Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ప్రత్యక్ష రాజకీయాల్లోకి కంగనా రనౌత్ ఎంట్రీ…! రాకపోతే ఆశ్చర్యం గానీ…!!

November 3, 2023 by M S R

కంగనా రనౌత్ అధికారికంగానే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది… ఇన్నాళ్లూ బీజేపీ సానుభూతిపరురాలు, ఇప్పుడు బీజేపీ నాయకురాలు… తన సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్, మండీ నియోజకవర్గం నుంచి హైకమాండ్ టికెట్టు ఖరారు చేసింది… ఇదీ ఆమె కృతజ్ఞతా ప్రకటన…



Kangana Ranaut
@KanganaTeam

My beloved Bharat and Bhartiya Janta’s own party, Bharatiya Janta party ( BJP) has always had my unconditional support, today the national leadership of BJP has announced me as their Loksabha candidate from my birth place Himachal Pradesh, Mandi (constituency) I abide by the high command’s decision on contesting Loksabha polls. I feel honoured and elated to officially join the party. I look forward to be a worthy karyakarta and a reliable public servant. Thanks

Ads



సరిగ్గా గత నవంబరులో కంగనా పొలిటికల్ ఎంట్రీపై ముచ్చట పబ్లిష్ చేసిన కథనం ఇది… మరోసారి… సందర్భం కాబట్టి…



నాలుగేళ్ల క్రితం… మణికర్ణిక సినిమా… తను అనుకున్నట్టు సినిమా రావడం లేదని, దర్శకుడు క్రిష్‌ను తరిమేసింది… మరికొందరు క్రాఫ్ట్స్‌మెన్ పారిపోయారు.,. తనే మెగాఫోన్ పట్టుకుంది… సినిమా పూర్తిచేసింది… సినిమా హిట్… ఆమె తెలుసు కదా… ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్…

తరువాత ఏమైంది..? పంగా సినిమా… ఫెయిల్… తలైవి… ఫ్లాప్… గత సంవత్సరం థాకడ్… మరీ డిజాస్టర్… పలు థియేటర్లలో ఏసీ ఛార్జీలు కూడా రాలేదు… థియేటర్ల యజమానులు, బయ్యర్లు బోరుమన్నారు… మొన్న తేజస్… నిజానికి సినిమా బాగుందనే టాక్ కొంతమంది నుంచి వచ్చింది, కానీ ఏం లాభం..? అదీ సూపర్ ఫ్లాప్… 60 కోట్లు ఖర్చు పెడితే 6 కోట్లు వచ్చినట్టు లెక్కలు చెప్పాయి సినిమా పత్రికలు, సైట్లు… చంద్రముఖి గురించి తెలిసిందే కదా… అట్టర్ ఫ్లాప్…

kangana

ఇప్పుడు ఆమె చేతిలో ఉన్నది ఒకే సినిమా… ఇందిరాగాంధీ మీద తీసిన ఎమర్జెన్సీ… దాని సంగతేమిటో ఇప్పుడే చెప్పలేం… దాని తరువాత ఏమిటి..? ఆమె దగ్గర కూడా ఏ సమాధానమూ లేదు… తను వెడ్స్ మను మూడో భాగం తీస్తుందట… తరువాత..? నిజానికి ఆమె మంచి నటి… కాకపోతే కంట్రవర్సీలంటే ఎదురెళ్లి మరీ కౌగిలించుకుంటుంది… ఆమె టెంపర్, ఆమె డేర్ చాలామంది తారల్లో ఉండదు… పాత్ర కోసం బరువు పెరగడం, తగ్గడం, ఇనుప సలాకలాగా మారిపోవడం కష్టమైనా చేస్తుంది, చేసింది…

kangana

మొదట్లో సినిమాల మీద పిచ్చితో ముంబై వచ్చి చాలా కష్టాలు పడింది… పుట్టిందేమో ఉన్నత, ధనిక కుటుంబం… కానీ అనామకురాలిగా జీవించింది… నానా చెత్త సినిమాలు చేసింది… పిచ్చి పాత్రలు… కడుపు కోసం వెగటు పాత్రలు… తరువాత నిలబడింది… ఎంతగా అంటే… ముంబై బాలీవుడ్ మాఫియాను సవాల్ చేసేంతగా… ఆ మాఫియాకు సపోర్ట్‌గా ఉండే పొలిటికల్ శక్తులనూ సవాల్ చేసింది… మొండి… బీజేపీ సానుభూతిపరురాలు… ఆమె వెనుక చాన్నాళ్లుగా బీజేపీ నిలబడే ఉంది…

kangana

సోదరి రంగోలీ యాసిడ్ బాధితురాలు… శివసేన ప్రభుత్వం ఆమె స్టూడియోను కూల్చేసింది… కేసులు పెట్టింది… కానీ భయపడలేదు… అయితే వరుసగా సినిమాలు తన్నేస్తున్న నేపథ్యంలో ఆమె తదుపరి అడుగు ఏమిటి..? ఒక నటికి వరుస ఫ్లాపులు పెద్ద వార్తేమీ కాదు, ఆమె తన సినిమా జీవితం మొదట్లో చాలా ఎదురుదెబ్బలు తిన్నది… ఈ ఫ్లాపులు ఆమెను కదల్చలేవు… కానీ ఇలా ఎన్నేళ్లు..? ఓ విలేకరి అదే అడిగేశాడు…

kangana

ఆమె ద్వారకలోని శ్రీకృష్ణుడి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసింది… ‘వచ్చే లోకసభ ఎన్నికల్లో మీరు పోటీచేస్తున్నారట కదా’’ ఇదీ ప్రశ్న… ‘‘శ్రీకృష్ణుడి ఆశీర్వాదం ఉంటే తప్పకుండా చేస్తా, పోరాడతా’’… ఇదీ ఆమె జవాబు… ఇంకేముంది..? బీజేపీ టికెట్టు కోసం ఆశిస్తోంది… ముంబైలోనో, హిమాచల్‌ప్రదేశ్‌లోని తన స్వస్థలంలోనో టికెట్టు వస్తే పోటీ చేస్తుంది… గెలుపో ఓటమో జానేదేవ్… పాలిటిక్స్‌లోకి ఇక నేరుగా ఎంట్రీ ఇస్తుంది అన్నమాట…

kangana

అప్పట్లో టీవీ సీత దీపిక చికిలియా నుంచి స్మృతీ ఇరానీ దాకా బీజేపీ చాలామందికి టికెట్లు ఇచ్చింది… కంగనాకు ఇవ్వడానికి కూడా బీజేపీకి పెద్ద అభ్యంతరమేమీ ఉండదు… ఐతే దాంతో ఇక వెండితెర నుంచి నిష్క్రమించినట్టేనా..? నో… నెవర్… ఆమె అంత త్వరగా వదిలిపెట్టదు… అది ఆమె తత్వమే కాదు… దేని దారి దానిదే…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions