ఎవరు గెలుస్తారనేది పక్కన పెట్టండి… తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు బిగ్‌బాస్ తరహాలో రక్తికడుతున్నయ్… ప్రత్యేకించి కేసీయార్‌ను ఒక సీటులో బీజేపీ, మరో సీటులో కాంగ్రెస్ ఓడించే ప్రయాసలో, కసరత్తులో పడ్డాయి… కేసీయార్‌కు రెండు వైపులా టెన్షన్ మొదలైనట్టే… తను పోటీ చేస్తున్న రెండు సీట్లలోనూ బాగా ఎఫర్ట్ పెట్టాల్సిన స్థితిలోకి నెట్టేయబడ్డాడు…
అసలు తను గజ్వెల్‌తోపాటు కామారెడ్డిలో పోటీచేయడంపైనే కొన్ని విమర్శలున్నయ్… అక్కడ గెలవలేక, ఎందుకైనా మంచిదని కామారెడ్డికి వలస వస్తున్నాడని కాంగ్రెస్ వెక్కిరిస్తోంది… ఆయన ఇవేమీ పట్టించుకోకుండా సిద్దిపేట సమీపంలోని కోనాయపల్లి వెంకటేశ్వరస్వామి గుడిలో తన సెంటిమెంట్ ప్రకారం రెండు స్థానాల నామినేషన్ పత్రాలకు పూజ చేయించేశాడు… కథ ఇప్పుడు ఎక్కడ రక్తికడుతున్నదీ అంటే…
ఆల్‌రెడీ ఈటల రాజేందర్ తన హుజూరాబాద్ నుంచే గాకుండా కేసీయార్ సీట్ గజ్వెల్ నుంచి కూడా పోటీచేస్తున్నాడు… అక్కడ ముదిరాజ్ వోట్లు ఎక్కువట… ఈటల ముదిరాజ్… ముదిరాజుల్లో కేసీయార్ పట్ల వ్యతిరేకత ఉంది… అది చల్లార్చడానికి ఓ ఉద్యోగసంఘ నేతను, నిన్న కాసానిని పార్టీలో చేర్చుకున్నారు… కానీ అక్కడ పరిస్థితి మెరుగుపడిందా అంటే చెప్పడం కష్టం… ఈటల అసలే కేసీయార్ మీద కసిగా ఉన్నాడు… గెలుపో ఓటమో జానేదేవ్, వీలైనంతగా తిప్పలు పెట్టాలని భావిస్తున్నాడు…
Ads
పోతేపోనీలే, గజ్వెల్ కాకపోతే కామారెడ్డి లేదా అనుకునే సిట్యుయేషన్ లేదు… అక్కడ రేవంత్ రెడ్డి కమ్ముకొస్తున్నాడు… తన సీటు కొడంగల్‌తోపాటు కామారెడ్డి నుంచి పోటీచేయాలని హైకమాండ్ ఆదేశించింది… మరి అక్కడ ఎప్పుడూ నిలబడే షబ్బీర్ పరిస్థితి ఏమిటంటారా..? తనను నిజామాబాద్ అర్బన్ సీటుకు డైవర్ట్ చేస్తారు…
ఇక కామారెడ్డి మీద రేవంత్‌రెడ్డి బాగా కాన్సంట్రేట్ చేస్తాడు… రెడ్డి వోట్లు ఎక్కువే… పైగా ప్రస్తుతం ప్రభుత్వం మీద వ్యతిరేకత కూడా పెరిగి ఉంది… కాస్త కష్టపడితే కేసీయార్‌కు చెక్ పెడతాననేది రేవంత రెడ్డి నమ్మకం… నిజంగానే ఓడిస్తే జెయింట్ కిల్లర్ అవుతాడు… తనే ఓడిపోతే పోయేదేమీ లేదు… కొడంగల్ ఎలాగూ ఉందిగా…
అయితే ఇవన్నీ అంత వీజీ కాదు… పుష్కలంగా సాధనసంపత్తి ఉన్న కేసీయార్ పెట్టే ఎఫర్ట్ ముందు ఈటల, రేవంత్ నిలబడతారా అనేది ప్రశ్నే… కాకపోతే ఈ రెండు స్థానాల్లోనూ ఎన్నికల హడావుడి మామూలుగా ఉండబోవడం లేదు… ఖర్చు కూడా ఓ రేంజులో ఉండబోతోంది… ఇక్కడ వోటుకు ఎంత అనేది కాదు ప్రశ్న… కేసీయార్‌ను కూడా ఇరువైపులా ఢీకొడుతున్న తీరు, అదీ రెండు విపక్షాల నుంచి ఓ మోస్తరు రేంజ్‌లో ఎదుర్కునే తీరు విశేషం… తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు రక్తికడుతున్నయ్…!!
Share this Article