో వందల వంటలూ ఉంటయ్…
.
.
కజ్జికాయలు, గవ్వలు, పూర్ణాలు అని చదువుతుంటేనే అర్థమైంది, ఇవి ఆంధ్రా వంటకాలు అని… పచ్చిపులుసు, సకినాలు, సర్వపిండి, గట్క, జొన్న రొట్టె, సల్ల దప్పడం (దప్పళం), వరి అట్టు, మక్క గారెలు, దొడ్డు శేవెల పాశం (పాల తాళికలు, వినాయక చవితి రోజున చేసుకునే శేవెల పాయసం), ఒనగాయ తొక్కు (లేత చింతకాయ తొక్కు, కుడుములకు ఆధరువుగా పప్పుతో కలిపి ఫేమస్), పప్పుచారు, చుడువా (మిక్సర్), మవుడు (కారప్పూస), బిళ్లలు, మురుకులు, జంతుకాలు (ఇడియప్పం తరహాలో చేసుకునేవి), పేనీలు (దీపావళి స్వీట్), రైలుబండి పలారం (సన్నటి ఉండల్లా కుడుముల్లా చేసుకుని పోపు వేసుకోవడం), పల్లీల ముద్దలు, నువ్వుల ముద్దలు, పుట్నాల ముద్దలు, మలీద ముద్ద వంటి తెలంగాణ వంటకం ఒక్కటీ లేదు…
.
పైగా వీటిలో చాలా వంటకాల్ని నార్త్, సౌత్ ఇండియా స్టేట్స్ కూడా చేసుకుంటాయి… ప్రత్యేకించి ఇందులో అనేక వంటలు కర్నాటక, తమిళనాడుల్లో కూడా పాపులరే… సో, ఇవన్నీ కేవలం తెలుగువారి వంటలు అనలేం… సో, తెలుగువారి వంటలు అనే నిర్వచనం కరెక్టు కాదు… తెలంగాణకు సంబంధించిన రుచి, వాసన ఈ జాబితాలో లేనేలేవు… (జస్ట్, సరదాగా…) రాస్తూ పోతే ఇడ్లీలు, దోశెలు, పులిహోరలు, బిర్యానీలు, పచ్చళ్లలోనే వందల రకాలుంటయ్…
Share this Article