ఎస్… అది ఒకప్పటి ఈనాడు అయి ఉంటే… ఆ పుస్తకావిష్కరణకు సాక్షాత్తూ రామోజీరావు హాజరైనా సరే… ఆ వార్త కవరేజీ ఉండేది కాదు… కానీ ఇప్పటి ఈనాడు పాపం, రామోజీరావు ఈనాడు కాదు కదా… ఆయన ఎవరినో నమ్మాడు, వాళ్లు దాన్ని ఇష్టమున్న తోవకు తీసుకెళ్తున్నారు…ఈ స్థితిలో రామోజీరావు కూడా ఏమీ చేయలేడు ఇక… ఇప్పటి ఈనాడు రామోజీ చేతుల్లో కూడా లేదు… అయిపోయింది… లేకపోతే ఒక పుస్తకావిష్కరణకు ఒక ఫోెటో, పెద్ద వార్త… ఆమధ్య టీడీపీ రచయిత కందుల రమేష్ పుస్తకానికీ ఇలాగే బ్రహ్మాండమైన పబ్లిసిటీ ఇచ్చారు కదా… ఇప్పుడు ఇది… ఇక ఈ బుక్ విషయానికి వస్తే, ఈనాడులో ఒక ఎడిషన్‌కు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్న ఎం.నాగేశ్వరరావు ఈ పుస్తకావిష్కరణకు హాజరయ్యాడు కాబట్టి ఈ కవరేజీ… బహుశా ఈ పుస్తక బాధ్యులు ఎవరో ఆయన బంధువులో, మిత్రులో అయి ఉంటారు… ఈ వార్తలో విశ్రాంత విస్తరణ సంచాలకులు అనే ఏదో కిలికిలి భాషలో ఏదో హోదా రాశారు… ఆయన కూడా బాగా కావల్సిన మనిషే అయి ఉంటాడు…
సరే, రాస్తే రాసుకున్నారు… వాళ్ల పత్రిక, వాళ్లిష్టం, వాళ్లను నమ్మిన రామోజీరావు కష్టం… మనకెందుకు గానీ… ఇంతకీ అది ఈనాడు వంటి పత్రిక తన రొటీన్, పాత ఆనవాయితీని వదిలేసి మరీ ప్రయారిటీతో అచ్చేయాల్సినంత గొప్ప పుస్తకమా..? ఇళ్లల్లో మొక్కలు, పూలపెంపకానికి సంబంధించిన పుస్తకం… ఆమె ఏం రాసిందో, ఆ కంటెంటు ఏమిటో కాదు ఇక్కడ ప్రస్తావించుకునేది… ఏం రాయాలి, ఎలా రాయాలి అనేది ఆమె ఇష్టం… కానీ ఈనాడులో ఈ కవరేజీ తీరే హాహాశ్చర్యపరిచేది… వార్త రాసిన తీరు కూడా ఓసారి చూడండి… రైతునేస్తం పబ్లికేషన్స్ ప్రోత్సాహంతో పుస్తకానికి రూపం ఇచ్చారట, బంధువు బొందలపాటి కృష్ణకు అంకితమిచ్చారట.,. తొలిప్రతిని తల్లికి అందచేశారట… చివరకు ఎవరో బ్యాంకు మేనేజర్ పుస్తకాన్ని సమీక్షించారట… అంటే అదే పుస్తకంలో సమీక్ష కూడా ఉంటుందా..? గ్రేట్… ఈ మీటింగు అధ్యక్షత ఎవరో కూడా రాశారు… ఎటొచ్చీ ఈ వార్తలో మిస్సయిన గొప్ప పాయింట్లు ఏమిటంటే..? మీటింగు ఎక్కడ జరిగిందో కూడా రాశారు… టీ, స్నాక్స్ సప్లయర్స్ ఎవరో, చివరగా వందనసమర్పణ ఎవరు చేశారో రాయలేదు, మీటింగు చివరలో భోజనాలు పెట్టారా లేదా..? అవి ఎవరు సప్లయర్ చేశారు అనే వివరాలూ, క్లారిటీ లోపించాయి… ఎహె, కవరేజీ ఇస్తే, ఎంకరేజ్ చేస్తే మంచిదేగా అంటారా..? కరెక్టు… మరి ఆ సౌకర్యం ఇతర పుస్తకాలకు ఎందుకు దక్కదు..?!
Ads
Share this Article