యాడ్స్… వాణిజ్య ప్రకటనలు… పత్రికలు, సైట్లు, టీవీలు, హోర్డింగులు, రేడియోలు, సినిమాలు… ఎన్నిరకాలుగా ప్రజల బుర్రల్లోకి ఎక్కించాలో అన్నిరకాలుగానూ ఎక్కిస్తున్నారు… కొత్త కొత్త మార్గాలు వెతికి మరీ కుమ్మేస్తున్నారు… బస్సు టికెట్ల నుంచి దర్శనం టికెట్ల దాకా… యాడ్స్ సోకని సరుకు లేదు… ఎప్పుడూ టీవీలు చూసేవాళ్లకు తెలుసు… మరీ ప్రధానంగా తెలుగు టీవీ సీరియళ్లు… ఎపిసోడ్ అయిపోతుంటే మూడు నిమిషాలు, ఒక్క డైలాగ్, మళ్లీ మూడు నిమిషాలు… ఇలా ఉంటయ్ యాడ్స్… సీరియళ్ల మధ్యలో కూడా పాత్రధారులు ఏదో యాడ్ చదువుతారు… ఏదో రోడ్ చూపిస్తారు, బ్రిడ్జి మీద యాడ్… డివైడర్ మీద యాడ్… బిగ్‌బాస్ వంటి షోలలో యాడ్స్ బేస్డ్ టాస్కులు… సినిమా ప్రమోషన్లు… వావ్, క్యాష్ వంటి షోలనూ కొన్నిసార్లు కొన్ని సినిమాల ప్రమోషన్ కోసం అంకితం చేస్తుంటారు… ఇన్నేళ్లూ జబర్దస్త్ ఈ యాడ్స్, ప్రమోషన్ల పైత్యానికి కాస్త దూరంగా ఉండేది… ఇప్పుడు దాన్ని కూడా భ్రష్టుపట్టించే కార్యక్రమం స్టార్టయిపోయింది…
త్వరలో జాంబిరెడ్డి అనే ఓ తెలుగు సినిమా రాబోతోంది తెలుసు కదా… ప్రశాంత్ వర్మ డైరెక్టర్, ఎవరో సజ్జా తేజ అట, హీరో… అందులో జబర్దస్త్ కమెడియన్ గెటప్ సీనుకు కూడా ఓ పాత్ర దక్కినట్టుంది… రాబోయే జబర్దస్త్ షోలో ఒక స్కిట్‌ను జాంబిరెడ్డి ప్రమోషన్‌కు అంకితం చేశారు… పైగా సుధీర్ టీంతో చేయించారు… మల్లెమాలకు టేస్టు తక్కువే అనుకున్నాం, ఈ డబ్బు యావ కూడా బాగానే ఉన్నట్టుంది… అసలే ఈ కమెడియన్లు అందరూ ‘బాండెడ్ లేబర్’ కదా… అంటే బాండ్లలో, లిఖిత ఒప్పందాల్లో బందీలు కదా… అందుకే జాంబిరెడ్డి ప్రమోషన్ స్కిట్ చేయండోయ్ అనగానే చేసేసినట్టున్నారు… సరే, ఈ స్కిట్, ఈమధ్యకాలంలోని జబర్దస్త్ స్కిట్లలాగే నాసిరకంగా ఏడ్చింది… ఐనా చేసేదేముంది..? వేరే దిక్కులేదు కదా, జనం చూసేస్తూనే ఉంటారు…!!
Ads
Share this Article