అనసూయ అంటేనే అంత… తనకు బాగా తెలుసు అనుకుంటుంది, తనకు అన్నీ తెలుసని జనం తెలుసుకోవాలనీ అనుకుంటుంది… కాదంటే కయ్యమే… కేసులు పెడతా అని బెదిరిస్తుంది… ఏం మాట్లాడినా కంట్రవర్సీయే… ఒక్క రంగమ్మత్త పాత్రే తనను కాస్త నిలబెట్టింది… తరువాత ఏదో సినిమాలో అలాంటిదే ఓ ఐటం సాంగ్ (వైరాగ్యంతో కూడిన ఐటం సాంగ్…) చేసింది… మొన్నామధ్య ఓ వేశ్య పాత్ర చేసింది…
పెద్దకాపులో ఓ పాత్ర చేసింది… ఇకపై తనను ఎవరూ రంగమ్మత్త అని పిలవబోరనీ, పెదకాపు తరువాత ఆ పాత్ర పేరుతోనే పిలుస్తారనీ ఘాట్ఠిగా చెప్పుకుంది ఫాఫం… నిజానికి ఆ పాత్ర పేరేమిటో కూడా ప్రేక్షకజనం మరిచిపోయారు… అంత అన్ నోటీస్డ్‌గా వెళ్లిపోయింది ఆ సినిమా ప్లస్ అనసూయ ఆశ… ఎవరూ గుర్తించలేదు… సినిమా సూపర్ ఫ్లాప్…
ఇక ఇప్పుడు రజాకార్ సినిమా… ఇప్పటికే ఆమె బతుకమ్మ గెంతులు బాగా విమర్శలకు గురయ్యాయి… పైగా ఆమె మొహం ఫ్లెక్సిబుల్ కాదు, అన్ని రకాల ఉద్వేగాలకు సూట్ కాదు… ఆమె ప్రయత్నించదు కూడా… ఐనా సరే నేను ఓ మహానటిని అనే ఫీలింగ్, మాటలు బరాబర్ వస్తుంటయ్ ఆ నోటి నుంచి… నువ్వు కాదు ఆంటీ, నువ్వు మంచి నటివి అని ప్రేక్షకలోకం చెప్పాలి… బహుశా ఇది చెప్పినా కస్సుమంటుందేమో…
Ads
పెద్దకాపు సినిమా మీద ఎక్కడో మాట్లాడుతూ ‘‘ఆ సినిమాలో నా అవగాహనకు అందని అంశాలు కొన్ని ఉన్నయ్… ఐనా ఆ దర్శకుడి ముందు నేనెంత..? ఆయన విజన్ నాకు అర్థం కాలేదేమో… నా సీన్లు కూడా కొన్ని కత్తిరించారు… కథతో కనెక్షన్ పోయిందేమో అనిపించింది… ఐనాసరే దర్శకుడితో నాకు విభేదాలు ఏమీ లేవు… పార్ట్-2 కూడా వస్తోంది, బహుశా ఆ సినిమా చూశాక ఇప్పుడర్థం కాని అంశాలన్నీ అప్పుడు అర్థం అవుతాయేమో…’ అని చెప్పుకొచ్చింది…
నీకే కాదు ఆంటీ… దర్శకుడికి ఎంత లోతు తెలివితేటలు ఉన్నా సరే, ప్రేక్షకుడికి అర్థమయ్యేలా చెబితేనే సినిమా చూడబడుతుంది… దర్శకుడి విజన్ గొప్పదే కావచ్చుగాక… కానీ ప్రేక్షకుడి విజన్‌కు ఆనాలి… తనేం చెబుతున్నాడో తనకైనా అర్థమైందా అసలు..? అబ్బే, దర్శకుడి విజన్ ముందు నేనెంత..? నాకే అర్థం కాలేదు అంటున్నావు అంటే ఎక్కడో తేడా కొట్టిందని లెక్క… పరోక్షంగా ఈ సినిమా ప్రేక్షకులకు అర్థం కాలేదు అని దర్శకుడిని పరోక్షంగా తప్పుపడుతున్నట్టే లెక్క…
మళ్లీ దర్శకుడితో నాకేమీ మనస్పర్థలు లేవని సమర్థన మరోవైపు… అసలు నువ్వు ఏం చెప్పదలుచుకున్నావో నీకే అర్థం కాదు, సేమ్, ఆ సినిమా అంతే… ఆ దర్శకుడూ అంతే… దొందూ దొందే… రేప్పొద్దున రజాకార్ సినిమా మీద కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేస్తావేమో… నీ భాషలోనే చెప్పాలంటే… ము- కిందకు 38 ఏళ్లొచ్చినా ఇంకా ఆన్ రికార్డ్ ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలియకపోతే ఎలా అన్సాంటీ…
Share this Article